అందెశ్రీ మరణానికి జగిత్యాల ప్రముఖుల నివాళి
జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమంలోని శక్తివంతమైన స్వరమైన డా. అందెశ్రీ గారి అకాల మరణం పట్ల తెలంగాణ నాయకులు, ప్రజాప్రతినిధులు గాఢంగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
“తెలంగాణ సాహిత్య లోకానికి అందెశ్రీ అకాల మరణం తీరని లోటు. ఎంతోకాలంగా తెలంగాణ అభ్యున్నతికోసం సాహిత్య కృషి చేసిన ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు ఎంతో నష్టం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని మాజీ మంత్రి రాజేశం గౌడ్ అన్నారు.
ఉద్యమానికి అండగా నిలిచి, ప్రజలతో మమేకమైన మనిషి
అందెశ్రీ కవిగా,గాయకునిగా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచి, ఉద్యమసారథి లా ఎంతో కృషి చేసి, ప్రజలతో మమేకమై మెలిగిన మంచి మనిషని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన సంతాపం సందేశంలో పేర్కొన్నారు. ఆయన అకాల మృతి, తెలంగాణ సాహితీ లోకానికి కాకుండా, సామాన్య ప్రజలకు తీరని లోటని, ఆయన లేని లోటు కుటుంబానికి తీర్చలేనిదంటూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
తెలంగాణ సాహిత్య వర్గాలు తీవ్ర సంతాపం
తెలంగాణ బీసీ కమిషన్ తొలి చైర్మన్ బి ఎస్ రాములు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తెలంగాణలో ఈశతబ్దపు ప్రజాకవులలో అగ్రగణ్యుడని, ఆయన ఆలోచనలు, ఆచరణ తెలంగాణ సాహిత్యానికి చేసిన సేవలు మరువలేనివి అంటూ, ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.
కరీంనగర్ శాసనమండలి సభ్యులు ఎల్. రమణ గారు స్పందిస్తూ…“డాక్టర్ అందెశ్రీ గారి మృతి తెలంగాణకు తీరని లోటు. ఆయన రచనలు, ఆయన గళం రాష్ట్ర ఉద్యమానికి ప్రాణం పోశాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ కూడా శోకాన్ని వ్యక్తం చేస్తూ…
“తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప కళాకారుడు అందెశ్రీ ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరం. ఉద్యమ సమయంలో ఆయన గళం ప్రజల్లో ఉత్సాహం నింపింది. ఆ స్వరం ఎప్పటికీ మరువలేము” అని అన్నారు.
తెలంగాణలోని ప్రతిభావంతులైన కళాకారులలో అందెశ్రీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన రచనలు, ఆయన స్వరం, రాష్ట్ర ఉద్యమ జ్ఞాపకాలలో శాశ్వతంగా నిలిచిపోతాయని నేతలు పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అసోం లోని #Draft: Add Your Titleఉదాల్గురిలో 10,000 మందికి పైగా సంతాల్ విద్యార్థుల ర్యాలీ
గౌహతి అస్సాం నవంబర్ 10:
ఉదాల్గురిలో సోమవారం భారీ ఎత్తున జరిగిన సంతాల్ సమాజ ర్యాలీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఆల్ సంతాల్ స్టూడెంట్స్ యూనియన్ (ASSU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ నిరసన ప్రదర్శనలో 10,000 మందికి పైగా ప్రజలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
మోన్పూర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరం... ANM ట్రైనింగ్ స్కూల్‌లో ట్రైనర్ యువతి ఆత్మహత్య?
పాట్నాలో 25 ఏళ్ల టీచర్ అనుమానాస్పద మృతి
పట్నా నవంబర్ 10:
పట్నాలోని ప్రైవేట్ ANM ట్రైనింగ్ స్కూల్‌లో సోమవారం ఉదయం ఓ యువతి టీచర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఫస్ట్ ఫ్లోర్ గదిలో ఆమె మృతదేహం ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో లభించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.... హార్ట్ స్ట్రోక్‌తో బాత్ రూంలోనే అందెశ్రీ మృతి?
హార్ట్ స్ట్రోక్‌తో గాంధీ ఆసుపత్రిలో అందెశ్రీ మృతి
హైదరాబాద్, నవంబర్ 10:హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో అందెశ్రీ (వయసు సుమారు 45 సంవత్సరాలు) హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందారు.
