జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు
జగిత్యాల అక్టోబర్ 2 ( ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నుండి స్వామి వారు ఉభయ దేవేరులచే స్థానిక జంబిగద్దే పైన శమీ పూజ నిర్వహించుకొని అనంతరం భక్తులకు దర్శనమిస్తారు.
కాగా జగిత్యాల పట్టణంలో చాకుంట వారి పూర్వీకుల నుండి స్వామివారు తొమ్మిది రోజులపాటు చాకుంట రంగారావు పూర్వీకుల పరంపరగా వారి నివాసానికి వెళ్లి మంగళహారతి పొందడం ఆచారంగా వస్తున్నది. అదే విధంగా దసరా నాడు సైతం ఆలయం నుండి చాకుంట వారి నివాసానికి వెళ్లి స్వామివారికి మంగళహారతులు తీసుకోవడం జరుగుతున్నది. అనంతరం జమ్మి గద్దెపైన శమీ పూజ నిర్వహించి పట్టణంలో అన్ని వాడల్లో ఊరేగింపుగా స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వగా భక్తులు స్వామి వారికి మంగళహారతులతో స్వాగతం పలుకుతారు.
శమీ పూజలో అనాది నుండి పరంపరగా వివిధ గ్రామాలకు "అసలుదారులుగా" వ్యవహరించిన చాకుంట కుటుంబం వారు, ఇనుముల పెల్లి కుటుంబం వారు శమీ పూజ ,ఆయుధ పూజలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుండగా ఆ పరంపరలో భాగంగా చాకుంట వేణుమాధవ్ రావు శమీ పూజలో పాల్గొన్నారు.
ఆయనతోపాటు ప్రభుత్వం పక్షాన జగిత్యాల అర్బన్ తాసిల్దార్ రామ్మోహన్ దంపతులు, మున్సిపల్ కమిషనర్ స్పందన తదితరులు ఉన్నారు. కాగా వైదిక క్రతువును జగిత్యాల బ్రాహ్మణ సంఘ సభాపతి కుటుంబీకులు తిగుళ్ల విశ్వనాథ శర్మ, పట్టణ పురోహితుల కుటుంబీకులు రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకులు నంబి వేణుగోపాల ఆచార్య మరియు వారి కుటుంబీకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు - ఆలయంలో భక్తుల రద్దీ

చెరువులో పడి వ్యక్తి మృతి

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు
