బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

On
బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు,  బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

హోమశాలలో ప్రత్యేక పూజలు - 40 లక్షలకు పైగా ఆదాయం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
 (రామ కిష్టయ్య సంగన భట్ల)

  బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఆది వారం నిర్వహించిన శ్రీవేంకటేశ్వర డోలోత్సవ సందర్భంగా, వంశపారం పర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలలనుం కాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాలనుండి ఏతెంచిన భక్తజనం దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్నారు. పిల్లా పాపలతో గోదావరి నదికి మూటా ముళ్ళే నెత్తిన పెట్టుకు వచ్చిన భక్తులు, మంగళ స్నానాలను ఆచరించి, గోదావరి మాతను అర్చించి, దానధర్మాదులను ఆచరించి, వివిధ ఆలయాలలో దైవ దర్శనాలు చేసుకున్నారు. శ్రీవేంకటేశ్వర మందిరంలో చిరకాల వాంఛలు ఈడేర్చాలని ప్రార్ధిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.

హోమశాలలో ప్రత్యేక పూజలు

 శ్రీ వేంకటేశ్వర తెప్పోత్సవ, డోలోత్సవ నిర్వ హణదినమైన ఆది వారం దేవస్థానంలో ప్రత్యేక బ్రహ్మోత్సవ పూజలు నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య యాజ్ఞికులు, దేవతా పౌరోహితులు కండాలై పురుషోత్తమా చార్య, ఆస్థాన వేదపండితులు రమేశ శర్మల ఆధ్వర్యంలో, అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య, మోహనా చార్య, కిరణ్, వంశీ, విజయ్ ఉదయం నుండి యాగశాలకు స్వాముల ఉత్సవ మూర్తులను వేంచేపుచేసి, బ్రహ్మకలశ పూజ, ధ్వజారోహణము, తిరుక్కళ్యాణం, నిత్య హోమ పంటపంలో కలశ, విశ్వక్సేన, కర్మణః, పుణ్యావాచనం, అగ్నిద్యానం, వాసుదేవ, నారాయణ మంత్ర హవనం, సమిద్ద హోమం, పంచసూక్త హవనాలు, ద్వాదశ దేవతా హోమాలు, సప్తావరణ హోమాలు, అష్టమంగళ, మూర్తి, సుదర్శన, విశ్సక్సేన, సర్వదేవతా, గరుడ హవనాలు, మూల మంత్ర హోమాలు, స్థాపిత దేవతా హవనములు, దోష పరి హారార్ధం నవగ్రహ, నక్షత్ర హోమాలు నిర్వహించారు. మద్యాహ్నం బలి ప్రదానం, అష్ట దిక్పాలకుల ధ్వజారో హణం, గరుడ బ్రహ్మలకు బలిప్రదానం గావించగా, భక్తులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలలో పాల్గొని, కానుకలు, ముడుపులు, మొక్కులు చెల్లించు కున్నారు. దేవస్థానం పక్షాన భక్తులందరికీ ఉచిత అన్నదానం గావించారు. స్థానిక ఆర్యవైశ్యులు, విద్యార్థులు స్వచ్చంద సేవకులుగా సేవలందించి, భక్తుల, యాత్రికుల ప్రశంసాపాత్మలైనారు. దేవస్థానం ఈ శ్రీనివాస్,  చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్, పాలెపు గణేశ్, 
 సిబ్బంది, స్వచ్చంద సంఘాల బాధ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాలలో భాగంగా శేషప్ప కళా వేదికపై సంగీత రత్న కొరిడే నరహరి శర్మ ఆద్వర్యంలో దేవస్థానం పక్షాన నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రధానంగా శేషప్ప భక్త మండలి ఆధ్వర్యంలో ఎన్నం బాపురెడ్డి నిర్వహణలో సభ్యులు శేషప్ప విరచిత నరసింహ శతక పద్య గానం చేశారు. ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు గాయకులను సత్కరించారు. 

 దేవస్థానానికి గణనీయ ఆదాయం

బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవస్థానానికి 10వ తేదీ నుండి 15 వరకు ఆరు రోజులకు గాను 
గణనీయ ఆదాయం లభిస్తున్నది. వివిధ టికెట్ల ద్వారా 17,33,886 రూపాయలు, లడ్డూ, పులిహోర ప్రసాదం ద్వారా 19,34,010 రూపాయలు, 
 అన్నదానం ద్వారా 4,26,388 రూపాయలు, మొత్తం 40,94,284 రూపాయల ఆదాయం లభించినట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు.

