తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీ కన్నుమూత – సాహిత్య లోకానికి, తెలంగాణ భావజాలానికి తీరని లోటు
హైదరాబాద్ నవంబర్ 10 (ప్రజా మంటలు):: తెలంగాణలో విషాదం ఏర్పడింది. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గీతాల సృష్టికర్త డా. అందెశ్రీ (64) ఇక లేరు. ఆదివారం రాత్రి ఇంట్లోనే ఒక్కసారిగా తీవ్రమైన అస్వస్థతకు గురై కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 7:25 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు.
పాఠశాల చదువు లేకుండా కవితా ప్రపంచంలో వెలిగిన ఆస్త్రం
డా. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగాం మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు.
మొత్తం పాఠశాల చదువు కూడా లేకపోయినా తన సహజ ప్రతిభ, వినికిడి, భావ సమృద్ధితో కవిత్వ ప్రపంచంలో అద్భుతంగా ఎదిగిన అరుదైన వ్యక్తుల్లో అందెశ్రీ ఒకరు.
ప్రజాకవి – ప్రకృతి కవిగా గుర్తింపు
ఆయన కవితలు సాధారణ ప్రజల భావాలను, ప్రకృతి చిత్రణలను, తెలంగాణ పల్లె జీవన వర్ణనలను గుండెల్లోంచి వెలువడేలా వినిపిస్తాయి. ఈ కారణంగా ఆయనకు “ప్రజాకవి”, “ప్రకృతి కవి” అనే బిరుదులు వరించాయి.
ఆయన రచించిన అనేక పాటలు, కవితలు తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల, యువతలో స్ఫూర్తి నింపాయి.
‘మాయమైపోతున్నడమ్మా’ – తెలంగాణ పల్లె ఆత్మకు ప్రతిబింబం
పాఠశాల చదువుల్లేకపోయినప్పటికీ “మాయమైపోతున్నడమ్మా” పాటతో అందెశ్రీ తెలుగు కవిత్వంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించారు.
సామాన్యుల జీవన కష్టాలు, పల్లె బాధలను ఎంతో భావోద్వేగంతో, సహజ మాటలతో చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్ర
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్నప్పుడు అందెశ్రీ రచనలు, గీతాలు ఉద్యమకారుల నినాదాలుగా మారాయి.
ఆయన రచించిన “జయ తెలంగాణ” పాట తెలంగాణ ఉద్యమానికి అంకితమైన ప్రేరణ గీతంగా నిలిచింది.
రాష్ట్ర ప్రభుత్వం దీనిని అధికారిక రాష్ట్రగీతంగా గుర్తించింది, ఇది ఆయనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవం.
జయహే! అందెశ్రీకి దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చిన పాట
“జయహే” పాటతో ఆయనకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఆయన పాటలు గ్రామీణ జీవితం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.
జీవితంలో చివరి ఘనత – రాష్ట్ర అవార్డు
2025 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నగదు పురస్కారం అందుకున్నారు.
ఇది ఆయన చివరిగా అందుకున్న అధికారిక గౌరవం.
అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి, అభిమానులకు ఇది అపార నష్టం.
తెలంగాణ సాహిత్య వర్గాలు తీవ్ర సంతాపం
తెలంగాణ బీసీ కమిషన్ తొలి చైర్మన్ బి ఎస్ రాములు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తెలంగాణలో ఈశతబ్దపు ప్రజాకవులలో అగ్రగణ్యుడని, ఆయన ఆలోచనలు, ఆచరణ తెలంగాణ సాహిత్యానికి చేసిన సేవలు మరువలేనివి అంటూ, ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.
కరీంనగర్ మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ తుల ఉమ, డా.తుల రాజేందర్, మాజీ మంత్రి జి.రాజేశం గౌడ్ లు సంతాపం వ్యక్తం చేశారు.
