ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

On
ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):


జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి పనులు ఆగబోవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి చేసిన విమర్శలకు స్పందించారు.

జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శలుగా కాకుండా ద్వేషపూరితంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. కార్యకర్తలను పక్కన పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రహస్యంగా కలుస్తూ మరోవైపు రాజకీయంగా భిన్నమైన వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత పదేళ్లపాటు కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలాభిషేకం చేశారని గుర్తుచేశారు.

ప్రజల కోసం పనిచేస్తున్న తనను ‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా అభివర్ణించడం విడ్డూరంగా ఉందని సంజయ్ కుమార్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం కూడా ప్రైవేట్ కంపెనీ నడపడం అవుతుందా అని ప్రశ్నించారు.

ఇందిరమ్మ కాలనీపై 17 ఏళ్ల తర్వాతే దృష్టి

2008లో శంకుస్థాపన చేసిన ఇందిరమ్మ కాలనీని ఇన్నేళ్లుగా పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. 17 ఏళ్ల తర్వాత తాను కాలనీ సమస్యలపై దృష్టి సారించి ఇళ్ల నిర్మాణం చేపట్టానని తెలిపారు. ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయడం వల్ల అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.34 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 1,500 చొప్పున డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరైతే, జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం సుమారు 4,500 ఇళ్ల నిర్మాణంలో తన పాత్ర ఉందని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల్లో మంజూరైన ఇళ్లలో సగం కూడా నిర్మించలేదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఎనిమిది నెలలు ఉన్న సమయంలో ఇందిరమ్మ కాలనీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం జీవన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాలనీ వాసులకు ఉగాది నాటికి బూరెలు తినిపిస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందనేది వాస్తవమని, అయితే వాటి నిర్మాణం విషయంలో స్థానికంగా ఎంత పని జరిగిందన్నదే ముఖ్యమని సంజయ్ కుమార్ అన్నారు.

వైద్య, విద్య రంగాలకు ప్రాధాన్యం

జగిత్యాల వైద్య కళాశాల ఏర్పాటులో తన కృషి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణలో వైద్య కళాశాల, ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల ఒకే ప్రాంతంలో ఉన్న జిల్లాగా జగిత్యాల నిలిచిందన్నారు. 334 మంది వైద్యులు, 366 మంది నర్సులు, 730 పడకల ఆసుపత్రికి అనుమతులు వచ్చినట్లు తెలిపారు.

నియోజకవర్గంలో ప్రస్తుతం 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, కొన్ని ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. మరో 2,000 ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత పాఠశాల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

గొల్లపల్లి రోడ్డులో మహిళా డిగ్రీ కళాశాల విషయంలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో జీవన్‌రెడ్డి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తాటిపల్లి–చల్గల్ ఎత్తిపోతల పథకం పనుల పరిస్థితి ఏమిటో కూడా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

కొత్త బస్టాండ్ పెట్రోల్ బంక్ వివాదంపై ప్రశ్నలు

జగిత్యాల కొత్త బస్టాండ్, పెట్రోల్ బంక్ వివాదానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే స్పందించారు. జీవన్‌రెడ్డి అనుచరులు మున్సిపల్‌లో ఉన్న సమయంలోనే సంబంధిత అనుమతులు ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు. పాత బస్టాండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ బంక్ అంశంపై తాను ఆలస్యం చేశానని విమర్శిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాటు ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అంతకుముందు మంత్రిగా ఉన్న సమయంలో ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు.

గత నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. తుఫిడ్క్ నిధులు గత ప్రభుత్వం మున్సిపల్‌లో డిపాజిట్ చేయకపోవడం వల్ల కొన్ని పనులు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.

విమర్శలకు గత చరిత్రే సమాధానం

ప్రతి అభివృద్ధి పనిని విమర్శించాలనుకుంటే గతంలో జరిగిన వ్యవహారాలపై పూర్తి చిట్టా తన వద్ద ఉందని సంజయ్ కుమార్ అన్నారు. తనపై విమర్శలు చేసే ముందు గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనుల పరిస్థితిని ప్రజలకు వివరించాలని సూచించారు.