ప్రశంసా పాత్రం... అన్నపూర్ణ సమితి సేవాభావం

స్థానిక అన్నపూర్ణ సేవా సమితి బ్రహ్మోత్సవాలలో చేస్తున్న సేవలు ప్రశంసాపా త్రాలు అవుతున్నాయి. సామాజిక సేవే పరమావధిగా పట్టణ వాసులకు ఎన్నో ప్రజాహిత సేవలు అందిస్తున్న సేవాసమితి, ఈ సారి బ్రహ్మోత్సవాలలో అనుదినం దేవస్థాన
నం ...గోదావరి మార్గంలో భక్తుల దాహార్తి తీర్చేందుకు శీతల పానీయాలు, త్రాగునీరు అందిస్తున్నారు. ప్రధానంగా తెప్పోత్సవం, డోలోత్సవాల సందర్భంగా లస్సీ మజ్జిగ అందించి ప్రశంసలను పొందుతున్నారు. పెద్దంభట్ల నరేందర్ శర్మ నేతృత్వంలో , కొరిడే శంకర్, గుండి రామనాథం, కోరిడే దత్తాత్రేయ, 
పెండ్యాల బాల కృష్ణ, రవీందర్, మధు శంకర్, కషోజ్జల రాజేశ్వర శర్మ, అలువాల దత్తాత్రి, సంగన భట్ల నరేందర్, లక్ష్మీకాంత్, బావి మురళి తదితర సేవా సమితి బాధ్యులు స్వచ్ఛంద సేవలు అందించి ప్రశంసలను అందుకుంటున్నారు.

IMG-20250316-WA0010
 బ్రహ్మ పుష్కరిణిలో...
కోనేటి రాయుని జలవిహారం

రామ కిష్టయ్య సంగన భట్ల...
      
 ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న స్వామివారల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, ఆది వారం కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. సాయంత్రం ఐదు గంటలకు ముందుగా ప్రధానాలయంనుండి శ్రీవేంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావించి, మంగళవాద్యాలు, వేదమంత్రాల యుక్తంగా కోనేరుకు ఊరేగింపుగా వెళ్ళి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించగా భక్తులు ఆనందోత్సాహాలతో జయజయ ధ్వనాలతో స్వాగతించారు. ప్రత్యేక నూతన నిర్మిత హంస వాహనంపై స్వామిని ఆసీనుల గావించి, కోనేరు నీటిపై ఐదు ప్రదక్షిణలు చేయగా, ముకుళిత హస్తాలతో భక్తులు స్వామిని అనుసరించారు. పుష్కరిణి మధ్యభాగాన గల భోగమంట పంలోని ఊయలలో స్వామిని ఆసీనులచేసి నిర్వహించిన డోలోత్సవాన్ని కన్నులారాగాంచి భక్తులు తరించారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు, వేదఘోషలు, ఆశీర్వచనాలు, తదితర కార్యక్రమాలను దేవస్థానం అర్చకులు నేరేళ్ళ శ్రీనివా సాచార్య, విజయ్, వంశీ, మోహనాచార్య, కిరణ్ తదితరులు నిర్వహించారు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్, కమిటీ చైర్మన్ రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, తదితరులు కార్యక్రమాలకు హాజరైనారు.

అవధులు దాటిన ఆనందం..

 బ్రహ్మోత్సవాలలో భాగంగా, యోగానంద, ఉగ్ర నరసింహుల దక్షిథ దిగ్యాత్రలో అంతర్భాగంగా, మంగళ వారం సాయంత్రం నుండి రాత్రి వరకు నిర్వహించిన కార్యక్రమాలలో పోలీసులు ఆనందం అవధులు దాటింది. సాయంత్రం ఇరువురు స్వాములను తమ స్టేషన్ కు ఆహ్వానించడానికి డీఎస్పీ రఘు చందర్,  సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్,
పలువురు ఎస్ ఐలు దేవస్థానంలో ఉత్సవ మూర్తుల పూజలో పాల్గొన్న అనంతరం సాంప్రదాయ ఊరేగింపు ప్రారంభమైంది. నంది 
 విగ్రహ కూడలి ద్వారా ఊరేగింపులో పోలీసులు ఆనందంలో నృత్యాలు ప్రారంభించారు. సాంప్రదాయ బాజా బజంత్రీలు, బ్యాండు మేళాలు, డీజే ధ్వనులు, ఒగ్గుడోలు వాద్యాలతో కళాకారుల విన్యాసాలతో సాగిన ఊరేగింపులో స్థానిక అధికారులు, పోలీసులు వీరావేశాలతో నేపథ్య సంగీతంతో స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో ఊరేగింపు సేవలు స్టేషన్ ఆవరణకు చేరడానికి చాలా సమయం పట్టింది.


