రాష్ట్రంలో, దేశంలో అయినా అభివృద్ధి ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య
రాష్ట్రంలో, దేశంలో అయినా అభివృద్ధి ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య
వేలేర్ ఏప్రిల్ 15 (ప్రజామంటలు): స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్, చిల్పూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియోజకవర్గ ఇంచార్జ్ సింగపురం ఇందిర, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఘనపూర్, చిల్పూర్ మండలాలోని వివిధ గ్రామాల నుండి సుమారు 500మంది బిఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, నియోజకవర్గ ఇంచార్జ్ సింగపురం ఇందిర గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
డాక్టర్ కడియం కావ్య కామెంట్స్..
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల ఆధారాభిమానాలు మరువలేనివాని వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందువరుసలో నిలపాలానే లక్ష్యంతో ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ నాయకులు మాయ మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే నియోజకవర్గాన్ని కబ్జా రాయుళ్ల చేతిలో పెట్టినట్లేనని తెలిపారు. మీరు మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నియోజకవర్గ ఇంచార్జ్ సింగపురం ఇందిర సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేశంలో అయిన రాష్ట్రంలో అయిన అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. అందుకు కేంద్రంలో నరేంద్ర మోడీని గద్దె దింపి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పని చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఘనపూర్, చిల్పూర్ మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
