జగిత్యాల మున్సిపాలిటీ ఎజెండాపై మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు
డీజిల్, రిపేర్లు, వాహనాల కొనుగోళ్లు, పండుగల ఏర్పాట్లపై సమగ్ర విచారణకు డిమాండ్
జగిత్యాల, సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీలో డీజిల్, వాహనాల రిపేర్లు, పండుగల ఏర్పాట్లు, వాహనాల కొనుగోళ్లు, పాత బిల్లుల చెల్లింపులు తదితర అంశాల్లో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ ఎజెండాలో పొందుపరిచిన పలు అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
గత కౌన్సిల్ కాలం నుంచి డీజిల్, వాహనాల రిపేర్ల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని కలెక్టర్, విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ విచారణ కొనసాగుతున్న సమయంలోనూ అక్రమాలు ఆగలేదని జయశ్రీ ఆరోపించారు. వాహనాలు రిపేర్లలో ఉన్నట్లు చూపిస్తూ వాటికి డీజిల్ వినియోగించినట్లు నమోదు చేయడం, ఒక ట్రిప్పు తీసిన వాహనానికి రెండు ట్రిప్పులు చూపించడం వంటి అవకతవకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, ఎంఐఎస్ ఆపరేటర్ తదితర బాధ్యతలతో పాటు సానిటరీ ఇన్‌స్పెక్టర్ బాధ్యతలు అప్పగించడంపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పర్మినెంట్ సానిటరీ ఇన్‌స్పెక్టర్లకే పూర్తి బాధ్యతలు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ప్రశ్నలు
వినాయక నిమజ్జన ఏర్పాట్ల కోసం రూ.33.81 లక్షల వ్యయానికి సంబంధించిన ఎజెండాలో పలు అంశాలపై స్పష్టత అవసరమని జయశ్రీ పేర్కొన్నారు. రెండు రోజుల తాత్కాలిక లైటింగ్, జనరేటర్ కోసం రూ.5 లక్షలు, మరో అంశంలో లైటింగ్, జనరేటర్, స్టేజీ, కండువాలు, కొబ్బరికాయల కోసం మరో రూ.5 లక్షలు కేటాయించడంపై ఆమె ప్రశ్నించారు.
అదేవిధంగా రెండు రోజుల గజ ఈతగాళ్లు, నాటు తెప్పల కోసం రూ.5 లక్షలు కేటాయించగా, మరో ఎజెండా అంశంలో ఒక్కరోజుకు ఇదే పనికి రూ.96 వేలుగా చూపించారని తెలిపారు. ఈ రెండు అంచనాల మధ్య వ్యత్యాసంపై విచారణ జరపాలని కోరారు. వందల కోట్లతో రోడ్లు నిర్మించిన తర్వాత ప్రధాన రహదారుల్లో గుంతలు పూడ్చేందుకు రూ.5 లక్షలు ఖర్చు చూపించడంపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
బతుకమ్మ ఘాట్లకు మొరం, డస్ట్ ఎక్కడ?
ఆరు బతుకమ్మ ఘాట్ల వద్ద మొరం, డస్ట్ పోయడానికి రూ.5 లక్షల అంచనా రూపొందించడంపైనా జయశ్రీ ప్రశ్నలు లేవనెత్తారు. చింతకుంట చెరువు, మోతె చెరువు, కండ్లపెల్లి చెరువు తదితర ప్రాంతాల్లో బతుకమ్మ ఘాట్లను ఇప్పటికే లక్షల రూపాయలతో సీసీ నిర్మాణాలతో అభివృద్ధి చేశారని, మరి ఈ మొరం, డస్ట్ ఎక్కడ వినియోగిస్తారో స్పష్టత లేదన్నారు.
అదేవిధంగా 1 నుంచి 25 వార్డులు, 25 నుంచి 50 వార్డుల్లో బతుకమ్మ ఏర్పాట్ల కోసం మరో రూ.3 లక్షలు చొప్పున మొత్తం రూ.6 లక్షలు కేటాయించడంపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రతి వార్డులో ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్న నేపథ్యంలో మొరం, డస్ట్ ఎక్కడ వేస్తారో వివరించాలని డిమాండ్ చేశారు.
పండుగల ఏర్పాట్లకు సంబంధించిన పనులను తమకు అనుకూలమైన వ్యక్తులకు అప్పగించేందుకు బాక్స్ టెండర్లకు బదులుగా ప్రతి పనికి పారదర్శకంగా ఆన్‌లైన్ టెండర్లు నిర్వహించాలని ఆమె కోరారు.
కంప్యూటర్లు, ప్రింటర్ల కొనుగోళ్లపైనా విచారణ
మున్సిపాలిటీ ఎజెండాలో కంప్యూటర్లు, ప్రింటర్ల కొనుగోలుకు రూ.99 వేల ప్రతిపాదన ఉందని, గతంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో కంప్యూటర్లు, ప్రింటర్లు కొనుగోలు చేసినప్పటికీ వాటి పూర్తి వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరినా అధికారులు ఇవ్వలేదని జయశ్రీ ఆరోపించారు. గతంలో ఎన్ని కంప్యూటర్లు, ప్రింటర్లు కొనుగోలు చేశారు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటనే వివరాలను బహిర్గతం చేయాలని కోరారు.