రక్షకభట కార్యాలయంలో లక్ష్మీనారసింహుడు


నేరస్తులో, నేర చరితులో, ఫిర్యాదుదారులో, పైరవీకారులో, వివిధ పార్టీల నేతలో, పోలీసుల కుటుంబ సభ్యులో... రక్షకభట కార్యాలయ ప్రాంగణంలో తిరుగాడడం సర్వసాధారణమే అయినా... సాక్షాత్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీలక్ష్మీనృసింహుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనారసింహుడు బ్రహ్మో త్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేషనుకు వెళ్ళి విశేష పూజలందు కోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈ కార్యక్ర మంలో భాగంగా సాయంత్రం దేవస్థానం నుండి మున్సిపల్ కార్యాలయం, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్ స్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారి మీదుగా, బాజా భజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా యోగ, ఉగ్ర స్వాముల ఉత్సవ మూర్తులను బ్యాండు మేళాలతో, సాంప్రదాయ నృత్యంతో కళాకారుల విన్యాసాలతో, ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. 


 జగిత్యాల డీఎస్సీ రఘు చందర్, ధర్మ పురి సిఐ రాం నరసింహా రెడ్డి, సిఐలు వేణు, రవి, 
ధర్మపురి ఎస్ ఐ ఉదయ్ కుమార్ దంపతులు, ఇతర ఎస్ ఐ లు శ్రీధర్ రెడ్డి, సాగర్, సతీష్, ఎఎస్ఐలు, సిబ్బంది ఊరేగింపులో పాల్గొని నడిచి వెళ్ళి, స్టేషన్ వద్దకు రాగానే ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు. పోలీస్ అధికారులు  సేవలను భుజాలపై పెట్టుకుని నడిచారు. తమ వద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని సిఐలు, ఎస్ఐలే కాక, భక్తులు, పోలీసులు కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు.
స్టేషన్ ప్రాంగణాన ప్రత్యేక నిర్మిత వేదికపై ఉత్సవ మూర్తులను ఆసీనుల జేసి ప్రత్యేక పూజలొ నరించారు. దేవస్థాన పౌరోహితులు పురుషోత్తమా చార్య, ఆస్థాన వేదపండితులు, పురోహి తులు సంతోష్ శర్మ, సంపత్ కుమార్ శర్మ, రాజగోపాల్ శర్మ , అర్చకులు మూర్తి, అరుణ్, ప్రవీణ్, వంశీ, అశ్విన్, 
, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు వేద మంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. హారతు లిచ్చారు. స్వామి, అమ్మ వారలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. పోలీసులు కుటుంబ సభ్యులేగాక, ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందు కున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్ర మాలలో  ఈఓ శ్రీనివాస్, చైర్మన్ రవీందర్, సభ్యులు, ప్రజా ప్రతినిధులు నాయకులు, 
పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలో గల ఉద్యోగులు, పరిసర ప్రాంత వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు స్వామిని దర్శించిన వారందరికీ స్వామి ప్రసాదంగా పులిహోర, మిఠాయిలు పెంచారు.

Tags
Join WhatsApp

More News...

Crime  State News 

శిశువుతో మహిళా జర్నలిస్టుకు సీసీఎస్‌లో గంటల తరబడి విచారణ

శిశువుతో మహిళా జర్నలిస్టుకు సీసీఎస్‌లో గంటల తరబడి విచారణ హైదరాబాద్, అక్టోబర్‌ 8 (ప్రజా మంటలు): ఆరు నెలల పసికందును చేతుల్లో ఎత్తుకుని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)కు వెళ్లిన మహిళా జర్నలిస్టు జల్లి రేఖను దాదాపు ఏడు గంటలపాటు అక్కడే ఉంచి ప్రశ్నించారనే ఆరోపణలు హైదరాబాద్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె వెంట మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. మహిళా...
Read More...
Local News  Crime 

లక్ష్మీపూర్‌లో కోడి పందాలపై పోలీసుల దాడి

లక్ష్మీపూర్‌లో కోడి పందాలపై పోలీసుల దాడి గొల్లపల్లి అక్టోబర్ 08 (ప్రజా మంటలు): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో గొల్లపల్లి పోలీసులు దాడి నిర్వహించారు. గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ కృష్ణసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి పోలీసులు లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు ఎనిమిది మంది వ్యక్తులు, మరికొందరు కలిసి...
Read More...
Local News 

విద్యుత్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి

విద్యుత్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి ఎల్కతుర్తి, అక్టోబర్ 8 (ప్రజా మంటలు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్లతో పాటు 132/32 కేవీ భీమదేవరపల్లి సబ్‌స్టేషన్‌ను టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న...
Read More...
Local News 

జగిత్యాల మెడికల్ కళాశాల భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారు?