తన హయాంలో అభివృద్ధి కంటే అణచివేత ధోరణికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని జీవన్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. మాజీ జెడ్పీ చైర్మన్‌పై విజిలెన్స్ కేసు పెట్టించారని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని భూ కబ్జాదారుడిగా విమర్శించారని గుర్తుచేశారు. దశాబ్ద కాలం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన విషయాలను ఇప్పుడు మర్చిపోయారా అని ప్రశ్నించారు.

జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రతిరోజూ అభివృద్ధి పనులకు భూమిపూజలు చేస్తున్నామని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాలలో అభివృద్ధి మాత్రం ఆగదని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య, సీనియర్ నాయకుడు బండ శంకర్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, కౌన్సిలర్లు ప్రశాంత్ రావు, పిట్ట ధర్మరాజు, మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, నాయకులు కప్పల శ్రీకాంత్, రామకృష్ణారెడ్డి, మ్యానపురి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

More News...

Local News 

#Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు

#Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు   కరీంనగర్ సెప్టెంబర్ 8 (ప్రజా మంటలు) "సాధనాత్ సాధ్యతే" సర్వం అన్నట్లు సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు కరీంనగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి *టి హరుష్* *పరమ శివునికి చెందిన లింగాష్టక స్తోత్రాన్ని 53 సెకండ్లలో ఆలపించి గతంలో లింగాష్టకం పఠించిన వారి రికార్డును బద్దలు కొట్టాడు. చిన్నతనము నుండే హరుష్...
Read More...
State News 

ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇన్గొల్లపల్లి సెప్టెంబర్ 07(ప్రజా మంటలు అంకం భూమయ్య): ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు...
Read More...
Local News 

జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన

జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన జగిత్యాల, సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
Read More...
State News 

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన    హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు. నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం...
Read More...
State News 

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత హన్మకొండ, సెప్టెంబర్ 07, (ప్రజా మంటలు): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్...
Read More...
State News 

కొడంగల్‌పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ

కొడంగల్‌పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ హైదరాబాద్, సెప్టెంబర్ 6, ప్రజా మంటలు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. ఈ నెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ...
Read More...
State News 

మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత

మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత    బంజారాహిల్స్, హైదరాబాద్, సెప్టెంబర్ 6: మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి...
Read More...
Local News  Sports 

జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం

జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం జగిత్యాల, సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు): విద్యార్థుల్లో మేధాశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించడంలో చదరంగం కీలక పాత్ర పోషిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో విద్యార్థులకు చదరంగంలో మెరుగైన శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన జీనియస్ చెస్ అకాడమీని ఎమ్మెల్సీ ఎల్‌. రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...
Read More...
Local News 

రాచకొండ కళాధర్ పార్థివ దేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత 

 రాచకొండ కళాధర్ పార్థివ దేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత  జగిత్యాల సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కళాధర్ శనివారం జగిత్యాలలో దేహం చాలించారు. వారి పార్థివ దేహాన్ని జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు దేహ దానం చేశారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు మంచాల కృష్ణ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం కళాధర్...
Read More...
Local News 

జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ ...

జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ ... జగిత్యాల సెప్టెంబర్ 6(ప్రజా మంటలు): జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. గత కొంతకాలంగా పోలీస్ సిబ్బందికి డ్యూటీల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కిరణ్ కుమార్‌పై వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కొంతమంది సిబ్బందికి డ్యూటీలు ఇవ్వకుండా, వారి నుంచి పెద్ద మొత్తంలో...
Read More...
State News 

సీఎం రేవంత్ రెడ్డిపై విషప్రచారం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు

సీఎం రేవంత్ రెడ్డిపై విషప్రచారం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ కరీంనగర్, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు అసత్య, అవమానకర ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్...
Read More...
National 

270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం

270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం బెంగళూరు నుంచి లండన్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య బెంగళూరు, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు): బెంగళూరు నుంచి లండన్‌కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆదివారం అత్యవసరంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ...
Read More...