వాహనాల కొనుగోళ్లపై అభ్యంతరాలు
మూడు ఈవీ ఆటో టిప్పర్ల కొనుగోలుకు రూ.62 లక్షలు కేటాయించడంపై జయశ్రీ ప్రశ్నలు లేవనెత్తారు. ఒక్కో వాహనం ధర, జీఎస్టీ, మున్సిపాలిటీ కొటేషన్ల మధ్య ఉన్న వ్యత్యాసాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. గత కొంతకాలంగా ఒక బ్లేడ్ ట్రాక్టర్ కనిపించకుండా పోయిందని, వాహనాల కొనుగోలు, నిర్వహణలోనూ అవకతవకలు ఉన్నాయని ఆమె ఆరోపించారు.
వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత చిన్నపాటి రిపేర్లు వచ్చినప్పుడు సకాలంలో మరమ్మతులు చేయకుండా షోరూమ్‌లలో వదిలేయడం వల్ల అవి పనికిరాకుండా స్క్రాప్‌గా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.1.47 కోట్లకు పైగా వాహనాల కొనుగోలుకు కౌన్సిల్ ఆమోదం తీసుకున్నారని, ఈ కొనుగోళ్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
స్వీపింగ్ మిషన్, టిప్పర్ల వినియోగంపై ప్రశ్నలు
సుమారు రూ.50 లక్షలతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్‌ను వారం, పది రోజుల పాటు మాత్రమే రోడ్లపై తిప్పి అనంతరం షెడ్డుకే పరిమితం చేశారని జయశ్రీ ఆరోపించారు. దానికి రిపేర్ల పేరుతో అదనంగా ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మరో టిప్పర్‌కు సుమారు రూ.50 లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసినప్పటికీ దాన్ని ప్రధాన రహదారుల్లో చెత్త సేకరణకు మాత్రమే వినియోగిస్తున్నారని తెలిపారు.
ఇప్పుడు రూ.60 లక్షలతో 14 టైర్ల టిప్పర్ కొనుగోలు చేయడానికి ప్రతిపాదించడం, దాన్ని సెంటర్ మీడియన్ పాయింట్ నుంచి ఆటోలలోని చెత్త సేకరణకు వినియోగిస్తామని చెప్పడం సరికాదన్నారు. అసలు సెంటర్ మీడియన్ పాయింట్ ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఇప్పటి వరకు స్థలాన్ని కూడా గుర్తించలేదని ఆమె పేర్కొన్నారు.
పాత బిల్లులకు కొత్త కౌన్సిల్ ఆమోదం ఎందుకు?
గత కౌన్సిల్ కాలానికి సంబంధించిన పాత బిల్లులను ప్రస్తుత కౌన్సిల్ ఎజెండాలో పొందుపరచి చెల్లింపులకు ఆమోదం కోరడంపై జయశ్రీ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలోనే విచారణకు వెళ్లిన బిల్లులకు ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ ఏ ప్రాతిపదికన ఆమోదం తెలుపుతుందో స్పష్టం చేయాలని కోరారు.
కోవిడ్ సమయంలో వినియోగించిన అంబులెన్స్‌కు సంబంధించిన 2021 ఏప్రిల్ 12 నుంచి 2022 జనవరి 29 వరకు బిల్లులను ఇప్పుడు చెల్లించేందుకు తీర్మానం చేయడం సరికాదన్నారు. ఈ అంశానికి సంబంధించిన పత్రాల ప్రతులను కౌన్సిల్ సభ్యులకు అందించకుండా కేవలం చదివి వినిపించడంపై కూడా ఆమె ప్రశ్నించారు.
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాల్సిన టేబుల్ ఎజెండాను పాత బిల్లుల చెల్లింపులకు ఉపయోగించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
GIS మ్యాపింగ్ బిల్లుపైనా అభ్యంతరం
GIS మ్యాపింగ్ కోసం గతంలో తీర్మానం చేసి సుమారు 29 వేల అసెస్‌మెంట్లను మ్యాపింగ్ చేస్తామని చెప్పారని జయశ్రీ తెలిపారు. ఇందులో మొదటి విడతలో 10 వేల, రెండో విడతలో 3,138 అసెస్‌మెంట్లకు బిల్లులు చెల్లించారని, మిగిలిన 15,862 అసెస్‌మెంట్లకు రూ.25,26,817 చెల్లించాలని ప్రతిపాదించారని పేర్కొన్నారు.
అయితే కూలిపోయిన ఇళ్లు, క్షేత్రస్థాయిలో లేని ఇంటి నంబర్లు, రెండుసార్లు నమోదైన అసెస్‌మెంట్లు వంటి అంశాలను GIS మ్యాపింగ్ సమయంలో ఎందుకు గుర్తించలేకపోయారని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో GIS మ్యాపింగ్ జరగలేదని ఆరోపిస్తూ ప్రతిపాదించిన రూ.25,26,817 బిల్లును చెల్లించకుండా విచారణ జరపాలని కోరారు.
సమగ్ర విచారణ జరపాలి
మున్సిపాలిటీలో గత కౌన్సిల్ కాలం నుంచి ఇప్పటి వరకు జరిగిన అవినీతి, అక్రమాలపై దాదాపు వంద దరఖాస్తులు ఉన్నతాధికారులకు సమర్పించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని జయశ్రీ పేర్కొన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.
ప్రస్తుత ఎజెండా, టేబుల్ ఎజెండాలోని వివాదాస్పద అంశాలన్నింటినీ రద్దు చేసి, ప్రతి అంశంపై స్వతంత్రంగా పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆమె రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ కమిషనర్‌ను కోరారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో గత కౌన్సిల్‌కు సంబంధించిన పాత బిల్లులు, పూర్తికాని పనులు, ఆధారాలు లేని చెల్లింపులను కొత్త కౌన్సిల్ ఎజెండాలో చేర్చకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆమె ఫిర్యాదు ప్రతులను జగిత్యాల జిల్లా కలెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి కూడా పంపించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మున్సిపాలిటీ ఎజెండాపై మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు
జగిత్యాల, సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీలో డీజిల్, వాహనాల రిపేర్లు, పండుగల ఏర్పాట్లు, వాహనాల కొనుగోళ్లు, పాత బిల్లుల చెల్లింపులు తదితర అంశాల్లో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ ఎజెండాలో పొందుపరిచిన... జగిత్యాల బీజేపీలో ముదిరిన అంతర్గత విభేదాలు
జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):
జగిత్యాల జిల్లా బీజేపీలో చాలాకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ రాజకీయ పోరుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహారశైలిపై కొందరు సీనియర్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల రహస్య సమావేశం నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన... బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం - ఆర్థిక మంత్రి భట్టి
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు):
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ కోరారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆయన ఈ మేరకు... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి
జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ, నలంద డిగ్రీ... కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ వ్యక్తిగత విమర్శలా?
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):
అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్‌ను ప్రశ్నిస్తూ ప్రజల కోసం పోరాడుతున్నది తెలంగాణ రక్షణ సేన మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు నవీన్ ఆచారి అన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను సక్రమంగా నిర్వహించడం లేదంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలకు సమాధానం చెప్పకుండా,... గురుకుల హాస్టళ్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి : THRC
హైదరాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు):
గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) సూచించింది.
బెల్లంపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై కమిషన్ హెచ్‌ఆర్‌సీ నంబర్ 3034/2026 కింద సుమోటో కేసు నమోదు చేసింది. 2026... బంగారు తెలంగాణ కాదు.. బహుజన తెలంగాణ కావాలి - కవిత
కాంగ్రెస్‌పై పోరాటం.. టీఆర్ఎస్ నిర్మాణం | ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ
నిజామాబాద్, ఆగస్టు 31 (ప్రజా మంటలు):తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని, బహుజన తెలంగాణ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో... ఉద్యోగుల ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ టీజీజెఏసి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్
జగిత్యాల ఆగస్టు 31 (ప్రజా మంటలు) టీజీజెఏసి జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి మరియు కందుకూరి రవిబాబు ఆధ్వర్యంలో, టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశం లో రాష్ట్ర టి జి ఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ ముఖ్య అతిధిగా పాల్గొని... చేనేత కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలి
గొల్లపల్లి, ఆగస్టు 31 (ప్రజా మంటలు):
రాష్ట్రంలోని 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే చేయూత పెన్షన్లను ఎలాంటి కఠిన నిబంధనలు, షరతులు లేకుండా సరళతరం చేసి వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అంకం భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన... గొల్లపల్లిలో లయన్స్ క్లబ్ చే ఉచిత కంటి వైద్య శిబిరం
గొల్లపల్లి, ఆగస్టు 31, ప్రజా మంటలు:
గొల్లపల్లి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గొల్లపల్లి గ్రామపంచాయతీ వద్ద జరిగిన ఈ శిబిరాన్ని ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బొమ్మన కుమార్, ప్రోగ్రామింగ్ చైర్మన్, ఉప సర్పంచ్... క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం: రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే ప్రశంస.!
జగిత్యాల ఆగస్ట్ 31(ప్రజా మంటలు)
ఆరోగ్య పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, గుట్కా, తంబాకు వంటి ప్రాణాంతక అలవాట్లకు దూరంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ దాతల సహకారంతో సమకూర్చిన రూ.40,000 ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డా. సంజయ్ కుమార్... తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. భద్రత లేని విశ్రాంతి గదులపై తీవ్ర విమర్శలు
హైదరాబాద్ ఆగస్ట్ 31 (ప్రజా మంటలు):
తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 35 ఏళ్ల నర్సు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆస్పత్రి సమీపంలోని మెకానిక్ షాపులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన సైనా ఉల్లా ఖాన్‌ను నిందితుడిగా... 