22-ఏ జాబితాలోని భూముల హక్కుదారులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
బై-నంబర్లు ఇచ్చి సమస్యలు పరిష్కరిస్తాం.. కూకట్‌పల్లిలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన
హైదరాబాద్, ఆగస్టు 15 (ప్రజా మంటలు): నిషేధిత జాబితా (22-ఏ)లో చేరిన భూముల హక్కుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి, మిగిలిన భూములకు సర్వే నంబర్లకు బై-నంబర్లు కేటాయించి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో కోర్ అర్బన్ (CURE) ప్రాంత పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్) నిర్మాణానికి ముఖ్యమంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ, కోర్టు కేసుల కారణంగా కొన్ని సర్వే నంబర్లలోని మొత్తం భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చినట్లు తెలిపారు. “ఏదైనా కారణంగా మీ భూమి 22-ఏలో చేరి ఉంటే, కొనుగోలు చేసిన హక్కుదారుల స్థలాలు ఎక్కడికీ పోవు. కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలను పక్కనపెట్టి మిగిలిన భూములకు బై-నంబర్లు ఇచ్చి సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని సీఎం స్పష్టం చేశారు.
కూకట్‌పల్లిని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలి
కూకట్‌పల్లి ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి శ్రీధర్‌బాబును సీఎం కోరారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణతో పాటు పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అవసరమైన పరిశ్రమలను తీసుకురావాలని సూచించారు.
గత ప్రభుత్వ పాలనతో ప్రస్తుత ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను ఏవీ నిలిపివేయలేదని, అదనంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.
రాష్ట్రంలో 3.28 కోట్ల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి, విద్య కోసం వెళ్లేవారు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
మహిళా సంఘాలకు ప్రాధాన్యం
ఆర్టీసీకి ఇప్పటికే రూ.12 వేల కోట్లు చెల్లించామని సీఎం తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించి రూ.2,500 కోట్ల వడ్డీ చెల్లించామని చెప్పారు. మహిళా సంఘాల పేరిట 1,000 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చామని తెలిపారు.
అలాగే 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం కల్పించామని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు శిల్పారామంలో మూడున్నర ఎకరాల స్థలంలో ఇందిరా మహిళా బజార్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రెండేళ్లలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. కూకట్‌పల్లిలో వందల కోట్ల విలువైన 11 ఎకరాల భూమిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
నగరంలో నిరుపేదలు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే వారికి సొంత ఇళ్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదల కోసం నిర్మించే ఇళ్లకు రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేయాలని మంత్రులకు సూచించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
పేదల సొంతింటి కల నెరవేర్చుతాం
పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం నూటికి నూరు శాతం అండగా ఉంటుందని రేవంత్‌రెడ్డి అన్నారు. తొలి విడతలో కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్న పేదలకు ఇళ్లు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన పేదలకు కూడా మంచి ఇళ్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
గతంలో ఒక పని కోసం గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ప్రజల సౌలభ్యం కోసం సైబరాబాద్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేశామని సీఎం పేర్కొన్నారు.
“మీ అభివృద్ధి కోసం నిలబడతాను. పది మందికి మేలు చేయాలన్న ఆలోచనతో పనిచేస్తున్నాను. మంచి చేయడానికి చిత్తశుద్ధి, మంచి ఆలోచన అవసరం. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించేందుకు రోజుకు 18 గంటలు పనిచేసే శక్తిని దేవుడు ఇచ్చారు. అందుకు ప్రజలు ఆశీర్వదించాలి” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
#Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు
కరీంనగర్ సెప్టెంబర్ 8 (ప్రజా మంటలు) "సాధనాత్ సాధ్యతే" సర్వం అన్నట్లు సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు కరీంనగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి *టి హరుష్* *పరమ శివునికి చెందిన లింగాష్టక స్తోత్రాన్ని 53 సెకండ్లలో ఆలపించి గతంలో లింగాష్టకం పఠించిన వారి రికార్డును బద్దలు కొట్టాడు.
చిన్నతనము నుండే హరుష్... ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఇన్గొల్లపల్లి సెప్టెంబర్ 07(ప్రజా మంటలు అంకం భూమయ్య):
ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు... జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన
జగిత్యాల, సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి... అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన
హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.
నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత
హన్మకొండ, సెప్టెంబర్ 07, (ప్రజా మంటలు):
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు.
హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్... కొడంగల్‌పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ
హైదరాబాద్, సెప్టెంబర్ 6, ప్రజా మంటలు:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. ఈ నెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ... మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్, హైదరాబాద్, సెప్టెంబర్ 6: మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి... జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం
జగిత్యాల, సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు):
విద్యార్థుల్లో మేధాశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించడంలో చదరంగం కీలక పాత్ర పోషిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో విద్యార్థులకు చదరంగంలో మెరుగైన శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన జీనియస్ చెస్ అకాడమీని ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే... రాచకొండ కళాధర్ పార్థివ దేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత
జగిత్యాల సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కళాధర్ శనివారం జగిత్యాలలో దేహం చాలించారు. వారి పార్థివ దేహాన్ని జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు దేహ దానం చేశారు కుటుంబ సభ్యులు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు మంచాల కృష్ణ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం కళాధర్... జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ ...
జగిత్యాల సెప్టెంబర్ 6(ప్రజా మంటలు):
జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
గత కొంతకాలంగా పోలీస్ సిబ్బందికి డ్యూటీల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కిరణ్ కుమార్‌పై వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కొంతమంది సిబ్బందికి డ్యూటీలు ఇవ్వకుండా, వారి నుంచి పెద్ద మొత్తంలో... సీఎం రేవంత్ రెడ్డిపై విషప్రచారం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు
భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్
కరీంనగర్, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు అసత్య, అవమానకర ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్... 270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం
బెంగళూరు నుంచి లండన్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య
బెంగళూరు, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):
బెంగళూరు నుంచి లండన్‌కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆదివారం అత్యవసరంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ... 