వెలుగుమట్ల బాధితులకు అండగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ – తొలి రోజే సమస్యల పరిష్కారానికి చర్యలు
వెలుగుమట్ల, ఖమ్మం (మార్చ్ 18 – ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వారికి కొండంత అండగా మారింది. తొలి రోజే బాధితుల సమస్యలు పరిష్కారమయ్యేలా కమిటీ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‌లో ఉంటున్న బాధితుల పిల్లల చదువు, భోజనం, ఆరోగ్యం, నివాసం వంటి అంశాలను ప్రభుత్వం పూర్తిగా చూసుకుంటుందని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు కమిటీ వెల్లడించింది. అర్హులైన వారికి ఇళ్ల మంజూరు చేస్తామని, సరైన ఆధారాలు ఉన్న అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని కూడా కలెక్టర్ స్పష్టం చేసినట్లు సభ్యులు తెలిపారు. మొత్తం 750 మంది బాధితుల జాబితాను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు.
అంతకుముందు ఖమ్మం ఖానాపురంలోని ఫూలే-అంబేద్కర్ అధ్యయన వేదికలో కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో సభ్యులు బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను వివరించారు. అనేక మంది అర్హులకు ఇళ్ల పట్టాలు రాలేదని, కొందరికి టోకెన్లు ఇచ్చినా ఇంటి నంబర్లు ఇవ్వలేదని వారు వాపోయారు.
తమకు ఇష్టంలేకపోయినా ఇందిరమ్మ ఇండ్లకు ఒప్పుకున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. టోకెన్ ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు ఇవ్వకుండా తన టోకెన్‌ను వేరే వారికి కేటాయించారని విజయలక్ష్మి అనే బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్‌తో సమావేశం
బాధితుల సమస్యలు విన్న అనంతరం కమిటీ సభ్యులు కలెక్టర్‌ను కలిసి అన్ని అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పిల్లల విద్య కోసం గురుకుల, అంగన్వాడీ పాఠశాలల్లో చేర్పిస్తామని, వారికి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అర్హుల పేర్లు జాబితాలో లేకపోయినా వారికి ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
బాధితులకు భరోసా
ఇళ్లు కోల్పోయి షెల్టర్లలో అష్టకష్టాలు పడుతున్న బాధితులకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అండగా నిలిచింది. వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కార మార్గం సుగమమవుతోంది. ముఖ్యంగా విజయలక్ష్మి సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆమె కమిటీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, విశారదన్ మహారాజ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటం కొనసాగుతుందని కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు – దావ వసంత సురేష్
జగిత్యాల, మార్చ్ 18 (ప్రజా మంటలు):
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.ఈ సందర్భంగా ప్రత్యేక... వెలుగుమట్ల బాధితులకు అండగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ – తొలి రోజే సమస్యల పరిష్కారానికి చర్యలు
వెలుగుమట్ల, ఖమ్మం (మార్చ్ 18 – ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వారికి కొండంత అండగా మారింది. తొలి రోజే బాధితుల సమస్యలు పరిష్కారమయ్యేలా కమిటీ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్‌లో... విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి
జగిత్యాల మార్చి 18 (ప్రజా మంటలు) విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్.
ఇట్టి కార్యక్రమములో సంఘ సభ్యులు చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు బొల్లరపు గిరిధర్ స్వప్న, దయాల... జగిత్యాలలో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రం.. సంజయ్ కుమార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్జగిత్యాల రాజకీయాలు హీట్.. ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆగ్రహంకాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిందెవరు? జీవన్ రెడ్డి బహిరంగ విమర్శలుజగిత్యాల మార్చ్ 27 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి... రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక.
జగిత్యాల 16 మార్చి (ప్రజా మంటలు) :
ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణి ఎంపిక కావడము జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ,... ఇక కాంగ్రెస్ కు రామ్ రామ్ కారు ఎక్కనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
?జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పనున్నట్లు ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి.
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎన్నో ఉత్తాన పతనాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి... సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తక ఆవిష్కరణ
జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ వానరాశి తిరుమలయ్య సహకారంతో జరిగిన ముందస్తు ఉగాది వేడుకల కార్యక్రమంలో భాగంగా సామాజిక సమరసత వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో" సంచార జాతులు-సమగ్ర సర్వే"పుస్తకావిష్కరణ చేయటం జరిగింది.
సామాజిక సమరసత కార్యకర్తలు తెలంగాణ అన్ని ప్రాంతాల్లోని దాదాపు... జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి
బీఆర్ఎస్/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి?
రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి
జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు):
జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ,... ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం... కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి దాడి – రెండో రోజు మరో ఆవు బలి, భయాందోళనలో గ్రామస్తులు
కొడిమ్యాల, మార్చి 16 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో మళ్లీ పెద్దపులి దాడి జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా రెండో రోజు పులి దాడి చేసి మరో ఆవును చంపింది.గ్రామానికి చెందిన రైతు తేజావాద్ మోతీలాల్‌కు చెందిన ఆవుపై సోమవారం పెద్దపులి దాడి చేసి చంపింది.... రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక
జగిత్యాల మార్చి 16(ప్రజా మంటలు)ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణిఎంపిక కావడము జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల *ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ, సిస్టర్స్ రెజిన,లిల్లీ,రాణి, వ్యాయామ... హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కవిత ఆగ్రహం – డిఫమేషన్ కేసు వేస్తా, మూసీ ప్రక్షాళనపై తీవ్ర విమర్శలు
.“హైడ్రాపై కవిత తీవ్ర ఆరోపణలు: పేదల ఇళ్లు కూల్చి పెద్దలను కాపాడుతున్నారా?”“మూసీ ప్రక్షాళనలో 1400 కోట్లు ఎలా పెరిగాయి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కవిత”“హైడ్రా వీడియోలు వెంటనే తొలగించాలి.. లేదంటే కోర్టు!” – రంగనాథ్‌కు కవిత హెచ్చరిక“మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజాధనం దోపిడీ జరుగుతోంది: కవిత సంచలన వ్యాఖ్యలు”
వెలుగుమట్ల... 