మాజీ సర్పంచులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి
మెనిఫెస్టో హామీలు అమలు చేయకపోతే ఉద్యమిస్తాం: బొడ్డు దేవయ్య
జగిత్యాల, సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు):
2023 ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేయడం లేదని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు దేవయ్య విమర్శించారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో జిల్లా స్థాయి మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాజీ సర్పంచులందరికీ నెలకు రూ.10 వేల పెన్షన్, కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ వైద్యం, ఉచిత బస్‌పాస్, అర్హులకు ఇళ్ల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ సర్పంచులకు ఓటు హక్కు కల్పించాలని కోరారు.
ఐదేళ్ల పాటు గ్రామాలకు సేవలందించిన మాజీ సర్పంచులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జిల్లా అధ్యక్షుడు మచ్చ నారాయణ అన్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రంలోని మాజీ సర్పంచులందరినీ ఏకం చేసి సంఘటితంగా ఉద్యమిస్తామని దేవయ్య హెచ్చరించారు.
సర్పంచ్ ఎన్నికలను ఐదేళ్లు పూర్తికాగానే నిర్వహించి, నూతన సర్పంచులకు వెంటనే బాధ్యతలు అప్పగించాలని జిల్లా అధికార ప్రతినిధి ఎన్నం కిషన్‌రెడ్డి కోరారు. గ్రామాభివృద్ధి నిధులు దారి మళ్లించకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి దుమ్మని బాల ముకుందం మాట్లాడుతూ మాజీ సర్పంచుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. జిల్లాలో మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి సంఘాన్ని మరింత పటిష్టం చేస్తామని పలువురు మాజీ సర్పంచులు తెలిపారు.
సమావేశంలో మాజీ సర్పంచులు బుర్ర మల్లేశం కె.గౌడ్, మర్రిపెల్లి నారాయణ గౌడ్, అంకతి గంగాధర్, పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, ముదిగొండ శేఖర్, జక్కుల తిరుపతి, కొత్తపేట సాయగౌడ్, జంగా గంగస్వామి, ఎండీ సలీం, మోహన్‌రావు, మారు రాజేశ్వర్‌రెడ్డి, సామళ్ల లావణ్య వేణు, దమ్మా లతశ్రీ నర్సింగం, జిల్లాపెల్లి శారద గంగారాం, లైసెటి లక్ష్మీరాజు, అల్లంకొండ సుదర్శన్, నాంబారి కిషన్, కైరి ముత్యం గౌడ్, అంజగౌడ్, నరేందర్, రెబ్బాస్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ సర్పంచులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి
జగిత్యాల, సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు):
2023 ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేయడం లేదని తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు దేవయ్య విమర్శించారు. శుక్రవారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో జిల్లా స్థాయి మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో... సీఎం ప్రజావాణి స్ఫూర్తిదాయకం: బీహార్ గ్రూప్-1 అధికారులు
బీహార్‌లోనూ ఇదే తరహా విధానం అమలు చేస్తాం
ప్రజల వినతులు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (ప్రజా మంటలు):తెలంగాణలో అమలవుతున్న సీఎం ప్రజావాణి కార్యక్రమం తమకు స్ఫూర్తినిచ్చిందని బీహార్ రాష్ట్రానికి చెందిన గ్రూప్-1 అధికారుల బృందం పేర్కొంది. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించడం, వాటిని సంబంధిత శాఖలకు పంపించడం, పరిష్కారాన్ని... గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి. టౌన్ సిఐ కరుణాకర్.
జగిత్యాల సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు)
గణేష్ మండప నిర్వాహకులు రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రజా జీవనానికి భంగం కలగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. విద్యుత్ తీగలకు దగ్గరగా గణేష్ మంటపాలను నిర్మించకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా మంట పాలను ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ మండపాల్లో భక్తి... ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రధానంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి... మల్యాలలో వివాహిత ఆత్మహత్య.. కుమారుడి ఆచూకీ కోసం గాలింపు
మల్యాల, సెప్టెంబర్ 10 (ప్రజామంతలు):
మల్యాల మండలం ముత్యంపేట శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఓ వివాహిత తన చిన్న కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది.
మల్యాలకు చెందిన గుండేటి కవిత (36) తన భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం గుడిపేట శివారులోని వ్యవసాయ... *కలెక్టరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*
జగిత్యాల, సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)
తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మచిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్... "ఫెడరల్ బ్యాంక్ "వారిచే మృత్తిక గణపతి ప్రతిమల వితరణ
ఈస్ట్ ఆనంద్ బాగ్ సెప్టెంబర్ 10( ప్రజా మంటలు)మేడ్చల్ మల్కాజ్గిరి లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ లో గల "ఫెడరల్ బ్యాంక్" శ్రీ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సమకాలీన స్థితికి అనుకూలంగా ప్రకృతి పరిరక్షణ పేరిట మృత్తిక (మట్టి ) గణపతి ప్రతిమలను తమ బ్యాంకు ఖాతాదారులకు వితరణ చేయడానికి శ్రీకారం చుట్టారు.... #Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు
కరీంనగర్ సెప్టెంబర్ 8 (ప్రజా మంటలు) "సాధనాత్ సాధ్యతే" సర్వం అన్నట్లు సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు కరీంనగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి *టి హరుష్* *పరమ శివునికి చెందిన లింగాష్టక స్తోత్రాన్ని 53 సెకండ్లలో ఆలపించి గతంలో లింగాష్టకం పఠించిన వారి రికార్డును బద్దలు కొట్టాడు.
చిన్నతనము నుండే హరుష్... ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఇన్గొల్లపల్లి సెప్టెంబర్ 07(ప్రజా మంటలు అంకం భూమయ్య):
ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు... జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన
జగిత్యాల, సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి... అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన
హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.
నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత
హన్మకొండ, సెప్టెంబర్ 07, (ప్రజా మంటలు):
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు.
హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్... 