త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు – 

On
త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు – 

అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):


తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, త్వరలోనే తెలంగాణ ప్రజలకు సేవ చేసే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ఈ కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు.

IMG-20260305-WA0021
తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. ఎన్నికలకే పరిమితం కాకుండా తెలంగాణ హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మహిళలు, యువతను విస్మరించిందని ఆరోపించిన ఆమె, ఆ వర్గాల సమస్యలను తమ పార్టీ అజెండాగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే పార్టీగా తమ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు.


ఆంధ్రా ప్రజలంటే తమకు ఎలాంటి ద్వేషం లేదని, ఆంధ్రా రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకించామని కవిత అన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి రాష్ట్రం తన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గురించి మాట్లాడుతూ, తాను చేయని తప్పుకు నాలుగేళ్లుగా తనపై మరియు తన కుటుంబంపై తీవ్ర మానసిక వేదన కలిగించారని అన్నారు. అయితే దేవుడి ఆశీస్సులతో కోర్టు ఆ కేసును కొట్టివేసిందని చెప్పారు. తిరుమలకు కాలినడకన వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం తమ కుటుంబానికి ఒక మొక్కు అని, త్వరలో ప్రారంభించబోయే కొత్త పార్టీకి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు.
తిరుమలలో లడ్డూ కల్తీ వివాదంపై స్పందించిన కవిత, వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నారని పేర్కొన్నారు. టీటీడీ వ్యవహారంలో భక్తులకు విశ్వాసం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.


మరోవైపు హైడ్రా చర్యలపై కూడా ఆమె విమర్శలు చేశారు. పెద్దలను కాపాడుతూ పేదలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం అయినా పెద్దల కోసం పేదలకు అన్యాయం చేసే పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అన్నారు. శుక్రవారం ఉదయం కవిత శ్రీవారి దర్శనం అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

Join WhatsApp

More News...

Local News 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు 

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు  జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు...
Read More...
Crime  State News 

విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్

విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్ వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన...
Read More...
Local News 

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం...
Read More...
Local News 

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు): సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు.  తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా...
Read More...
Local News 

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్‌ రమేష్‌ 

మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్‌ రమేష్‌     సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు): టీఎన్‌జీవో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ ఫోరం హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్‌ పల్లాటి రమేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  టీఎన్‌జీవో యూనియన్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో  సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన...
Read More...
Local News 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం 

స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం  సికింద్రాబాద్,  ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):  హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ...
Read More...
Local News 

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు): ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000...
Read More...
National  Filmi News 

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు

బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది. ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల...
Read More...
Crime 

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు   గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు): భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో...
Read More...
Local News 

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం

ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు  సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర...
Read More...
Local News 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు  జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)  పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు. మహాత్మ జ్యోతిరావు పూలే  ఆశయాలు భారత సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, సామాజిక సంస్కరణల మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన ఆలోచనలు చాలా ముందుచూపుతో కూడినవిఅన్నారు.     ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి
Read More...
Local News 

కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)  ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం.. జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్..   రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ...
Read More...