జగిత్యాలతో అందెశ్రీ ప్రత్యేక అనుబంధం ఉందని, జగిత్యాల శాతవాహన hai skool ki atana విద్యార్థులతో జరిపిన సంభాషణలు, ఉద్యమ కాలంలో పిల్లలలో ఎంతో స్పూర్తిని, ఉత్సాహాన్ని నింపాయని, ఆయనలోని లోటు తీర్చలేనిదని పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి స్మితరావు,వారి కుటుంబానికి ప్రగడ సంతాపం తెలుపుతున్నామని, తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.
తెలంగాణ కవులు, రచయితలు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు అందెశ్రీ మరణాన్ని తీరని లోటుగా అభివర్ణించారు.ట్విట్టర్, ఫేస్‌బుక్, సోషల్ మీడియాసర్వత్రా ఆయనకు ఘన నివాళుల వెల్లువ కనిపిస్తోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
"భారాస నుంచి నన్ను అవమానకరంగా పంపారు… ఆడపిల్ల రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా" — కవిత
హనుమకొండ, బాలసముద్రం నవంబర్ 10 (ప్రజా మంటలు)"భారాస నుంచి నన్ను అవమానకరంగా బయటకు పంపారు. నేను తప్పు చేసి ఉంటే కనీసం ఒక నోటీసైనా ఇవ్వాల్సింది. ఇప్పుడు భారాసతో నాకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదు," అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కళ్వకుంట్ల కవిత అన్నారు.
హనుమకొండలోని బాలసముద్రం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్... అందెశ్రీ మృతదేహం వినోబా నగర్‌కి చేరింది – ప్రజల దర్శనార్థం ఏర్పాట్లు
సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజా మంటలు):
ప్రసిద్ధ కళాకారుడు అందెశ్రీ మృతదేహం ఈరోజు లాలాపేట్‌లోని వినోబా నగర్‌లోని వారి నివాసానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో విచారంతో తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు.
అందెశ్రీ మృతదేహం ఈరోజు సాయంత్రం వరకు వినోబా నగర్‌లోనే ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు కుటుంబ... Telangana’s Renowned Poet Ande Sri Passes Away
By Ch V Prabhakar Rao.
Hyderabad November 10 (Praja Mantalu):
A tragic incident shocked Telangana on Monday. Celebrated poet, lyricist and Telangana movement icon Dr. Ande Sri (64) passed away. On Monday early mirning , Ande Sri suddenly collapsed at... ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత
సికింద్రాబాద్ నవంబర్ 10 (ప్రజా మంటలు):ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ, గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ, ఉదయం 7.25 ప్రాంతంలో మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.ప్రపంచమంతా తిరిగి నదుల పుట్టుకపై దీర్ఘ కావ్యం రాసారు. తెలంగ ఉద్యమం, చరిత్రపై ఈయన రాసిన 100 పేజీల గ్రంథం అనేక ప్రశంసలను అందుకొంది .1961 జూలై... తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీ కన్నుమూత – సాహిత్య లోకానికి, తెలంగాణ భావజాలానికి తీరని లోటు
హైదరాబాద్ నవంబర్ 10 (ప్రజా మంటలు):: తెలంగాణలో విషాదం ఏర్పడింది. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గీతాల సృష్టికర్త డా. అందెశ్రీ (64) ఇక లేరు. ఆదివారం రాత్రి ఇంట్లోనే ఒక్కసారిగా తీవ్రమైన అస్వస్థతకు గురై కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ... ఢిల్లీ విమానాశ్రయంలో GPS సిస్టమ్‌పై కుట్ర?
