హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్. - రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్ ను... డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో అనుసంధానించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. లండన్ కేంద్రంగా పనిచేసే ‘PHUSE’ ఆధ్వర్యంలో ‘PHUSE APAC Connect 2026’ పేరిట హెచ్ఐసీసీలో నిర్వహించిన సదస్సులో క్లినికల్ రీసెర్చ్, డేటా సైన్స్ అనుసంధానంపై దేశ, విదేశాల నిపుణులు మేధోమథనం చేశారు. శనివారం ఏర్పాటు చేసిన ఈ కాన్ఫరెన్స్ ముగింపు వేడుకకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ....
- హెల్త్ కేర్ భవిష్యత్తు రాబోయే రోజుల్లో క్లినికల్ సైన్స్, ఏఐ, రియల్ వరల్డ్ ఎవిడెన్స్ మేళవింపుపైనే ఆధారపడి ఉంటుందన్నారు.
- ముఖ్యంగా క్లినికల్ రీసెర్చ్ లో విప్లవాత్మక మార్పులొస్తాయని, టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతుందన్నారు.
- ఇలాంటి తరుణంలో అందుకు అవసరమైన ఎకో సిస్టంను ఇప్పటి నుంచే తెలంగాణలో అభివృద్ధి చేసేలా దార్శనికతతో కూడిన అడుగులు వేస్తున్నామన్నారు.
- అందులో భాగంగానే... ఏఐ సిటీ, యంగ్ ఇండియన్ స్కిల్స్ వర్సిటీ, జీనోమ్ వ్యాలీ విస్తరణ, డేటా మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైలింగ్, మెడికల్ టూరిజం పాలసీ, తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్ కు శ్రీకారం చుట్టామన్నారు. సైన్స్, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేసినప్పుడే సమాజానికి నిజమైన మేలు జరుగుతుందన్నారు.
- అందుకోసం పరిశోధకులు, వైద్యులు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరముందన్నారు.
- నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పరిశోధకులను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.
కార్యక్రమంలో PHUSE బోర్డు ఛైర్మన్ స్టీఫెన్ బాఫోర్డ్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ సర్వేష్ సింగ్, ఐటీ అడ్వైజర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
హీలింగ్ క్యాపిటల్ గా హైదరాబాద్. - రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్ కేర్... తెలంగాణ మాజీ మంత్రి టి. హరీష్ రావు సమక్షంలో భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు 'RENGY' యాప్ ప్రారంభం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 21 ఫిబ్రవరి (ప్రజా మంటలు) :
నివాస గృహాల ఇంధన అవసరాల కోసం డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందిస్తున్న క్లీన్-టెక్ ఎనర్జీ సంస్థ 'రెంజి’ (Rengy) ప్రైవేట్ లిమిటెడ్'.
నేడు (21 ఫిబ్రవరి 2026) తన ప్రతిష్టాత్మక RENGY యాప్‌ను ప్రారంభించింది తెలంగాణ మాజీ మంత్రి... సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు — జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అన్నారు.
శనివారం జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు—జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో—ఎమ్మెల్యేను కలిసి... కర్ణాటక రాజకీయాల్లో సంచలం: బీజేపీ ఎమ్మెల్యే డా చంద్రూలమానీ లంచం కేసులో అరెస్ట్
బెంగళూరు ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):
కర్ణాటక రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే చంద్రూలమానీ లంచం కేసులో అరెస్టయ్యారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణ పనుల కేటాయింపుకు గాను రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసిన... స్కూల్ విద్యార్థులకు ఏప్రిల్ 10 నుంచి 20 వరకు SA-II పరీక్షలు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి, తరగతులు 1 నుంచి 9 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-II (SA-II) పరీక్షలు ఏప్రిల్ 10 నుంచి 20, 2026 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పరీక్షల టైమ్‌టేబుల్‌ను SCERT విడుదల చేసింది.ఏప్రిల్ 10,... ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద మృతి
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు-దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాశెట్టి గణేష్‌కు చెందిన వ్యవసాయ భూమిలో ఎర్రోళ్ల లింబాద్రి (51), తండ్రి గంగారం, నివాసం మొగిలిపేట (మల్లాపూర్ మండలం) మృతదేహం లభ్యమైంది.
మృతుడి తలకు తీవ్ర గాయాలు ఉండటంతో... ట్రేడ్ లేదా ట్రాప్? జపాన్ మార్కెట్లలో ‘టకైచి ప్రభావం’పై పెట్టుబడిదారుల సందేహాలు
టోక్యో ఫిబ్రవరి 21:
జపాన్‌లో జరిగిన ఎన్నికల్లో సానయే టకైచి ఘన విజయం సాధించడంతో, జపాన్ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకాయి. ముఖ్యంగా నిక్కీ 225 సూచీ ఒక్క వారంలోనే సుమారు 5 శాతం పెరగడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని పెంచింది.
అయితే ఈ ఉత్సాహం వెనుక ఆందోళన కూడా దాగి ఉందని మార్కెట్ నిపుణులు... జాతీయ స్థాయిలో ‘ఏఐ కౌన్సిల్’, ప్రత్యేక ‘ఏఐ మంత్రిత్వ శాఖ’ ఏర్పాటు చేయాలి.— ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో, జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో ప్రత్యేకంగా ఒక “ఏఐ కౌన్సిల్” ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. అలాగే జాతీయ... అమెరికా సుప్రీం కోర్ట్ షాక్ – ట్రంప్ టారిఫ్ యుద్ధం కొత్త మలుపు
వసూలు చేసిన టారిఫ్ నిధులు తిరిగి ఇచ్చేయాలా?
హైదరాబాద్ ఫిబ్రవరి 21:
అమెరికా వాణిజ్య విధానాల్లో కీలక మలుపుగా, అమెరికా సుప్రీం కోర్ట్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన టారిఫ్‌లకు చట్టపరమైన బ్రేక్ వేసింది. జాతీయ భద్రత పేరుతో దిగుమతులపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు ఏకపక్షంగా వినియోగించలేడని కోర్ట్ స్పష్టం చేసింది. ఇది... ఇంటర్మీడియట్ బోర్డు ను ముట్టడించిన జాగృతి విద్యార్థి నాయకులు
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ప్రజా మంటలు):
నాంపల్లిలో ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించిన తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్
నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయాన్ని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ముట్టడించారు.అనుమతి లేని ఇంటర్ కాలేజీలకు బోర్డు కొమ్ముకాస్తూ, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విద్యార్థి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.... బిసి రిజర్వేషన్ల ఖరారు తర్వాతనే జెడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్కు బీసీ నాయకులు వినతి
జగిత్యాల ఫిబ్రవరి 20 (ప్రజా మంటలు) స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల తర్వాతనే జడ్.పి.టి.సి., ఎం.పి.టి.సి. ఎన్నికలకు వెళ్ళాలి. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని బీసీ నాయకులు అన్నారు .
రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బిసిలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పి, 42% రిజర్వేషన్లను కల్పించకుండానే సర్పంచ్... పలు ఆలయాలు సందర్శించిన మున్సిపల్ నూతన చైర్పర్సన్ దంపతులు
జగిత్యాల సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు) ఇటీవల జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు జరగగా చైర్పర్సన్ గా ఎన్నికైన సమిండ్ల వాణి శ్రీనివాస్ దంపతులు జిల్లా కేంద్రంలోని ఎడ్లంగడి శ్రీ రామాలయం కూరగాయల మార్కెట్లో గల శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయాన్ని శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం... 