టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత
వైద్య పరిశోధనల కోసం స్టూడెంట్స్ కు ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్
సికింద్రాబాద్, అక్టోబర్ 22 (ప్రజామంటలు) :
హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు వేంకటేశ్వరరావు కుమార్తె, సంఘసేవకురాలు బూర్గుల సుమన (88) పార్ధివదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలకు ఆమె కుటుంబసభ్యులు బుధవారం అప్పగించారు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు సోదరి అయిన సుమన హైదరాబాద్‌లోని ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూలులో టీచర్‌గా విధులు నిర్వహించి పదవీవిరమణ పొందారు. 2011 నుంచి 2021 వరకు రంగారెడ్డిజిల్లా షాద్‌నగర్ ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామ సర్పంచ్‌గా, ఎంపీటీసీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రగతి వెల్ఫేర్ అసోషియేషన్‌ను ఏర్పాటు చేసి పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు.
మరణించిన తర్వాత కూడా తన శరీరం ఉపయోగపడాలనే ధ్యేయంతో పార్ధివదేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించాలని వీలునామా రాసారు. వృద్ధాప్య రుగ్మతలతో బాధపడుతు కొంత కాలంగా నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆమె ఈనెల 21వ న మృతి చెందారు.ఆమె చివరి కోరిక మేరకు భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు మెడికల్ కాలేజీకి అప్పగించారు. బూర్గుల సుమన పార్ధివదేహానికి ఎంబామింగ్ (రసాయనాల పూత) చేసి భధ్రపరుస్తామని తెలిపారు.
వైద్యవిద్యార్థుల పరిశోధనల కోసం వినియోగిస్తామని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఇందిర, అనాటమీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ సుధారాణి, ప్రొఫెసర్ సుధాకర్ బాబు తెలిపారు. సుమన కుటుంబసభ్యులు ప్రదీప్, అంభిక, మాధురిక, సాగరికమాలిని, ప్రొఫెసర్ రమ, డాక్టర్ అరుణ, అనుపమ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
