కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ వ్యక్తిగత విమర్శలా?

కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాడుతోంది కవిత ఒక్కరే.. బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి: తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు నవీన్ ఆచారి

On
కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ వ్యక్తిగత విమర్శలా?

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):


అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను ప్రశ్నిస్తూ ప్రజల కోసం పోరాడుతున్నది తెలంగాణ రక్షణ సేన మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నవీన్ ఆచారి అన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను సక్రమంగా నిర్వహించడం లేదంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా, ఆ పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు.

బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 31న నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కవిత చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పే బదులు ఆమె కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రంలో కవిత ఒక్కరే పోరాటం చేస్తున్నారని నవీన్ ఆచారి పేర్కొన్నారు. సింగరేణి, ఆర్టీసీ కార్మికులతో పాటు వెలుగుమట్ల బాధితుల సమస్యలపై కూడా ఆమె స్పందించారని అన్నారు. ప్రజల తరఫున పోరాడాల్సిన బీఆర్ఎస్ ఆ బాధ్యతను విస్మరించిందని, అందుకే కవిత పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు.

కవిత ఓటమిపై సమీక్ష ఎందుకు చేయలేదు?

నిజామాబాద్‌లో కవిత ఓటమి తర్వాత ఆ ఓటమికి గల కారణాలపై బీఆర్ఎస్ నాయకత్వం సమగ్ర సమీక్ష ఎందుకు నిర్వహించలేదని నవీన్ ఆచారి ప్రశ్నించారు. అప్పటి నిజామాబాద్ ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డితో పాటు పార్టీ పెద్దలు దీనిపై సమీక్ష చేయకపోవడం వల్లే బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని ఆరోపించారు.

ప్రశాంత్ రెడ్డి ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న సమయంలోనే కామారెడ్డిలో కేసీఆర్ కూడా ఓటమి పాలయ్యారని ఆయన గుర్తుచేశారు. అప్పుడే నిజాయితీగా, పారదర్శకంగా సమీక్ష చేసి ఉంటే బీఆర్ఎస్‌కు ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.

బాల్కొండ నియోజకవర్గం నుంచి కవితకు వ్యతిరేకంగా పోటీ చేసిన రైతులతో అప్పట్లో ఎందుకు చర్చలు జరపలేదని ప్రశ్నించారు. కవిత ఓటమి తర్వాత అదే రైతులను పార్టీలోకి తీసుకుని నామినేటెడ్ పదవులు ఇచ్చారా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత ఓటమికి కారణమైన వారే ఇప్పుడు ఆమెపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

కేసీఆర్ వ్యాఖ్యలకు విరుద్ధంగా విమర్శలు ఎందుకు?

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో కవిత పాత్ర లేదని కేసీఆర్ స్వయంగా చెప్పినప్పటికీ, బీఆర్ఎస్ నేతలు ఆమెను అవమానకరమైన పదాలతో సంబోధించడం ఎందుకని నవీన్ ఆచారి ప్రశ్నించారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్‌కు నోటీసులు వచ్చినప్పుడు పార్టీ స్పందించిన తీరును, కవిత విషయంలో పార్టీ వ్యవహరించిన తీరును పోల్చుకోవాలని సూచించారు.

బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గేది లేదని కవిత స్పష్టంగా చెప్పిన నేపథ్యంలోనే ఆమెపై కేసుల ద్వారా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అయితే, ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కవితకు ఇచ్చిన నోటీసులకు ఆమె సమాధానం ఇవ్వలేదని చెబుతున్నారని, అయితే నోటీసులు ఇవ్వకుండానే సస్పెన్షన్ జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి రోడ్డు ప్రమాదం విషయంలో పోలీసుల వ్యవహారశైలిపై కవిత ప్రశ్నించడం తప్పా అని నవీన్ ఆచారి నిలదీశారు. తప్పును తప్పుగా ప్రశ్నిస్తూ రాజకీయాల్లో హుందాతనాన్ని పాటిస్తున్న కవితపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు.

బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి రాజకీయంగా ఎదుర్కోవాలని సూచించారు. జెన్‌ జీ తరం రాజకీయాల్లోకి వస్తున్న సమయంలో చౌకబారు రాజకీయాలకు స్వస్తి పలకాలని అన్నారు.

పసుపు బోర్డుతో రైతులకు ప్రయోజనం ఏంటి?

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని నవీన్ ఆచారి ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు వాస్తవంగా ఎంత ప్రయోజనం కలిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

నాలుగేళ్లకు ఒకసారి పెరిగే పసుపు ధరను తామే పెంచినట్లు గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. రైతులు కోరుతున్న విధంగా ప్రతి ఏడాది మద్దతు ధర కల్పించగలరా అని ప్రశ్నించారు. పసుపు రైతులను మభ్యపెట్టే రాజకీయాలను అర్వింద్ మానుకోవాలని సూచించారు.

నిజామాబాద్ ప్రజల గుండెల్లో కవితకు స్థానం

నిజామాబాద్ ప్రజల గుండెల్లో కవితకు ప్రత్యేక స్థానం ఉందని నవీన్ ఆచారి అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఆమె చేసిన సేవలను ప్రజలు మరిచిపోరని చెప్పారు. ఇటీవల జరిగిన పాంచజన్య సంకల్ప సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం ఆమెపై ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు.