న్యూఢిల్లీ నవంబర్ 10: దేశ రాజధాని ఢిల్లీ ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు రోజుల క్రితం జరిగిన భారీ విమాన రద్దులు, ఆలస్యాల వెనుక ఉన్న నిజం బయటపడింది. GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) లో సిగ్నల్ జ్యామింగ్ జరిగిందని దర్యాప్తులో స్పష్టమైంది. దీని కారణంగా 800కిపైగా ఫ్లైట్లు ప్రభావితమైనట్లు అధికారులు ధృవీకరించారు.పైలట్లకు నకిలీ... వివాహేతర అనుమానాలతో భార్యను బ్యాట్‌తో కొట్టి హత్య చేసిన భర్త
చందానగర్ నవంబర్ 10:సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన దారుణ ఘటనతో ప్రాంతం ఒక్కసారిగా కలకలం రేగింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త తన భార్యను కిరాతకంగా హత్యచేసిన కేసును పోలీసులు నమోదు చేశారు.
గుంటూరు జిల్లాకు చెందిన బ్రహ్మయ్య – క్రిష్ణవేణి(37) దంపతులు కొంతకాలంగా అమీన్పూర్ పట్టణంలోని ... RBI కొత్త నిబంధనలు: బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నియమాలు — మీకు తెలియాల్సినది
ముంబాయి నవంబర్ 10:
ప్రస్తుతం భారత్‌లో ఎక్కువ మంది బ్యాంక్ ఖాతాలను వినియోగిస్తున్నారు. సాధారణంగా బ్యాంక్ ఖాతాలు రెండు రకాల్లో ఉంటాయి — Current Account మరియు Savings Account. చాలా మంది వారి సేవింగ్స్ ఖాతాల్లో అవసరమైన కనీస బ్యాలెన్స్ (Minimum Balance) ను నిలిపి ఉంచుటలో విఫలవుతున్నారు. ఈ కారణంగా బ్యాంకులు... గోపాల్ గంజ్ లో అదుపు తప్పిన కారు: ముగ్గురికి తీవ్ర గాయాలు – ఉద్రిక్తతతో హింసాకాండ
గోపాల్ గంజ్ నవంబర్ 10:
బీహార్‌లోని గోపాల్గంజ్ జిల్లా ఆదివారం సాయంత్రం భయానక సంఘటనకు వేదిక అయింది. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో అదుపు తప్పిన ఒక కారు రోడ్డుపై నడుచుకుంటున్న మూడు మందిని ఢీకొట్టి తీవ్రంగా గాయపడేలా చేసింది. ఘటన అనంతరం స్థానికులు వెంటనే గాయపడిన వారిని సదర్ ఆసుపత్రికి తరలించి... బిహార్‌లో ఓటింగ్ ముగిసిన తర్వాత రైళ్లలో భారీ రద్దీ
పాట్నా/ సమస్తిపూర్ నవంబర్ 10:
బిహార్‌లో ఓటింగ్ (వోటింగ్) ప్రక్రియ ముగిసిన వెంటనే రాష్ట్రం వెలుపలకి ప్రయాణించే వారి సంఖ్య పెరగడంతో రైళ్లలో అపారమైన రద్దీ నమోదైంది. ప్రయాణికుల పెరుగుతున్న ఒత్తిడిని నియంత్రించేందుకు సమస్తీపూర్ రైల్వే మండల పరిపాలన ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో, మండలంలోని విభిన్న స్టేషన్ల నుండి ఈ రోజు నుంచి... కంచి పీఠమే కుటుంబ వ్యవస్థ బలం – శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ విభాగం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గుంటూరు నవంబర్ 09 (ప్రజా మంటలు):
మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా నిలవడానికి కంచి పీఠం వంటి ఆధ్యాత్మిక సంస్థలు కీలక పాత్ర పోషించాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం గుంటూరు సమీపంలోని శంకర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా... 25వ వార్డులో అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 9 (ప్రజా మంటలు)పట్టణ 25వ వార్డులో 10 లక్షల నిధులతో చేపట్టిన సీసీ డ్రైన్ అభివృద్ధి పనులని పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
పనులు నాణ్యతలో చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి గారు జగిత్యాల కు 62.50 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది అని,అతిత్వరలో పనులు టెండర్... 