ఉదయం 7:20 గంటలకు కుటుంబ సభ్యులు అందెశ్రీని గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు, కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.... అందెశ్రీ మరణానికి జగిత్యాల ప్రముఖుల నివాళి
జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమంలోని శక్తివంతమైన స్వరమైన డా. అందెశ్రీ గారి అకాల మరణం పట్ల తెలంగాణ నాయకులు, ప్రజాప్రతినిధులు గాఢంగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
“తెలంగాణ సాహిత్య లోకానికి అందెశ్రీ అకాల మరణం తీరని లోటు.... ఎమ్మెల్యేను కలిసి కొత్తచెరువు ఒకే కులానికి ఇవ్వద్దని అల్లిపూర్ ప్రజల వినతి
జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాయికల్ మండలం ఆలూరు గ్రామ ప్రజలు కలిసి గ్రామ సమస్యలను వివరించారు. గ్రామంలో ఉన్న కొత్తచెరువును ఒకే కులానికి, ఒకే కుల సొసైటీకి అప్పగించాలనే ప్రయత్నం జరుగుతోందని ప్రజలు ఎమ్మెల్యేకు తెలియజేశారు.
గ్రామపంచాయతి ఏర్పడినప్పటి నుండి... జగిత్యాలలో దివ్యాంగుల కోసం జైపూర్ ఫుట్ ఉచిత కొలతల శిబిరం –పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) నవంబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల ఐఎంఏ భవన్‌లో కాలు లేని దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాలు (Jaipur Foot) కొలతల శిబిరం నిర్వహించబడింది. ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల, జగిత్యాల క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో… రోటరీ క్లబ్ నిజామాబాద్ సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు... టీడీపీ నేత గోడౌన్ లో పట్టుబడ్డ టన్నుల కొద్దీ గోమాంసం –
గోడౌన్‌లో టన్నుల కొద్దీ గోమాంసం
ధార్మిక సంఘాల ఆగ్రహం
విశాఖపట్నం, నవంబర్ 10 (ప్రజా మంటలు):
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం పాలనలో మరో సంచలన ఘటన వెలుగు చూసింది. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి నిర్వహిస్తున్న కోల్డ్ స్టోరేజీలో టన్నుల కొద్దీ గోమాంసం లభించడం రాష్ట్రవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది.
వివరాల ప్రకారం,బాపట్ల... "భారాస నుంచి నన్ను అవమానకరంగా పంపారు… ఆడపిల్ల రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా" — కవిత
హనుమకొండ, బాలసముద్రం నవంబర్ 10 (ప్రజా మంటలు)"భారాస నుంచి నన్ను అవమానకరంగా బయటకు పంపారు. నేను తప్పు చేసి ఉంటే కనీసం ఒక నోటీసైనా ఇవ్వాల్సింది. ఇప్పుడు భారాసతో నాకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదు," అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కళ్వకుంట్ల కవిత అన్నారు.
హనుమకొండలోని బాలసముద్రం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్... అందెశ్రీ మృతదేహం వినోబా నగర్‌కి చేరింది –లాలపేట ఇండోర్ స్టేడియంలోప్రజల దర్శనార్థం ఏర్పాట్లు
సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజా మంటలు):
ప్రసిద్ధ కళాకారుడు అందెశ్రీ మృతదేహం ఈరోజు లాలాపేట్‌లోని వినోబా నగర్‌లోని వారి నివాసానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో విచారంతో తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు.
అందెశ్రీ మృతదేహం ఈరోజు సాయంత్రం వరకు వినోబా నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో దర్శనార్థం ఉంచనున్నట్లు... Telangana’s Renowned Poet Ande Sri Passes Away
By Ch V Prabhakar Rao.
Hyderabad November 10 (Praja Mantalu):
A tragic incident shocked Telangana on Monday. Celebrated poet, lyricist and Telangana movement icon Dr. Ande Sri (64) passed away. On Monday early mirning , Ande Sri suddenly collapsed at... ప్రముఖ గేయ రచయిత అందెశ్రీ (64) కన్నుమూత
సికింద్రాబాద్ నవంబర్ 10 (ప్రజా మంటలు):ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ, గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ, ఉదయం 7.25 ప్రాంతంలో మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.ప్రపంచమంతా తిరిగి నదుల పుట్టుకపై దీర్ఘ కావ్యం రాసారు. తెలంగ ఉద్యమం, చరిత్రపై ఈయన రాసిన 100 పేజీల గ్రంథం అనేక ప్రశంసలను అందుకొంది .1961 జూలై... తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీ కన్నుమూత – సాహిత్య లోకానికి, తెలంగాణ భావజాలానికి తీరని లోటు
హైదరాబాద్ నవంబర్ 10 (ప్రజా మంటలు):: తెలంగాణలో విషాదం ఏర్పడింది. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గీతాల సృష్టికర్త డా. అందెశ్రీ (64) ఇక లేరు. ఆదివారం రాత్రి ఇంట్లోనే ఒక్కసారిగా తీవ్రమైన అస్వస్థతకు గురై కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ... 