100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? MLA సంజయ్ కుమార్ ప్రశ్న
రాష్ట్రంలో అత్యధిక నిధులు నా నియోజకవర్గానికి వచ్చాయ్
ప్రజా జీవితం లో ఉన్న వారిపై బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది : సంజయ్
జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు):
100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బాగా శ్రావణులు కూడా ఆ వ్యాపారితో సంబంధాలు కలిగి ఉన్నారు.వారందరికీ లేనిది నాకు ఉన్న ప్రత్యేకత ఏమిటో వారే చెప్పాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశ్నించారు.
మొదటిసారిగా, మొన్నటివరకు BRS కార్యాలయంగా ఉన్న జగిత్యాల మోతే రోడ్డు పార్టీ కార్యాలయంను, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి, అందులో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రజా జీవితం లో బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది.నిరాధార ఆరోపణలు చేయటం మానుకోవాలి.73ఏండ్ల క్రితం జరిగిన విషయాన్ని 7 ఏండ్ల క్రితం ఎమ్మెల్యే అయిన నాపై మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రావణి గారు ఆరోపణలు అర్థరహితం ఆది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.

జగిత్యాలలో నాకు అన్ని వర్గాల స్నేహితులు ఉన్నారు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు.ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతం కావడంలో నా మద్దతు ఎప్పటికీ ