మహాభాతకమ్మ ప్రత్యేకంగా నిర్వహించాలి - మాజీ కౌన్సిలర్ జయశ్రీ
జగిత్యాల సెప్టెంబర్ 28 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటి వారు రూ.2,84,758 లతో చేపట్టిన" మహ బతుకమ్మ " కార్యక్రమము ప్రత్యేకంగా నిర్వహిస్తూనే ఎక్కువ మంది మహిళలు పాల్గొనే అవకాశం ఉంది, కానీ ,29వ తేదీన నిర్వహించడం వల్ల ప్రజాధనం వృథా అవుతుంది కావున అధికారులు ఆలోచించించి, వేరే రోజు నిర్వహించాలని 35 వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్.హనుమండ్ల జయశ్రీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
జయశ్రీ తన ప్రకటనలో ఇంకా ఇలా తెలిపారు.
మున్సిపల్ ముందు మహ బతుకమ్మ కార్యక్రమము ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించగా, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, సద్దుల బతుకమ్మ రోజు అంటే 29/9/2025 రోజున చింతకుంట చెరువు వద్దనే ఈ కార్యక్రమం చేయాలని ఆదేశాలు ఇచ్చినారని అధికారులు చెపుతున్నారు.
దాదాపు అన్ని ప్రాంతాల మహిళలు వారి ప్రాంతాలలో ఆడుకుని వారికి ఏర్పాట్లు చేసిన ( గొల్లపల్లి రోడ్, కండ్లపెల్లి,మోతే మరియు హౌసింగ్ బోర్డు) ప్రాంతాలలో బతుకమ్మ నిమజ్జనం చేసుకుంటారు. మరియు ఈ చింతకుంట చెరువు పరిసర ప్రాంతాలలో ఆడుకున్న మహిళలు అందరూ అక్కడ చేరుకొని పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడుకోవడం జరుగుతుంది. అక్కడ ఈ "మహ బతుకమ్మ" కార్యక్రమం చేయడం వల్ల అక్కడికి వచ్చె మహిళలకు చాల ఇబ్బందికరంగా ఉంటుంది. మరియు అక్కడ కనీసం నిలబడే స్థలం కూడ ఉండదు.
అక్కడ స్టేజీ వేసి కార్యక్రమం చేయడం అసాధ్యమైన పని. అక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి మహిళలకు ఇబ్బంది పెట్ట వద్దు అని అధికారులకు తెలియ చేస్తూ మరియు ఇక్కడ మహా బతుకమ్మ కార్యక్రమం చేస్తే కేవలం ఒక మహా బతుకమ్మ తయారు ఖర్చు కేవలం యాబై వేల నుండి అరవై వేల మధ్య ఉంటుంది తప్ప మిగత ఖర్చు ఏది కూడ ఉండదు. ఎందుకంటే అక్కడ లైటింగ్, DJ సిస్టమ్ బతుకమ్మ ఘాట్ల లో భాగంగా ముందే ఏర్పాట్లు చేస్తారు. మహా బతుకమ్మ కార్యక్రమం పట్టణ మహిళలు అందరూ పాల్గొనే కార్యక్రమం కానీ ఇప్పుడు ఇది కేవలం అధికారులు వారీ కొరకే పెట్టుకున్నట్లు కనపడుతుంది ఇది ప్రజాధనము కావున, మహబతుకమ్మ పేరు మీద, ప్రజాదనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాద్యత ఉన్నతాధికారులదే నని, ఆలోచించాలని ఆమె కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.

బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