పార్టీ ఏర్పాటైన నాలుగు నెలల తర్వాత నిజామాబాద్‌కు వచ్చిన కవిత సొంత ప్రాంత ప్రజలను చూసి భావోద్వేగానికి గురయ్యారని, ఆమె కన్నీరు పెట్టుకోవడం సభలో ఉన్న మహిళలను సైతం కదిలించిందని తెలిపారు. ఈ అభిమానం రాజకీయాలకు అతీతంగా ప్రజల గుండెల్లో నుంచి వచ్చిందని అన్నారు.

నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో పసుపు బోర్డు, జిల్లా సమస్యలు, తెలంగాణ సమస్యలపై కవిత చేసిన పోరాటాన్ని ప్రజలు గుర్తుంచుకున్నారని నవీన్ ఆచారి పేర్కొన్నారు. పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

More News...

Local News 

బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం - ఆర్థిక మంత్రి భట్టి

బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం - ఆర్థిక మంత్రి భట్టి హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు): తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని పరిషత్‌ చైర్మన్‌ బసవరాజు శ్రీనివాస్ కోరారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆయన ఈ మేరకు...
Read More...
State News 

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ, నలంద డిగ్రీ...
Read More...
State News 

కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ వ్యక్తిగత విమర్శలా?

కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ వ్యక్తిగత విమర్శలా? హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు): అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను ప్రశ్నిస్తూ ప్రజల కోసం పోరాడుతున్నది తెలంగాణ రక్షణ సేన మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నవీన్ ఆచారి అన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను సక్రమంగా నిర్వహించడం లేదంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా,...
Read More...
State News 

గురుకుల హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి : THRC

గురుకుల హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి : THRC హైదరాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు): గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) సూచించింది. బెల్లంపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై కమిషన్ హెచ్‌ఆర్‌సీ నంబర్ 3034/2026 కింద సుమోటో కేసు నమోదు చేసింది. 2026...
Read More...
State News 

బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి - కవిత

బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి - కవిత కాంగ్రెస్‌పై పోరాటం.. టీఆర్ఎస్ నిర్మాణం | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ నిజామాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు):తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని, బహుజన తెలంగాణ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో...
Read More...
Local News 

ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ టీజీజెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్

ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ టీజీజెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ జగిత్యాల ఆగస్టు 31 (ప్రజా మంటలు)    టీజీజెఏసి జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు కందుకూరి రవిబాబు  ఆధ్వర్యంలో, టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర  టి జి ఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్  మారం జగదీశ్వర్  ముఖ్య అతిధిగా పాల్గొని...
Read More...
Local News  State News 

చేనేత కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలి

చేనేత కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలి గొల్లపల్లి, ఆగస్టు 31 (ప్రజా మంటలు): రాష్ట్రంలోని 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే చేయూత పెన్షన్లను ఎలాంటి కఠిన నిబంధనలు, షరతులు లేకుండా సరళతరం చేసి వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అంకం భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన...
Read More...
Local News 

గొల్లపల్లిలో లయన్స్ క్లబ్ చే ఉచిత కంటి వైద్య శిబిరం

గొల్లపల్లిలో లయన్స్ క్లబ్ చే ఉచిత కంటి వైద్య శిబిరం గొల్లపల్లి, ఆగస్టు 31, ప్రజా మంటలు: గొల్లపల్లి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గొల్లపల్లి గ్రామపంచాయతీ వద్ద జరిగిన ఈ శిబిరాన్ని ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొమ్మన కుమార్, ప్రోగ్రామింగ్ చైర్మన్, ఉప సర్పంచ్...
Read More...
Local News 

క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం: రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే ప్రశంస.!

క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం: రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే ప్రశంస.! జగిత్యాల ఆగస్ట్ 31(ప్రజా  మంటలు) ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, గుట్కా, తంబాకు వంటి ప్రాణాంతక అలవాట్లకు దూరంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ దాతల సహకారంతో సమకూర్చిన రూ.40,000 ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డా. సంజయ్ కుమార్...
Read More...
Crime  State News 

తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. భద్రత లేని విశ్రాంతి గదులపై తీవ్ర విమర్శలు

తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. భద్రత లేని విశ్రాంతి గదులపై తీవ్ర విమర్శలు హైదరాబాద్‌ ఆగస్ట్ 31 (ప్రజా మంటలు): తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న 35 ఏళ్ల నర్సు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆస్పత్రి సమీపంలోని మెకానిక్‌ షాపులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన సైనా ఉల్లా ఖాన్‌ను నిందితుడిగా...
Read More...
Local News 

ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి పనులు ఆగబోవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి చేసిన విమర్శలకు స్పందించారు....
Read More...
Local News  Spiritual  

రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం

రోగుల సహాయకులకు పదేళ్లుగా ఉచిత అన్నప్రసాదం జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు): జగిత్యాల సత్యసాయి సేవా సమితి, సత్యసాయి నిత్య అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి నిత్యాన్న ప్రసాద సేవా పథకం 10వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోగుల సహాయకులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్న ఈ కార్యక్రమానికి జగిత్యాల...
Read More...