దసరా గాంధి జయంతి ఒకే రోజు మందు బాబులకు తప్పని తిప్పలు
దసరా గాంధి జయంతి ఒకే రోజు మందు బాషాపులన్నీ బంద్
హైదరాబాద్ సెప్టెంబర్ 30:
గాంధీ జయంతి, దసరా పండుగ ఒకే రోజు రావడంతో రాష్ట్రంలో సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కానీ, పండుగలో మందుబాబులకైతే ఇది పెద్ద షాక్ అయింది.షాపులన్నీ బంద్. తడారిపోతున్న గొంతు.
ప్రభుత్వం గాంధీ జయంతి సందర్భంగా సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించడంతో, వందలాది మద్యం దుకాణాలు, మాంసం షాపులు మూతపడ్డాయి. దసరా బిర్యానీకి చికెన్ దొరకక, బీరు బాటిల్ బదులుగా కూల్‌డ్రింక్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
దసరా రోజు ఇలా ఉండచ్చు మందుబాబుల పరిస్థితి
మద్యం షాపుల ముందు ఉదయం నుంచే గుమిగూడిన మందుబాబులు ‘ఇవాళ దసరా పండగ కాదు, దుఃఖరా పండగ’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కొందరు గాంధీ ఫ్లెక్సీ ముందు నిలబడి, ‘బాపూ, మద్యం మానమన్నా… కనీసం పండగ రోజు మినహాయింపు ఇవ్వాల్సిందే కదా?’ అని మనసులోనే ఆవేదన వెళ్లగక్కారు.
సోషల్ మీడియాలో అయితే మీమ్స్, జోకులు వరదలా వచ్చేస్తున్నాయి. ఒక నెటిజన్ రాసినట్టుగా, ‘దసరా రోజున రాక్షస సంహారం కాకుండా, మద్యం సంహారం జరిగింది’ అన్న వాక్యం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మొత్తానికి, పండుగ రుచులు, రంగులు అందరికీ లభించాయి కానీ, మందుబాబులకు మాత్రం ఇది విజయదశమి కాదు, ఓటమి దశమిగా నిలిచిపోయింది.”
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
