తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు?

జూరాల వద్ద భారీ ఎత్తిపోతల పథకం నిర్మించాలి: తెలంగాణ రక్షణ సేన

On
తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు?

హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడటం దౌర్భాగ్యం

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయానికి మొదటి ముద్దాయి బీఆర్ఎస్సే

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు):
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మౌనం వహిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్‌కుమార్ ఆరోపించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ద్వారా తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్ హరించుకుపోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడుతున్నారని ఆరోపించారు.

శనివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నవీన్‌కుమార్ మాట్లాడారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడాల్సిన సమయంలో కొడంగల్–నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. కేంద్రం వద్ద తెలంగాణ ప్రయోజనాల కోసం సీఎం గట్టిగా వాదించాలని డిమాండ్ చేశారు.

ఏపీ జల వినియోగంపై సీఎం ఎందుకు మౌనం?

కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తీరును ముఖ్యమంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నవీన్‌కుమార్ కోరారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకునేందుకే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

తమకు అందిన లెక్కల ప్రకారం ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, సాగర్ కుడి కాలువ, కృష్ణా డెల్టా వ్యవస్థల ద్వారా గణనీయంగా నీటిని వినియోగించుకుందని, అదే సమయంలో హైదరాబాద్ తాగునీటితో కలిపి తెలంగాణ వినియోగం చాలా తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

జూరాల వద్ద భారీ ఎత్తిపోతల పథకం చేపట్టాలి

కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన వాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే జూరాల వద్ద భారీ ఎత్తిపోతల పథకం నిర్మించాలని నవీన్‌కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన ఈ అంశాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందన్నారు.

జూరాల నుంచి ఎత్తిపోతల పథకం చేపట్టకపోవడం గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదమని, అదే తప్పును ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడంతో పాటు జూరాల వద్ద భారీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని కోరారు.

బీఆర్ఎస్‌పై కూడా విమర్శలు

కృష్ణా జలాల విషయంలో ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను నవీన్‌కుమార్ తప్పుబట్టారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వ్యవహారాలు ఇప్పుడే ప్రారంభమైనట్లుగా ఆ పార్టీ నేతలు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.

కృష్ణా జలాల పంపకాల విషయంలో ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్‌కు 63 శాతం, తెలంగాణకు 37 శాతం వాటా ఉండగా, అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతంగా మారేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే నిర్ణయాలకు గత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉందన్నారు.

కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను పునరావృతం చేయకుండా ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ హక్కుల కోసం స్పష్టమైన వైఖరి తీసుకోవాలని నవీన్‌కుమార్ డిమాండ్ చేశారు. కేఆర్ఎంబీ తీరును వ్యతిరేకిస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణకు కార్యాచరణ ప్రకటించాలని కోరారు.

తెలంగాణ భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు జూరాల వద్ద భారీ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.

Join WhatsApp

More News...

State News 

తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు?

తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు? హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడటం దౌర్భాగ్యం కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయానికి మొదటి ముద్దాయి బీఆర్ఎస్సే హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు):కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మౌనం వహిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్‌కుమార్ ఆరోపించారు. కృష్ణా నదీ...
Read More...
Local News 

శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా "రుద్రాంగి ఈశాన్వి" గోపిక వేషధారణ 

శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా జగిత్యాల సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని విద్యాసంస్థల్లో పాఠశాల చిన్నారులచే కృష్ణాష్టమి జన్మ వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టే కార్యక్రమం తో పాటు శ్రీకృష్ణుని గోపిక వేషధారణలు అలరించాయి.    ఇదిలా ఉండగా రుద్రాంగి రాఘవేంద్ర శ్రీవిద్య కూతురు రుద్రంగి ఈశాన్వి గౌతమ్ మోడల్ స్కూల్ లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో...
Read More...
Local News 

రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి

రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి రాయికల్, సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు): రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ, రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు....
Read More...
State News 

సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా - విజయలక్ష్మి

సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా - విజయలక్ష్మి హైదరాబాద్‌ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్‌పర్సన్‌గా, క్యాబినెట్‌ మంత్రి హోదాతో తనకు కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్‌ అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి రుణపడి ఉంటానని గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె పేర్కొన్నారు. తనకు ఈ బాధ్యతలు...
Read More...
Local News 

త్రాగునీటి సమస్య పై ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

త్రాగునీటి సమస్య పై ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు గుంతకల్ సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు)ప్రజా సమస్యల పైన స్థానిక గుంతకల్ ఆర్డీవో కి వినతి పత్రం అందించిన బిజెపి నాయకులు ఈ సంవత్సరం తక్కువ వర్షం నమోదు కావడం వలన పట్టణంలో దాదాపుగా వారానికి ఒకసారి నీళ్లు వదలడం జరుగుతుంది. అందువలన పట్టణ ప్రజలు తాగడానికి మరియు వాడుకోవడానికి నీళ్ల కోసం చాలా...
Read More...
Local News 

జగిత్యాల మున్సిపాలిటీ ఎజెండాపై మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు

జగిత్యాల మున్సిపాలిటీ ఎజెండాపై మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు జగిత్యాల, సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు): జగిత్యాల మున్సిపాలిటీలో డీజిల్, వాహనాల రిపేర్లు, పండుగల ఏర్పాట్లు, వాహనాల కొనుగోళ్లు, పాత బిల్లుల చెల్లింపులు తదితర అంశాల్లో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ ఎజెండాలో పొందుపరిచిన...
Read More...
State News 

జగిత్యాల బీజేపీలో ముదిరిన అంతర్గత విభేదాలు

జగిత్యాల బీజేపీలో ముదిరిన అంతర్గత విభేదాలు జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు): జగిత్యాల జిల్లా బీజేపీలో చాలాకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ రాజకీయ పోరుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహారశైలిపై కొందరు సీనియర్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల రహస్య సమావేశం నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన...
Read More...
Local News 

బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం - ఆర్థిక మంత్రి భట్టి

బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం - ఆర్థిక మంత్రి భట్టి హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు): తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని పరిషత్‌ చైర్మన్‌ బసవరాజు శ్రీనివాస్ కోరారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆయన ఈ మేరకు...
Read More...
State News 

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు): పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ, నలంద డిగ్రీ...
Read More...
State News 

కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ వ్యక్తిగత విమర్శలా?

కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ వ్యక్తిగత విమర్శలా? హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు): అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను ప్రశ్నిస్తూ ప్రజల కోసం పోరాడుతున్నది తెలంగాణ రక్షణ సేన మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నవీన్ ఆచారి అన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను సక్రమంగా నిర్వహించడం లేదంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా,...
Read More...
State News 

గురుకుల హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి : THRC

గురుకుల హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి : THRC హైదరాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు): గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) సూచించింది. బెల్లంపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై కమిషన్ హెచ్‌ఆర్‌సీ నంబర్ 3034/2026 కింద సుమోటో కేసు నమోదు చేసింది. 2026...
Read More...
State News 

బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి - కవిత

బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి - కవిత కాంగ్రెస్‌పై పోరాటం.. టీఆర్ఎస్ నిర్మాణం | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ నిజామాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు):తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని, బహుజన తెలంగాణ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో...
Read More...