మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
గొల్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఎంబిబిఎస్ మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులు కట్కూరి మహేందర్ రాపల్లి మరియు చందం రాజేష్ వెల్గటూర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకుల చేతుల మీదుగా సన్మానించారు కట్కూరి మహేందర్ ,నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించగా, చంద రాజేష్, పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో హైదరాబాదులో సీటు సాధించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఈ కళాశాలలో నాణ్యమైన విద్య అందుతుందని ప్రిన్సిపాల్ విద్యార్థులకు సలహాలు ప్రేరణ కలిగిస్తూ ముందుకు నడిపిస్తారని పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను సమకూరుస్తారని పట్టుదలతో అంకితభావంతో చదివితే సాధించలేనిది లేదని పేదరికం నుండి బయట పడాలంటే, ఎక్కడ ప్రైవేట్ కళాశాలకు వెళ్లకుండా సీట్లు సాధించామని విద్యార్థులు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇది మా కళాశాలకు గర్వకారణమని , వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుత విద్యార్థులు అంకితభావంతో కష్టపడి వీరిలాగా విజయం సాధించాలని ఆకాంక్షించారు. తాము బోధించిన విద్యార్థులు మెడికల్ కళాశాలలో సీట్లు సాధించడం చాలా సంతోషంగా ఉందని భౌతిక శాస్త్ర అధ్యాపకులు తిరుపతి, రసాయన శాస్త్ర అధ్యాపకులు బాలరాజు, విద్యార్థులను అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.

బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
