రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి
రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతి
- ఇండియా కూటమి నిర్ణయించే దిశ లో...
- - సోనియాతో మాయావతి చర్చలు సఫలం
- - బీఎస్పీ ఉత్తర ప్రదేశ్ లో 25 సీట్లలో పోటీ. హైదరాబాద్ మార్చ్ 09: భారత దేశ
రాజకీయాలలో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నో మార్పులకు కారణమైంది అలాగే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరి, కొత్త చరిత్ర రాయబోతుంది.
గత నెల రెండవ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతీల మధ్య సంభాషణ జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం లో బిజెపిని ఉత్తర భారత దేశంలో ఓడించాలంటే దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని,ఇండియా కూటమితో పాటు, కాంగ్రెస్ భావిస్తుంది.
మల్లికార్జున్ ఖర్గే దళితుడే
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే దళితుడే అయినా, ఆయన వ్యక్తిత్వాన్ని, అభ్యర్థిత్వాన్ని ఉత్తర భారతంలో సామాన్య జనాలకు చేర్చడంలో సమయం సరిపోదని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశం అంతటా ఎంతో ఓటు బ్యాంకు కలిగిన మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే బిజెపిని ఓడించడం సులభమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు ఇండియా కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీయే కాకుండా ప్రధాని అభ్యర్థిగా ఇతర ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ప్రకటించడం సాధ్యం కావడం లేదు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వాన్ని చాలామంది ప్రాంతీయ పార్టీ నాయకులు ఉత్తర భారత నాయకులు కూడా అంగీకరించడం లేదు.
ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించి, ఆయన పట్ల ఉత్తర భారత ప్రజలు సానుకూలంగా స్పందించడానికి, వారి వద్దకు కాంగ్రెస్, ఇతర పార్టీలు వెళ్లి ఖర్గేను పరిచయం చేయడానికి, ఆయన దళితుడని చెప్పడానికి సమయం సరిపోదని, దీనివల్ల కూటమికి నష్టం కలుగుతుందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
అందుకే ఉత్తర భారతానికి చెందిన, ముఖ్యంగా పార్లమెంటులో 80 స్థానాలు కలిగిన, ఇంతవరకు ఒకరిద్దరు తప్ప మిగతా ప్రధానులందరూ వచ్చిన ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన మాయావతిని, ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం సబబుగా ఉంటుందని కాంగ్రెస్ కూటమిలోని అందరినీ సోనియా గాంధీ ఒప్పించినట్లు తెలుస్తుంది.
ఇన్నాళ్లుగా, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోని వీలైనన్ని ఎక్కువ సీట్లలో ఉత్తర ప్రదేశ్ లోని అన్ని సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తానని బి.ఎస్.పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. కానీ మారిన పరిస్థితులలో సోనియా గాంధీతో చర్చించిన తర్వాత, గత వారం కాంగ్రెస్ లోని ఒకరిద్దరూ ప్రధాన నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపిన మాయావతి, తనకు ఉత్తర ప్రదేశ్ లో 25 పార్లమెంటు సీట్లను ఇస్తే కూటమిలో చేరడానికి సిద్ధమేనని తెలిపినట్టు వార్తలు వచ్చాయి. నిజానికి మాయావతి 35 సీట్లు అడిగిన 25 సీట్లు ఇవ్వడానికి కూటమి సిద్ధం అవ్వడంతో మాయావతి అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఈ 25 సీట్లలో ఎక్కువగా దళిత బహుజనులు ఓటర్లుగా ఉన్న వాటిని కేటాయించడానికి సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అంగీకరించినట్టు తెలుస్తుంది. కానీ మాయావతి దళిత ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలను ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది.
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అఖిలేష్ యాదవ్ దళిత యాదవ్ ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలలో ఓట్ల ను మార్పిడి చేసుకోవడంలో అంతగా విజయం సాధించలేదని, బీఎస్పీ ఓట్లు గతంలో కూటమికి బదిలీ కాలేదని అలాగే ఈసారి కూడా జరిగే ప్రమాదం ఉందని బిఎస్పి దళిత సీట్లలో పోటీ చేయడమే లాభకరమని సూచించినట్లు తెలుస్తోంది.
ఒకటి రెండు సీట్ల దగ్గర తప్ప మిగతా విషయాలలో కూటమిలోని అన్ని వర్గాల నాయకులు ఒక అవగాహనకు వచ్చినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటన కొరకు ఎదురుచూస్తున్నట్లు ఎదురు తెలుస్తుంది
ఎన్నికల ప్రకటన వచ్చిన వెంటనే ఇండియా కూటమిలో బహుజన సమాజ్ పార్టీ చేరుతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం కూటమికి ఎంతో లాభం చేకూరుస్తుందని, ముఖ్యంగా మధ్య, పశ్చిమ భారతంలోని దళిత బహుజనులందరూ ఏకముఖిగా కాంగ్రెస్ కూటమిని ఆదరిస్తారని ఆశిస్తున్నారు.
బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తున్న మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీని కాంగ్రెస్ కూటమితో కలవకుండా బిజెపి మొదటి నుండి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అసలు ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ కాంగ్రెస్ కూటమిలో చేరకుండా ఉండడానికి బిజెపి తన శక్తి యుక్తులు అన్నిటిని వాడుతుంది. సిబిఐ,ఈడి, ఇన్కమ్ టాక్స్ విభాగము, ఇతర విచారణ సంస్థల ద్వారా ఆయా పార్టీలను భయపెట్టి బెదిరించి, లొంగదీసుకుని, కూటమిలో చేరకుండా విపలయత్నాలు చేస్తుంది. అయినా రాజకీయ పార్టీలు "భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ" పేరిట ఇండియా కూటమిగా ఏర్పడి ఎలాగైనా బిజెపిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
బీజేపీ మెడకు ఎలెక్టోరల్ బాండ్స్ ఉచ్చు
ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల నిధుల సేకరణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్ట్రోరల్ బ్రాండ్ లను నిషేధించడమే, కాకుండా అవి రాజ్యాంగ విరుద్ధమని, ఏఏ పార్టీలకు ఎవరెవరు ఎన్ని నిధులు ఇచ్చారో తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం ఓటర్లకు ఉంటుందని, వీటి వివరాలను బయటపెట్టాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను కోరడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల అయ్యేవరకు ఆ వివరాలను ఇవ్వలేని పరోక్షంగా కోర్టుకు తెలపడం దేశ రాజకీయాలలో పెను మార్పులకు, నల్లకుబేరుల కాపాడడానికి ప్రభుత్వం ఇలా చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి
ఎస్బిఐ డొంకతిరుగుడు దోరణి, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించే తీరు తీవ్ర విమర్శలకు కారణమైంది.ఇది బిజెపికి మరియు ప్రధాని మోడీ వ్యక్తిత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. నల్ల డబ్బును ఏదో రీతిగా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికారంలో ఉన్న బిజెపికి అందజేయడానికే ఈ ఎలెక్టోరల్ బ్రాండ్స్ తెచ్చినట్టు విమర్శకులు తేల్చి చెప్పారు అందుకే నల్ల కుబేరులను రక్షించడానికి ఎస్బిఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారి, వివరాలను ప్రకటించడం లేదని విమర్శలు వచ్చాయి.
గత నెలలో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు బిజెపి వ్యవహరిస్తున్న తీరు, నిరంకుశత్వ ధోరణి, ప్రజలలో ముఖ్యంగా మధ్యతరగతి ఓటర్లలో బిజెపి పట్ల వ్యతిరేకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బిజెపి ఇతర ఎన్డీఏలో లేని పార్టీలన్నీ కాంగ్రెస్ కూటమిలో లేదా ఇండియా కూటమిలో చేరి "ప్రజాస్వామ్య పరిరక్షణ" పేర బిజెపిని ఎదుర్కొని ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. గత తొమ్మిది పది నెలల రాజకీయ చర్చలు, సమావేశాలు, పొత్తులు, నాయకుల పార్టీ బదలాయింపులు, అన్నింటిని క్రోడీకరించుకొని బహుజన సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ లతో సహా, చాలా వరకు, ప్రాంతీయ పార్టీలన్నీ ఈ కూటమిలో చేరిపోయాయి. ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలలో ఎన్డీఏలో ఉంటూ సీట్ల పంపకాలలో సమస్యలను ఎదుర్కొంటున్న స్థానిక పార్టీలు రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తాయో చూడాలి. మొత్తానికి ఈ ఎన్నికలు భారతదేశానికి ఒక దళిత ప్రధానిని తీసుకురావడం ఖాయంగా తెలుస్తుంది
More News...
<%- node_title %>
<%- node_title %>
మధిరలో ఏసీబీ వలలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందర్
మధిర నవంబర్ 24 (ప్రజా మంటలు):
మధిరలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా పని చేస్తున్న కె. చందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని ఏసీబీ బృందం చందర్‌ను పట్టుకున్నట్టు తెలుస్తోంది.
➤ భవన కార్మికుడు మృతి – ఇన్సూరెన్స్ మొత్తం బిల్లు కోసం... ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు... బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కు రాజకీయ అధికారం దగ్గర చేయడమే మా లక్ష్యం రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్.
జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు) బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం దగ్గరకు చేయడమే మా లక్ష్యం అన్నారు రాష్ట్రీయ లోకల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్అవినీతి రహిత సమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి... న్యూస్ రిపోర్టర్ షఫీ ని ఆసుపత్రిలో పరామర్శించిన జగిత్యాల తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత
ఐ
హైదరాబాద్ నవంబర్ 24(ప్రజా మంటలు)జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ అనారోగ్యంతో బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి... ఐబొమ్మ రవి కన్ఫెషన్లో సంచలన వివరాలు వెల్లడి?
హైదరాబాద్ నవంబర్ 24 (ప్రజా మంటలు):
ఐబొమ్మ బెట్టింగ్ వెబ్సైట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన రవి (ఐబొమ్మ రవి) అరెస్ట్ అనంతరం ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. రవిది చిన్నప్పటి నుంచే క్రిమినల్ మెంటాలిటీ అని విచారణ అధికారులు వెల్లడించారు. నేరాలకు పాల్పడేందుకు తన స్నేహితుల ఫేక్ ఐడెంటిటీ కార్డులను వినియోగించినట్లు... పల్లె పకృతి వనంలో గంజాయి తొ పట్టుబడిన యువకులు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు): బుగ్గారం మండలంలోని గోపులాపూర్ పల్లె ప్రక్రుతి వనం గంజాయి తో పట్టు బడ్డ యువకులు ఏ1 సురజ్ కుమార్,సం18 ఏ2. రాహుల్ కుమార్,బీహార్ రాష్ట్రం చెందిన ఇద్దరు యువకులు గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరీ వద్ద 60 గ్రాముల గంజాయి స్వాధీన పరుచుకొని ఎన్డిపిఎస్ సెక్షన్... గాంధీ వైద్యులు, సిబ్బంది పోస్టల్‌సేవలను వినియోగించుకోవాలి
సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్‌గాంధీఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పోస్టల్‌సేవలను వినియోగించు కోవాలని సికింద్రాబాద్‌డివిజన్‌సీనియర్‌సూపరింటెండెంట్, ఐపీఓఎస్‌అధికారిణి అనన్యప్రియ కోరారు. ఈమేరకు గాంధీ సూపరింటెండెంట్‌ప్రొఫెసర్‌వాణిని సోమవారం కలిసి పోస్టల్‌శాఖ అందిస్తున్న పోస్టల్‌ఖాతాలు, లైఫ్ఇన్సూరెన్స్, సుకన్య సమృద్ధి యోజన తదితర సేవలను వివరించారు.
ఎక్కువ వడ్డీ ఇచ్చే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ పోస్టల్‌శాఖ అని పేర్కొన్నారు.... నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న ఆవుల సాయవ్వ
ఇందిరమ్మ ఇళ్లు గృహం ప్రవేశం చేసిన రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్,కలెక్టర్ సత్యప్రసాద్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో బెస్తపల్లె వాడలో ఆవుల సాయవ్వకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి, సోమవారం గృహప్రవేశం చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్... గాంధీలో యాంటీ మైక్రోబయల్ పై అవగాహన
సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజా మంటలు)::
గాంధీ మెడికల్ కాలేజ్, గాంధీ ఆసుపత్రి మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అవగాహన వారం (WAAW) సోమవారంతో ముగిసింది. నవంబర్ 18 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగాయి.
ఈ సందర్భంగా సోమవారం 2024 బ్యాచ్ అండర్గ్రాడ్యుయేట్లు యాంటిబయాటిక్స్ సరైన వినియోగంపై స్కిట్... రోడ్డుపైనే అక్రమ నిర్మాణం... ప్రజావాణిలో ఫిర్యాదు
సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజా మంటలు):
బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోలాక్పూర్ లో ఓ ఇంటి యజమాని( 6-4-43/1) ప్రధాన రహదారిని ఆక్రమించుకొని ఇంటి ముందు ఇనుప మెట్లను నిర్మించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం GHMC బేగంపేట డిప్యూటీ కమిషనర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఇక్కడున్న నల్ల... శరణఘోషలతో వంగరలో అయ్యప్ప స్వాముల సందడి
అమలా కొండాల్ రెడ్డి దంపతుల సంప్రదాయ అయ్యప్ప పడిపూజ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎలక్ట్రికల్ నూతన డి ఈ గంగా రామ్
జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసిన జగిత్యాల ఎలెక్ట్రికల్ డి ఈ గా నూతనంగా నియామకం అయిన గంగారామ్ ఈ కార్యక్రమంలో నాయకులు నక్కల రవీందర్ రెడ్డి శ్రీరామ్ భిక్షపతి దుమాల రాజ్ కుమార్... 