హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి
డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం
హైదరాబాద్ మార్చ్ 08 (ప్రజా మంటలు):
దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.

దేశంలోని కొన్ని ప్రధాన నగరాలు ప్రస్తుతం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ముంబయ్‌లో భారీ వర్షాలు పడితే నగరం అస్తవ్యస్తమవుతుందని, ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉందని చెప్పారు. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, చెన్నైలో వరదల సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని గుర్తు చేశారు.
ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో హైదరాబాద్‌లో తలెత్తకూడదని ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో వాయు నాణ్యత ఆరెంజ్ స్థాయికి చేరిందని, భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
నగరంలో చెత్త సమస్య, దోమల సమస్య, మూసీ నదిలో కాలుష్యం వంటి అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఢిల్లీలో యమునా నది అభివృద్ధి, ఉత్తరప్రదేశ్‌లో గంగా నది శుద్ధి, గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల మాదిరిగానే హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పారు.
సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం మూసీ నది వెంట బఫర్ జోన్ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు. నాలా ప్రాంతాల్లో 10 మీటర్లు, నదుల వద్ద 50 మీటర్ల బఫర్ జోన్ ఉండాలని నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు అనుమతించబడవని చెప్పారు.
మూసీ నది అభివృద్ధి కార్యక్రమం వల్ల ఇళ్లను కోల్పోయే వారికి ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైతే వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కూడా కల్పిస్తామని చెప్పారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని కొందరు చెబుతున్నారని, కానీ గాంధీ విగ్రహం కోసం సుమారు 70 కోట్లు, విజ్ఞాన కేంద్రం మరియు అభివృద్ధి పనులకు మొత్తం 200 కోట్లు మాత్రమే ఖర్చవుతాయని వివరించారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 13న ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడిస్తామని చెప్పారు.
కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో సుమారు 2800 డీజిల్ బస్సులు ఉన్నాయని, వాటి స్థానంలో 2026 డిసెంబర్ 9 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలిపారు. ఇప్పటికే 500 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించినట్లు చెప్పారు.
డీజిల్ బస్సులను నగరం బయట ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఈవీ వాహనాలకు జీరో పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నగరంలో సుమారు రెండు లక్షల ఆటోలు ఉన్నాయని, వాటిని కూడా రెట్రోఫిటింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రణాళిక ఉందన్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కాలుష్యానికి కారణమయ్యే రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను నగరం బయటకు తరలించే ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశ జనాభాలో కేవలం 2.5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ దేశ జీడీపీలో 5 శాతం వాటా కలిగి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అప్పటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతానికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేస్తాం
ఈ లక్ష్య సాధనలో మహిళల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని, మీడియా సంస్థల్లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. డెస్క్ జర్నలిస్టుల గుర్తింపులో కూడా ఎవరికీ అన్యాయం జరగదని చెప్పారు.
సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షను తొలగించాలంటే వారికి సమాన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే దేశం కూడా ఆర్థికంగా బలపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంకతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి... ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత... ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)
పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించాయి.
ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో 591, 590 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా... పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు)
రానున్న 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై టెంపుల్ మాస్టర్... రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం... - ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు)
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం లో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యం లో జయంతి వేడుకల్లో పాల్గొని పోచమ్మ ఆలయం నుండి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక... ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు) జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు.*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత మాట్లాడుతూ* వాసవీ మాత
ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు
బుగ్గారం ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు) సర్పంచ్ లు గ్రామాలలో టామ్ - టామ్ చేయించాలి
బుగ్గారం ఎస్సై జి.సతీష్
వేసవి కాలం కదా అని ఈత సరదాతో బావుల్లోకి, చెరువుళ్ళోకి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై జి.సతీష్ అన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక... పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి
గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):
పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో... ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు
.
జగిత్యాల ఏప్రిల్ 26( ప్రజా మంటలు)వాల్మీకి ఆవాసం సేవాభారతి అధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించారు.
జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులో గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి... “తెలంగాణ వాదాన్ని ఎవరు చంపారు? ఎవరు కాపాడుతున్నారు?”
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ టీఆర్ఎస్ నేత నవీన్ ఆచారి బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కవిత ప్రకటించిన “తెలంగాణ రాష్ట్ర సేన” నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారిందని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రూప్ సింగ్, నవీనాచరి, ఇస్మాయిల్, వరలక్ష్మి, తదితరులు విమర్శించారు.... ఉద్యమ స్ఫూర్తికి గౌరవం – ఎమ్మెల్సీగా కోదండరాం నియామకంపై శుభాకాంక్షల వెల్లువ
జగిత్యాల, ఏప్రిల్ 25 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్. కోదండరాం ఎమ్మెల్సీగా నియామకం కావడం పట్ల తెలంగాణ జన సమితి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ రథసారధిగా ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లిన ఆయనకు ఈ పదవి లభించడం సముచిత గౌరవమని... 