జగిత్యాల మెడికల్ కళాశాల భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారు? జగిత్యాల, అక్టోబర్ 08 (ప్రజా మంటలు): విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులని, వాటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావా వసంత సురేష్, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన...
Read More...
Local News 

ఆర్టీసీ డిపో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, డిసిసి అధ్యక్షులు నందయ్య

ఆర్టీసీ డిపో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, డిసిసి అధ్యక్షులు నందయ్య జగిత్యాల అక్టోబర్ 8 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వద్ద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్ టి సి యూనియన్ ఎన్నికల్లో  ఐ ఎన్ టి యు సి ,ఎస్ డబ్ల్యూ యూ, టి డబ్ల్యూయూ,  ఎస్ డబ్ల్యూ  ఎఫ్   లకు మద్దతుగా బాణం గుర్తుకే ఓటు...
Read More...
Local News 

ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు :  బీజేపీ నేత ఖమ్మం వేంకటేశం

ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు :  బీజేపీ నేత ఖమ్మం వేంకటేశం కోహెడ, అక్టోబర్ 08 (ప్రజా మంటలు): ఆలయాల అభివృద్ధి కోసం భక్తులు, దాతలు సమకూర్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేసుకోవడం సరికాదని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం అన్నారు. గురువారం కోహెడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి...
Read More...
Local News 

రోల్లవాగు ప్రాజెక్టు పూర్తికి కృషి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

రోల్లవాగు ప్రాజెక్టు పూర్తికి కృషి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీర్పూర్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు): గోదావరి పుష్కరాల నేపథ్యంలో బీర్పూర్ మండలంలోని రంగసాగర్, మంగేలా, కమ్మనూరు, చిత్రవేణిగూడెం, రేకులపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పర్యటించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగేలా ఆశ్రమ పాఠశాలలో...
Read More...
Crime 

రూ.12 వేల లంచం తీసుకుంటూ అటవీ అధికారి అరెస్ట్

రూ.12 వేల లంచం తీసుకుంటూ అటవీ అధికారి అరెస్ట్ ఖానాపూర్ అక్టోబర్‌ 08 (ప్రజా మంటలు): నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టింబర్ డిపో పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి రవీందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.
Read More...
Local News 

ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‘బ్లాక్ డే’

ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‘బ్లాక్ డే’ కరీంనగర్ అక్టొబర్ 08(ప్రజా మంటలు): AICC, TPCC పిలుపు మేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ‘బ్లాక్ డే’ నిరసన చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు. కార్పొరేషన్...
Read More...
Local News 

రేకుల షెడ్డులోనే వైద్య తరగతులా?

రేకుల షెడ్డులోనే వైద్య తరగతులా? జగిత్యాల అక్టోబర్‌ 08 (ప్రజా మంటలు): ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తమకు కనీస వసతులు కల్పించడంలేదని ఆరోపిస్తూ వరుసగా రెండో రోజు ఆందోళనకు దిగారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనలో ప్రధానంగా తరగతి గదులు, మౌలిక వసతుల కొరత...
Read More...
National  Entertainment  

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత ముంబాయి అక్టోబర్‌ 08: ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో ఆయన అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మణిపాల్ ఆసుపత్రి వైద్యుల ప్రకారం నానా పటేకర్ ...
Read More...
Local News 

రైతుల సంక్షేమానికి పీఏసీఎస్‌లు సమర్థవంతంగా పనిచేయాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

రైతుల సంక్షేమానికి పీఏసీఎస్‌లు సమర్థవంతంగా పనిచేయాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రాయికల్, అక్టోబర్ 7 (ప్రజా మంటలు): రైతుల సంక్షేమం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌) మరింత సమర్థవంతంగా పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సూచించారు. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహించిన ఇటిక్యాల పీఏసీఎస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పీఏసీఎస్...
Read More...