అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన
మహిపాల్‌రెడ్డికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్?
హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.
నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద పోలీసులకు, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తన టీషర్ట్‌ను విప్పి బనియన్‌తోనే నిరసన వ్యక్తం చేశారు. బనియన్‌తో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా పోలీసులు ప్రధాన గేటు వద్ద అడ్డుకున్నట్లు సమాచారం.
మరోవైపు బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నల్ల చీరలు ధరించి గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ గేటు వద్ద ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆమె చీరను పోలీసులు లాగారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అసెంబ్లీ ప్రాంగణం వద్ద నిరసన కొనసాగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నల్ల దుస్తులతో అసెంబ్లీలోకి ప్రవేశించే విషయంలో ఏర్పడిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు కేటీఆర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మహిపాల్‌రెడ్డికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్?
ఇదిలా ఉండగా, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆయనను తిరిగి తమ వర్గంలోకి ఆహ్వానించడంతో పార్టీ ఫిరాయింపుల అంశంపై రాజకీయ చర్చ మొదలైంది.
ఎర్రవెల్లిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశానికి మహిపాల్‌రెడ్డిని ఆహ్వానించినట్లు సమాచారం. గతంలో ఆయనపై అనర్హత పిటిషన్‌ను బీఆర్‌ఎస్ దాఖలు చేసిన నేపథ్యంలో తాజా పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
పటాన్‌చెరులో స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో సమన్వయం కుదరకపోవడం, తన నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు రావడం వంటి పరిణామాల నేపథ్యంలో మహిపాల్‌రెడ్డి మళ్లీ బీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
మహిపాల్‌రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్న ఇతర ఎమ్మెల్యేలకు కూడా బీఆర్‌ఎస్ వైపు వెళ్లేందుకు మార్గం చూపుతుందా? లేక ఇది ఒక్క నియోజకవర్గానికే పరిమితమైన పరిణామమా? అనేది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఫేక్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటాం: కల్వకుంట్ల కవిత
గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం
హైదరాబాద్, అక్టోబర్ 23 (ప్రజామంటలు):
ఫేక్ అగ్రిమెంట్లు, నకిలీ పెట్టుబడులతో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. గతేడాది ప్రకటించిన రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, లేదంటే డిసెంబర్‌లో... జగిత్యాలలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు
జగిత్యాల అక్టోబర్ 20 (ప్రజా మంటలు):
పట్టణంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో షమీ పూజలు, జమ్మి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పద్మనాయక వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన షమీ పూజలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని, అనంతరం శ్రీమతి, శ్రీ గండ్ర రాధమ్మ రాఘవేందర్ రావు ప్రశాంత నిలయం వృద్ధాశ్రమాన్ని... గ్రామ పంచాయతీ సిబ్బంది కి దుస్తులు పంపిణి
వెల్గటూర్ అక్టోబర్ 20 ( ప్రజా మంటలు )
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో విజయదశమి పురస్కరించుకొని గ్రామ పంచాయతి సిబ్బంది కీ సర్పంచ్ ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్ భూపల్లి రాజయ్య ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, పాలకవర్గం సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సప్ప... స్థంభం పల్లి లో అంగరంగ వైభవం గా అమ్మ వారి ఊరేగింపు కార్యక్రమం
వెల్గటూర్ అక్టోబర్ 20 ( ప్రజా మంటలు):
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో మంగళవారం రోజున దుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో అమ్మ వారి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ గా నిర్వహించడం జరిగింది. మహిళలు మంగళ హరతులతో అమ్మ వారికీ స్వాగతం పలకడం జరిగింది. ఈ వేడుక లో మహిళలు చిన్నారులు భవాని... సామాజిక విభేదాలపై అప్రమత్తంగా ఉండాలి.. దేశంలో అస్థిరతకు తావివ్వకూడదు - మోహన్, భగవత్
పరిష్కారాల కోసమే ఉద్యమాలు జరగాలి.. జాతీయ ఐక్యత, వైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యం
ఉద్యమాలు రాజకీయ కక్షలకు వేదిక కాకూడదు
నాగ్‌పూర్ | అక్టోబర్ 20, 2026
దేశంలో సామాజిక విభేదాలు పెంచే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమాలు... బ్రాహ్మణ వీధి కామాక్షి దేవి మండపము వద్ద ఘనంగా "చండీ హోమం "
జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు)దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు ఆదివారం అష్టమిని పురస్కరించుకొనిజగిత్యాల బ్రాహ్మణ వీధి కామాక్షి దేవి మంటపం వద్ద అంగరంగ వైభవంగా చండీ హోమం నిర్వహించారు.
నవ చండి పారాయణాలను పూర్తి చేసి అనంతరం చండీ హోమం నిర్వహించారు. బ్రాహ్మణ సంఘం సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ... సద్దుల బతుకమ్మ, దసరా పండుగ కీ అన్ని ఏర్పాట్లు పూర్తి
వెల్గటూర్ అక్టోబర్ 16 ( ప్రజా మంటలు )
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో శుక్రవారం రోజు ఉదయం వేళ లో చెరువు దగ్గర బతుకమ్మ ఘాట్ వద్ద ముళ్ళ పొదలు తొలిగించి శుభ్రం చేయడం జరిగింది. అలాగే గ్రామము లో డ్రైనేజీ తీయడం జరిగింది.. రోడ్డు కీ ఇరువైపులా ఉన్న చెత్త చెదారం... రిపోర్టర్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణల తొ ఎస్సై బదిలీ
సిరిసిల్ల, అక్టోబర్ 15 (ప్రజా మంటలు):
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రిపోర్టర్లు శేఖర్, సంపత్‌లపై ఎస్‌ఐ శ్రీకాంత్ థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల అధికార దుర్వినియోగం, లంచాల వసూళ్లపై వార్తలు రాసిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ ఘటనపై జర్నలిస్టులు, ప్రజా సంఘాల నుంచి నిరసనలు... తెలంగాణలో మూడు చోట్ల ఏసీబీ దాడులు
హైదరాబాద్, అక్టోబర్ 15 (ప్రజా మంటలు):
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మూడు చోట్ల దాడులు, సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కీసర తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు సోదాలు... ఆడబిడ్డల ఆత్మగౌరవం,సంస్కృతికి ప్రతీక బతుకమ్మ కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
జగిత్యాల, అక్టోబర్ 14 (ప్రజా మంటలు)
బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని
మహిళలు... ఈనెల 30న ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ
హైదరాబాద్ అక్టోబర్ 14 (ప్రజా మంటలు):
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈనెల 30న తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు ఆవిష్కరించారు.
పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఇప్పటికే నిజామాబాద్, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య... సుదర్శన్ గౌడ్ కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం
జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు):
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ మేరకు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌తో కలిసి బాధిత... 