ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి : మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

On
ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి : మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):


ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు.

మంగళవారం సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లుగా చిన్న, మధ్య తరహా పత్రికలపై అణచివేత కొనసాగుతోందని, ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వంలో న్యాయం చేయాలని కోరారు.

44 వేలకుపైగా అక్రెడిటేషన్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఎంప్యానల్ అయిన కొద్ది పత్రికలకే ఇవ్వడం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంప్యానల్‌తో సంబంధం లేకుండా ఆర్ఎన్ఐ గుర్తింపు ఆధారంగా అక్రెడిటేషన్లు ఇచ్చేవారని గుర్తు చేశారు. ఎంప్యానల్‌మెంట్ అనేది కేవలం ప్రభుత్వ ప్రకటనలకే వర్తిస్తుందని, అక్రెడిటేషన్లకు కాదు అని మంత్రికి వివరించారు.

ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ గుర్తింపు ఉన్న ప్రతి పత్రికను ఎంప్యానల్ చేసి అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రింటింగ్ ప్రెస్‌ల కోసం ప్రభుత్వ నామినల్ ధరకు భూమి కేటాయించి రుణ సదుపాయం కల్పించాలని కోరారు. అలాగే జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ బస్ పాస్, హెల్త్ కార్డులు, భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, కో-కన్వీనర్లు శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మం, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్వాయి జానయ్య, హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

More News...

State News 

తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16 నుంచి పాఠశాలలను ఒంటిపూటగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తించనుంది. అధికారుల ప్రకారం ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. అనంతరం...
Read More...
Local News  State News 

ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి : మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికలకూ అక్రెడిటేషన్లు ఇవ్వాలి : మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
Read More...
State News 

చిన్న పత్రికలపై వివక్షపై నిరసన : సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన

చిన్న పత్రికలపై వివక్షపై నిరసన : సమాచార భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ గుర్తింపు ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు, ఎంప్యానల్‌మెంట్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. టీడబ్ల్యూజేఎఫ్ ఇచ్చిన “ఛలో సమాచార భవన్” పిలుపు...
Read More...
Local News 

జగిత్యాలలో అర్ధరాత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు

జగిత్యాలలో అర్ధరాత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు    జగిత్యాల, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):జిల్లాకేంద్రంలోని టవర్ సర్కిల్‌తో పాటు పలు ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 72వ జన్మదిన వేడుకలు, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు టవర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి...
Read More...
Local News 

కేసీఆర్ జన్మదినం సందర్భంగా జగిత్యాలలో సేవా కార్యక్రమాలు

కేసీఆర్ జన్మదినం సందర్భంగా జగిత్యాలలో సేవా కార్యక్రమాలు జగిత్యాల ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ధరూర్ క్యాంప్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్...
Read More...
State News 

అంగన్‌వాడీల్లో రాజకీయ జోక్యం సరికాదు : కల్వకుంట్ల కవిత

అంగన్‌వాడీల్లో రాజకీయ జోక్యం సరికాదు : కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):: అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పరిధిలో కొనసాగాలని, వాటిని గ్రామ పంచాయతీల పరిధిలోకి తీసుకురావడం సరికాదన్నారు. గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీల...
Read More...
State News 

బేగంపేట ప్రజా భవన్ ఎదుట ఉద్రిక్తత – తెలంగాణ జాగృతి నేతలు, మహిళల అరెస్టు

బేగంపేట ప్రజా భవన్ ఎదుట ఉద్రిక్తత – తెలంగాణ జాగృతి నేతలు, మహిళల అరెస్టు హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు): బేగంపేటలోని ప్రజా భవన్ ముందు తెలంగాణ జాగృతి నాయకులు, మహిళలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న జాగృతి కార్యాలయ ఉద్యోగి లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలన్న ఎన్నికల హామీని అమలు చేయాలని, అలాగే అంగన్‌వాడీ...
Read More...
National  Comment  International  

రష్యా - అమెరికా ఒకటైతే బంగారం ధర పడిపోతుందా?

రష్యా - అమెరికా ఒకటైతే బంగారం ధర పడిపోతుందా? బంగారం ధర ₹1 లక్షకు పడిపోతుందా? – గ్లోబల్ పవర్ షిఫ్ట్ వెనుక అసలు కథ. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1.57 లక్షలు.ఇది సాధారణ పెరుగుదల కాదు — ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నమ్మకం కదిలిన సంకేతం. ఇప్పుడు ప్రశ్న:👉 ఈ...
Read More...
State News 

జిల్లా బీజేపీ అధ్యక్షునిపై కౌన్సిలర్ల దాడి: కౌన్సిలర్ మీనా సస్పెన్షన్

జిల్లా బీజేపీ అధ్యక్షునిపై కౌన్సిలర్ల దాడి: కౌన్సిలర్ మీనా సస్పెన్షన్ మెట్‌పల్లి ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు): మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, పార్టీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి మున్సిపల్ చైర్మన్ పదవి సాధించేందుకు ప్రయత్నించలేదని, కౌన్సిలర్లకు విప్ కూడా జారీ చేయలేదని ఆరోపిస్తూ కొంతమంది పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన నివాసంపై దాడికి దిగినట్లు సమాచారం. ఈ...
Read More...
State News 

తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్

తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు మనోహర్ హైదరాబాద్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు): బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మనోహర్ కుమార్‌కు కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. మనోహర్ కుమార్‌తో పాటు...
Read More...
State News 

కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా… భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా… భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు) కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్‌పై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ —“భవిష్యత్ ఏంటో నాకు గోచరించట్లేదు. అవమానాలు ఇంకెంత కాలం భరించాలి?” అని ఆవేదన...
Read More...
Filmi News  State News 

జగిత్యాల లో సినీ హీరో అర్జున్ సందడి…

జగిత్యాల లో సినీ హీరో అర్జున్ సందడి… జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలో సినీ హీరో అర్జున్ సందడి చేశారు. స్థానిక శ్రీనివాస థియేటర్లో అర్జున్ మరియు ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించిన సీతా పయనం చిత్రం ప్రదర్శింపబడుతున్న సందర్భంగా, మ్యాట్నీ షో సమయంలో థియేటర్‌ను సందర్శించి ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ,...
Read More...