ర్యాగింగ్ కు గురైతే వెంటనే ఫిర్యాదు చేయండి -ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి
జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తే కఠిన చర్యలు
గాంధీ మెడికల్ కాలేజీ 2025 ఎంబీబీఎస్ బ్యాచ్ స్టూడెంట్స్ కు అవేర్నెస్
సికింద్రాబాద్, అక్టోబర్ 22 ( ప్రజామంటలు) :
జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి హెచ్చరించారు. గాంధీ మెడికల్ కాలేజీలో బుధవారం నూతన ఎంబీబీఎస్ బ్యాచ్ స్టూడెంట్స్ కు ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ర్యాగింగ్ ఘటన జరిగిన వెంటనే సంబంధిత కాలేజీ ర్యాగింగ్ కమిటీకి తెలపాలన్నారు.
అలాగే నేషనల్ యాంటీ ర్యాగింగ్ టోల్ ఫ్రీ 1800 180 5522 లేదా 100 కు కాల్ చేయాలన్నారు. సెన్సిటివ్ గా ఉండే స్టూడెంట్స్ ర్యాగింగ్ కు గురైతే సూసైడ్ లాంటి ఘటనలకు పాల్పడకుండా, తమ వారికి, కాలేజీ అధికారులు, పోలీసులకు చెప్పాలన్నారు. ర్యాగింగ్ గురించి అధికారులకు ఫిర్యాదుచేయడానికి ఇబ్బంది పడే స్టూడెంట్స్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్ లో తమ కంప్లెయిట్ లను రాసి వేయవచ్చన్నారు. డ్రగ్స్ వినియోగం, అమ్మకం చట్టరీత్యా నేరమన్నారు. అలాగే సోషల్ మీడియాకు ఎంత తక్కువగా దూరంగా ఉంటే అంతమంచిదన్నారు.
ఫ్రెండ్స్ షిప్ రిక్వెస్ట్ లతో మన ఫొటోలు, వీడియోలు తీసుకొని, మనల్నే బ్లాక్ మెయిలింగ్ చేస్తారని, ఇలాంటి వారిపై చాలా కేర్ఫుల్ గా ఉండాలని సూచించారు. తమ పిల్లలపై పేరేంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నత చదువులను చదివిస్తారని, వారి నమ్మకాలను వమ్ము చేయకుండా స్టూడెంట్స్ ర్యాగింగ్, డ్రగ్స్,సోషల్ మీడియా లాంటి విషయాలను పట్టించుకోకుండా, కేవలం తమ కెరీర్ ప్రొఫెషనల్ పై దృష్టి సారించి, ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఇంటర్ తర్వాత ప్రస్తుత యుక్త వయస్సులో వచ్చే స్వేఛ్చను దుర్వినియోగం చేసుకోకుండా, సద్వినియోగం చేసుకొని, నలుగురికి ఆదర్శంగా నిలవాలన్నారు. మెడికల్ ప్రొఫెషన్ సమాజంలో ఎంతో గొప్పదని, ఆ వృత్తిలో రాణిస్తూ, నలుగురికి వైద్య సేవలు అందిస్తూ, వారి ప్రాణాలను కాపాడితే జీవితంలో అంతకన్నా తృప్తి మరొకటి ఉండదన్నారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి, వైస్ ప్రిన్సిపాల్ డా.రాజారామ్, ఆర్ఎంవో శేషాద్రి, చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అనుదీప్, ఎంపీహెచ్వో వేణుగోపాల్ గౌడ్, సిబ్బంది, 2025 బ్యాచ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
