మహిళా ఉద్యోగి ఆరోపణలన్నీ ఆవాస్తవం - ది మనోహార్ హోటల్ చైర్మన్ డీవీ మనోహర్ వెల్లడి..
–దొంగతనం బయటపడటంతోనే బ్లాక్‌మెయిలింగ్
సికింద్రాబాద్,ఆగస్ట్ 22 (ప్రజామంటలు):
తమ సంస్థలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమ్ గెస్ట్ రిలేషన్స్ మేనేజర్‌గా పనిచేసిన కొరపు లావణ్య చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, తీవ్ర నిరాధారమైనవని హోటల్ 'ది మనోహర్' చైర్మన్ డీవీ మనోహర్ స్పష్టం చేశారు. శనివారం బేగంపేటలోని హోటల్ 'ది మనోహర్'లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లావణ్య 2025 డిసెంబర్ 1న తమ హోటల్‌లో చేరి, జూలై 2026 నుంచి చైర్మన్ ఆఫీసులో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.
ఆగస్టు 17న కార్యాలయంలో ఉంచిన రూ.లక్ష నగదు కనిపించకపోవడంతో విచారించగా, ఆమె దురుసుగా ప్రవర్తిస్తూ అనుచిత సందేశాలు పంపారని వెల్లడించారు. అనంతరం ఆగస్టు 19న ఆఫీసుకు వచ్చిన ఆమెను సీనియర్ మేనేజర్ల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయగా, తీవ్ర ఆగ్రహంతో హోటల్ లాబీలోకి వెళ్లి అసభ్య పదజాలంతో కేకలు వేస్తూ తీవ్ర గందరగోళం సృష్టించారని పేర్కొన్నారు.
సమాచారం అందుకుని వచ్చిన డయల్ 100 పోలీసులు కూడా ఆమె ప్రవర్తన చూసి దిగ్భ్రాంతి చెందారని, చైర్మన్ కార్యాలయానికి సంబంధించిన కీలక తాళం చెవులను ఇవ్వకుండానే ఆమె వెళ్లిపోయారని చెప్పారు. ఆ తర్వాత హోటల్ యాజమాన్యాన్ని 36 నెలల జీతం (దాదాపు రూ.30 లక్షలు) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిందని, తమ వద్ద ఇందుకు సంబంధించిన ఆడియో ఆధారాలు ఉన్నాయని యాజమాన్యం వెల్లడించింది. దొంగతనం ఉదంతం బయటపడటంతోనే విషయాన్ని పక్కదారి పట్టించేందుకు చైర్మన్, జీఎమ్‌లతో పాటు ఇతర సీనియర్ మేనేజర్లపై అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. 73 ఏళ్ల వయస్సు, 52 ఏళ్ల వ్యాపార ప్రస్థానం ఉన్న చైర్మన్ డీవీ మనోహర్‌పై గానీ, 30 ఏళ్ల హోటల్ చరిత్రలో గానీ ఇప్పటివరకు ఎలాంటి లైంగిక వేధింపుల ఫిర్యాదులు లేవని, నిబంధనల ప్రకారం తమ వద్ద సీనియర్ మహిళా మేనేజర్ నేతృత్వంలో 'పోష్' కమిటీ కూడా ఉందని, అయితే బాధితురాలని చెప్పుకుంటున్న లావణ్య ఆ కమిటీకి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వివరించారు. ఈ సమావేశంలో హోటల్ జనరల్ మేనేజర్ ఉదయ్ సాహా, సీఎఫ్ఓ సీ చంద్రశేఖర్ ప్రసాద్, డైరెక్టర్ సత్య పింజల, ఐహెచ్‌ఎమ్ శ్రీశక్తి ప్రిన్సిపాల్ వై అనిత చంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
---––
More News...
<%- node_title %>
<%- node_title %>
#Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు
కరీంనగర్ సెప్టెంబర్ 8 (ప్రజా మంటలు) "సాధనాత్ సాధ్యతే" సర్వం అన్నట్లు సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు కరీంనగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి *టి హరుష్* *పరమ శివునికి చెందిన లింగాష్టక స్తోత్రాన్ని 53 సెకండ్లలో ఆలపించి గతంలో లింగాష్టకం పఠించిన వారి రికార్డును బద్దలు కొట్టాడు.
చిన్నతనము నుండే హరుష్... ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఇన్గొల్లపల్లి సెప్టెంబర్ 07(ప్రజా మంటలు అంకం భూమయ్య):
ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు... జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన
జగిత్యాల, సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి... అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన
హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.
నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత
హన్మకొండ, సెప్టెంబర్ 07, (ప్రజా మంటలు):
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు.
హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్... కొడంగల్‌పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ
హైదరాబాద్, సెప్టెంబర్ 6, ప్రజా మంటలు:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. ఈ నెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ... మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్, హైదరాబాద్, సెప్టెంబర్ 6: మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి... జగిత్యాలలో జీనియస్ చెస్ అకాడమీ ప్రారంభం
జగిత్యాల, సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు):
విద్యార్థుల్లో మేధాశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించడంలో చదరంగం కీలక పాత్ర పోషిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో విద్యార్థులకు చదరంగంలో మెరుగైన శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన జీనియస్ చెస్ అకాడమీని ఎమ్మెల్సీ ఎల్. రమణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే... రాచకొండ కళాధర్ పార్థివ దేహం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగింత
జగిత్యాల సెప్టెంబర్ 6 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి చెందిన రాచకొండ కళాధర్ శనివారం జగిత్యాలలో దేహం చాలించారు. వారి పార్థివ దేహాన్ని జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలకు దేహ దానం చేశారు కుటుంబ సభ్యులు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ బాధ్యులు మంచాల కృష్ణ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం కళాధర్... జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్ సస్పెండ్ ...
జగిత్యాల సెప్టెంబర్ 6(ప్రజా మంటలు):
జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్ ఐ అడ్మిన్ కిరణ్ కుమార్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
గత కొంతకాలంగా పోలీస్ సిబ్బందికి డ్యూటీల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కిరణ్ కుమార్‌పై వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కొంతమంది సిబ్బందికి డ్యూటీలు ఇవ్వకుండా, వారి నుంచి పెద్ద మొత్తంలో... సీఎం రేవంత్ రెడ్డిపై విషప్రచారం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ఫిర్యాదు
భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్
కరీంనగర్, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు అసత్య, అవమానకర ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్... 270 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయానికి తిరిగి వచ్చిన వర్జిన్ అట్లాంటిక్ విమానం
బెంగళూరు నుంచి లండన్ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య
బెంగళూరు, సెప్టెంబర్ 06, (ప్రజా మంటలు):
బెంగళూరు నుంచి లండన్‌కు బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆదివారం అత్యవసరంగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. విమానంలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ... 