అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్టుపల్లి ఏప్రిల్ 26( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
సమాజం లోని అన్నీ వర్గాల ప్రజలకు న్యాయ విజ్ఞానం అందించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నాం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకి ఆయన ముఖ్య అతిధి గా హాజరు ఐయి ప్రసంగించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, న్యాయరంగానికి సంబంధించిన జడ్జీలు, న్యాయవాదులు, పోలిసులు కూడా నిత్య విద్యార్తులే నని, ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ సందర్బంగా సీనియర్ న్యాయవాదులు రాజ్ మహ్మద్, జిల్లా వెంకటేశ్వర్లు, మగ్గిడి వెంకట నరసయ్య, కోటగిరి వెంకటస్వామి, గడ్డం శంకర్ రెడ్డి, దయ్యా రాజారాం లు వివిధ సామాజిక అంశాలు, చట్టాలపై ప్రసంగించారు.
ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు తోగిటి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి గజేల్లి రాందాస్ , లోక్ అదాలత్ సభ్యులు వడ్డేపల్లి శ్రీనివాసన్, జేడి సుధాకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెర్లపల్లి ఆనంద్ గౌడ్, న్యాయవాదులు బోడ లక్ష్మణ్, బద్దం లక్ష్మారెడ్డి, దయాకర్ వర్మ, శేఖర్, నర్సయ్య, గోపి, వెంకటేష్, రాజేశ్వర్ గౌడ్ మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్ మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
