బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జిపై రాజకీయ దుమారం.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్
అరవింద్–జీవన్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారా?
జగిత్యాల, జూలై 27 (ప్రజా మంటలు):
బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణం అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలపై వివరణ ఇచ్చారు.
మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లో కలిసి బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని వినతిపత్రం అందజేశానని తెలిపారు. దీనిపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని అన్నారు.
కేంద్ర మంత్రి జువెల్ ఓరం రాయికల్ పర్యటన సందర్భంగా జగన్నాథ్‌పూర్ బ్రిడ్జి మంజూరుకు హామీ ఇచ్చారని, అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి ఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎస్టీ వెల్ఫేర్ శాఖ పరిధిలో ఈ ప్రాజెక్టు ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రతిపాదనలు కేంద్రానికి పంపేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణానికి తొలి సంతకం చేశారని, టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు చేపట్టకపోవడంతో మళ్లీ టెండర్ ప్రక్రియ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు తెలిపారు.
"2012లో మంజూరైన కోటి రూపాయలు ఏమయ్యాయి?"
2012లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బోర్నపల్లి బ్రిడ్జికి రూ.1 కోటి మంజూరైందని అధికారులతో కలిసి ప్రజలకు ప్రకటించారని గుర్తు చేసిన ఎమ్మెల్యే, ఆ నిధులు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రజలు సమాధానం కోరుతున్నారని అన్నారు.
అరవింద్–జీవన్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారా?
గతంలో ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి పనిచేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు.
పీఎం జన్మన్ నిధులపై ప్రశ్న
కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకం కింద రావాల్సిన నిధుల విషయంలో మాజీ మంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
"తెలిసిన కాంట్రాక్టర్‌తో పని చేయొచ్చన్న వ్యాఖ్య ఆశ్చర్యం"
రాయికల్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో "తెలిసిన కాంట్రాక్టర్‌ను తీసుకొచ్చి పని చేయించొచ్చు" అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారని, గతంలో జగిత్యాలలో గణేష్ నవరాత్రుల సందర్భంగా తనకు తెలిసిన కాంట్రాక్టర్‌తో పనులు చేయిస్తే అభివృద్ధికి అడ్డుపడ్డారని విమర్శించిన వారు, ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు చేయడం విరుద్ధమని అన్నారు.
బ్రిడ్జిల నిర్మాణంపై ప్రశ్నలు
రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి హయాంలో బోర్నపల్లి–జగన్నాథ్‌పూర్ బ్రిడ్జితో పాటు ఇటిక్యాల–రామారావుపల్లి, రామాజీపేట, కోనాపూర్, మైతాపూర్ బ్రిడ్జిల నిర్మాణాలు ఎందుకు పూర్తి కాలేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ విమర్శలు
గత 25 ఏళ్లుగా టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించిన జీవన్ రెడ్డి, ఇప్పుడు రహస్య ఒప్పందంలో భాగంగానే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, గట్టు సతీష్, రాయికల్ మండల అధ్యక్షుడు రవీందర్ రావు, కోల శ్రీనివాస్, పాదం రాజు, సురేందర్ నాయక్, ప్రసాద్, మర్రిపెల్లి శ్రీనివాస్ గౌడ్, భూమేష్, నక్కల రవీందర్ రెడ్డి, రేపల్లె హరికృష్ణ, కుసరి అనిల్, కౌన్సిలర్ క్యాదాసు నవీన్, వీరబత్తిని శ్రీనివాస్, బొలిశెట్టి గంగారెడ్డి, అబ్బూరి మల్లేశం గౌడ్, నలువల సురేష్, మహేశ్వర్ రావు, విద్యాసాగర్, సాయి, దయాల్, శరత్, గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి. టౌన్ సిఐ కరుణాకర్.
జగిత్యాల సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు)
గణేష్ మండప నిర్వాహకులు రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రజా జీవనానికి భంగం కలగకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. విద్యుత్ తీగలకు దగ్గరగా గణేష్ మంటపాలను నిర్మించకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ట్రాఫిక్ అంతరాయం లేకుండా మంట పాలను ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ మండపాల్లో భక్తి... ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌ను కలిసిన ఉద్యొగ సంఘ నెతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రధానంగా పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి... మల్యాలలో వివాహిత ఆత్మహత్య.. కుమారుడి ఆచూకీ కోసం గాలింపు
మల్యాల, సెప్టెంబర్ 10 (ప్రజామంతలు):
మల్యాల మండలం ముత్యంపేట శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఓ వివాహిత తన చిన్న కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది.
మల్యాలకు చెందిన గుండేటి కవిత (36) తన భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం గుడిపేట శివారులోని వ్యవసాయ... *కలెక్టరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్*
జగిత్యాల, సెప్టెంబర్ 10(ప్రజా మంటలు)
తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మచిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్... "ఫెడరల్ బ్యాంక్ "వారిచే మృత్తిక గణపతి ప్రతిమల వితరణ
ఈస్ట్ ఆనంద్ బాగ్ సెప్టెంబర్ 10( ప్రజా మంటలు)మేడ్చల్ మల్కాజ్గిరి లోని ఈస్ట్ ఆనంద్ బాగ్ లో గల "ఫెడరల్ బ్యాంక్" శ్రీ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సమకాలీన స్థితికి అనుకూలంగా ప్రకృతి పరిరక్షణ పేరిట మృత్తిక (మట్టి ) గణపతి ప్రతిమలను తమ బ్యాంకు ఖాతాదారులకు వితరణ చేయడానికి శ్రీకారం చుట్టారు.... #Draft: Add Your Titleఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో హరుష్ కు దక్కిన చోటు
కరీంనగర్ సెప్టెంబర్ 8 (ప్రజా మంటలు) "సాధనాత్ సాధ్యతే" సర్వం అన్నట్లు సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు కరీంనగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి *టి హరుష్* *పరమ శివునికి చెందిన లింగాష్టక స్తోత్రాన్ని 53 సెకండ్లలో ఆలపించి గతంలో లింగాష్టకం పఠించిన వారి రికార్డును బద్దలు కొట్టాడు.
చిన్నతనము నుండే హరుష్... ధర్మపురి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రూ.200 కోట్ల తో అభివృద్ధి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
ఇన్గొల్లపల్లి సెప్టెంబర్ 07(ప్రజా మంటలు అంకం భూమయ్య):
ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో రూ.80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు... జగిత్యాలలో కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఆందోళన
జగిత్యాల, సెప్టెంబర్ 07 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి... అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ నిరసన
హైదరాబాద్, సెప్టెంబర్ 07, ప్రజా మంటలు: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.
నల్ల టీషర్ట్‌లు ధరించి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి: కల్వకుంట్ల కవిత
హన్మకొండ, సెప్టెంబర్ 07, (ప్రజా మంటలు):
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి హన్మకొండలో ర్యాలీ నిర్వహించారు.
హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అంతకుముందు అంబేద్కర్... కొడంగల్‌పై కవిత ఫోకస్.. కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ
హైదరాబాద్, సెప్టెంబర్ 6, ప్రజా మంటలు:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. ఈ నెల 23న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ... మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టాలి: కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్, హైదరాబాద్, సెప్టెంబర్ 6: మహిళలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీసు అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి... 