గత స్మృతుల సవ్వడి - పూర్వ విద్యార్థుల సందడి
గురువులను సన్మానించిన పూర్వ విద్యార్థులు
గత స్మృతుల సవ్వడి - పూర్వ విద్యార్థుల సందడి
* గురువులను సన్మానించిన పూర్వ విద్యార్థులు
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 29 ప్రజామంటలు :
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ శ్రీకృష్ణ దేవరాయ ఉన్నత పాఠశాల 1997–2003 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సదస్సు ఆదివారం ముల్కనూరు శ్రీనివాస ఏ/సి ఫంక్షన్ హాల్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశాన్ని పూర్వ విద్యార్థులే స్వయంగా ముందడుగు వేసి నిర్వహించడం విశేషం. ఈసదస్సులో పూర్వ విద్యార్థులతో పాటు పాఠశాలలో బోధన చేసిన ఉపాధ్యాయులు, మాజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ, “పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు పాఠశాల ప్రతిష్ఠను పెంపొందించడమే కాకుండా, కొత్త తరం విద్యార్థులకు స్ఫూర్తి నింపుతాయి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల మధ్య బంధం మరింత గాఢమవుతుంది” అని పేర్కొన్నారు. అలాగే పూర్వ ఉపాధ్యాయులు ఎ. నాగేశ్, జి. వీరభద్రయ్య, మధు, వి. కుమార్, ఆర్. జనార్ధన్, ఎ. శ్రీనివాస్, బి. రాజయ్య, వెంకన్న, కె. సదానందం, శంకర్ రెడ్డి, ఎన్. సంపత్, మహిపాల్, కుమార్ తదితరులు హాజరై పూర్వ విద్యార్థులను ఆశీర్వదించారు. లేడీ టీచర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థుల అనుబంధాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థులు తమ విద్యా జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. “మా జీవిత ప్రయాణంలో ఈ పాఠశాలలో నేర్చుకున్న విలువలు, గురువుల బోధనలు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటాయి” అని భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులను పూలమాలలతో సన్మానిస్తూ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. చివరగా, పూర్వ విద్యార్థులు ఇలాంటి సమ్మేళనాలను ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
