తుక్కుగూడలో నర్సు దారుణ హత్య.. భద్రత లేని విశ్రాంతి గదులపై తీవ్ర విమర్శలు
హైదరాబాద్ ఆగస్ట్ 31 (ప్రజా మంటలు):
తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 35 ఏళ్ల నర్సు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆస్పత్రి సమీపంలోని మెకానిక్ షాపులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన సైనా ఉల్లా ఖాన్‌ను నిందితుడిగా గుర్తించినట్లు సమాచారం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన బాధితురాలు ఈ ఏడాది జనవరిలో తుక్కుగూడలోని ప్రైమ్‌కేర్ ఆస్పత్రిలో నర్సుగా చేరారు. రాత్రి విధులు ముగిసిన అనంతరం ఆస్పత్రికి సమీపంలో నర్సింగ్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిలో ఆమె నిద్రించేందుకు వెళ్లారు. అదే గదిలో మరో నర్సు ఉండాల్సి ఉన్నప్పటికీ, ఘటన జరిగిన సమయంలో ఆమె విధుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించిన నిందితుడు
నర్సు ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన నిందితుడు కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించగా బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించి కేకలు వేయడంతో నిందితుడు ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మరో నర్సు గదికి వచ్చి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యానికి సమాచారం అందించింది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించగా నర్సు విగతజీవిగా కనిపించారు. ఆమె ముఖం, కాళ్లపై గాయాలున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
హత్య అనంతరం అత్యాచారం జరిగిందా?
నర్సును హత్య చేసిన అనంతరం నిందితుడు మృతదేహంపై అత్యాచారానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ధారణ పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే సాధ్యమవుతుందని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ ఘటన కోల్‌కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆస్పత్రిలో 2024లో చోటుచేసుకున్న మహిళా వైద్య విద్యార్థి హత్యాచార ఘటనను గుర్తుకు తెస్తోందని పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం.
ఆస్పత్రి యాజమాన్యంపై భద్రతా ప్రశ్నలు
ఈ ఘటన నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యం కల్పించిన నర్సుల విశ్రాంతి గదుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న మెకానిక్ షెడ్ల వెనుక భాగంలో ఈ గదులను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
మహిళా సిబ్బంది విశ్రాంతి తీసుకునే ప్రాంతంలో కిటికీలకు భద్రతా గ్రిల్స్ లేకపోవడం, తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కిటికీలకు గ్రిల్స్ ఉండి ఉంటే నిందితుడు లోపలికి ప్రవేశించే అవకాశం ఉండేది కాదని బాధితురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే విశ్రాంతి గదులు సురక్షిత ప్రదేశాల్లో ఉండటంతో పాటు, తలుపులు–కిటికీల భద్రత, నిఘా కెమెరాలు, భద్రతా సిబ్బంది వంటి కనీస రక్షణ చర్యలు తప్పనిసరిగా ఉండాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
పేదరికాన్ని ఎదుర్కొని కుటుంబానికి అండగా నిలిచిన ఆమె
బాధితురాలి కుటుంబం నిరుపేద కుటుంబంగా తెలుస్తోంది. అంకంపాలెంలోని గిరిజన గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన ఆమె, భద్రాచలంలోని గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో నర్సింగ్ శిక్షణ పొంది ఉద్యోగంలో చేరారు.
ఆమె తండ్రి కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో నర్సుగా ఉద్యోగంలో చేరిన ఆమె, దారుణ హత్యకు గురికావడం కుటుంబ సభ్యులతో పాటు స్వగ్రామంలోనూ విషాదాన్ని నింపింది.
“నా బిడ్డ రాఖీ పండక్కి కూడా ఇంటికి రాలేదు”
ఉస్మానియా ఆస్పత్రి వద్ద మృతదేహాన్ని చూసిన తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. సెలవు లేదని తన కుమార్తె రాఖీ పండుగకు కూడా ఇంటికి రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను పొట్టనబెట్టుకున్న నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.
మృతురాలి కుటుంబాన్ని బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్ పరామర్శించారు. ఆదివారం ఉస్మానియా ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళా సిబ్బంది భద్రతపై సమాధానం చెప్పాల్సిందే
ఈ ఘటనలో నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, మహిళా సిబ్బందికి భద్రత కల్పించడంలో ఆస్పత్రి యాజమాన్యం తీసుకున్న చర్యలపై కూడా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం చేస్తున్న మహిళలు విధులు ముగించుకుని విశ్రాంతి తీసుకునే ప్రదేశమే అసురక్షితంగా ఉంటే, వారి భద్రతకు ఎవరు బాధ్యత వహించాలనే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తోంది.
నర్సులు, వైద్య సిబ్బంది కోసం ఏర్పాటు చేసే వసతి, విశ్రాంతి గదుల్లో భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయడంతో పాటు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆస్పత్రులపై భద్రతా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
#Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు
కరీంనగర్ సెప్టెంబర్ 8 (ప్రజా మంటలు) "సాధనాత్ సాధ్యతే" సర్వం అన్నట్లు సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు కరీంనగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి *టి హరుష్* *పరమ శివునికి చెందిన లింగాష్టక స్తోత్రాన్ని 53 సెకండ్లలో ఆలపించి గతంలో లింగాష్టకం పఠించిన వారి రికార్డును బద్దలు కొట్టాడు.
చిన్నతనము నుండే హరుష్... ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఇన్గొల్లపల్లి సెప్టెంబర్ 07(ప్రజా మంటలు అంకం భూమయ్య):
ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు... జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన
జగిత్యాల, సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి... అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన
హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.
నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత
హన్మకొండ, సెప్టెంబర్ 07, (ప్రజా మంటలు):
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు.
హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్... కొడంగల్‌పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ
హైదరాబాద్, సెప్టెంబర్ 6, ప్రజా మంటలు:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. ఈ నెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ... మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్, హైదరాబాద్, సెప్టెంబర్ 6: మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి... జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం
జగిత్యాల, సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు):
విద్యార్థుల్లో మేధాశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించడంలో చదరంగం కీలక పాత్ర పోషిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో విద్యార్థులకు చదరంగంలో మెరుగైన శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన జీనియస్ చెస్ అకాడమీని ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే... రాచకొండ కళాధర్ పార్థివ దేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత
జగిత్యాల సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కళాధర్ శనివారం జగిత్యాలలో దేహం చాలించారు. వారి పార్థివ దేహాన్ని జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు దేహ దానం చేశారు కుటుంబ సభ్యులు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు మంచాల కృష్ణ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం కళాధర్... జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ ...
జగిత్యాల సెప్టెంబర్ 6(ప్రజా మంటలు):
జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
గత కొంతకాలంగా పోలీస్ సిబ్బందికి డ్యూటీల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కిరణ్ కుమార్‌పై వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కొంతమంది సిబ్బందికి డ్యూటీలు ఇవ్వకుండా, వారి నుంచి పెద్ద మొత్తంలో... సీఎం రేవంత్ రెడ్డిపై విషప్రచారం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు
భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్
కరీంనగర్, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు అసత్య, అవమానకర ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్... 270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం
బెంగళూరు నుంచి లండన్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య
బెంగళూరు, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):
బెంగళూరు నుంచి లండన్‌కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆదివారం అత్యవసరంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ... 