జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్
జగిత్యాల మార్చ్ 07 (ప్రజా మంటలు):
జగిత్యాల అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు.
జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తనపై తప్పుడు సమాచారం ఆధారంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు.
ఎంపీ మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు.
కేంద్రీయ విద్యాలయం విషయంపై పూర్తి ఆధారాలు ఉన్నాయి
కేంద్రీయ విద్యాలయం స్థలం విషయంలో తాను చేసిన ప్రతి చర్యకు పూర్తి ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. 2025 నవంబర్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాసినట్లు చెప్పారు. మంత్రి ఎండార్స్ చేసిన పత్రాలు కూడా ఉన్నాయని, అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించవచ్చని అన్నారు.
చల్గల్ వాలాంతరి ప్రాంతంలో సుమారు 80 ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలిపారు. కేంద్రీయ విద్యాలయం కోసం ఆర్డీవో ద్వారా సర్వే చేసి 5 ఎకరాల స్థలం పంపినట్లు చెప్పారు.
నవోదయ పాఠశాలపై విమర్శ
జగిత్యాల ప్రజలు ఓట్లు వేయలేదనే కారణంతోనే ఎంపీ చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. అందువల్లనే నవోదయ పాఠశాలను కోరుట్లకు కేటాయించారని అన్నారు.
బ్రిడ్జిలు, గిరిజన నిధులపై ప్రశ్న
జగదల్పూర్ – నిజామాబాద్ జాతీయ రహదారిపై అనంతారం బ్రిడ్జి మరియు రాయికల్ సింగరావుపేట బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు.
అలాగే ఆర్టికల్ 275 కింద గిరిజనులకు రావాల్సిన నిధులు కూడా ఇప్పటివరకు మంజూరు కాలేదని తెలిపారు.
వ్యక్తిగత విమర్శలు రాజకీయాలకు మంచివి కావు
ముఖ్యమంత్రి చదువు లేదని ఎంపీ విమర్శించడం సరికాదని అన్నారు. అదే విధంగా ప్రధానమంత్రి ఎంత వరకు చదివారో కూడా చెప్పాలని ప్రశ్నించారు.
“మోడీ జీని చాయ్ వాలా అని మేము పిలవము. మేము హుందాగా ఉంటాం” అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల వరకు రాజకీయాలు సహజమని, ఆ తరువాత ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలని సూచించారు. అవసరమైతే కేంద్ర నిధుల కోసం ఎంపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ పర్వీన్ మున్నా, యువ కాంగ్రెస్ అధ్యక్షుడు భీరం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు
జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు... విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్
వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన... ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర
గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం... వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా... మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్ రమేష్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
టీఎన్‌జీవో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్ పల్లాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్‌జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ... ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000... బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు
ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది.
ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల... భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు
గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో... ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం
జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర... మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు) పూలమాలవేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు.
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు భారత సమాజంలో సమానత్వం, న్యాయం, విద్య, సామాజిక సంస్కరణల మీద ఆధారపడి ఉన్నాయి. ఆయన ఆలోచనలు చాలా ముందుచూపుతో కూడినవిఅన్నారు.
ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు) ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం.. జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్..
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ... 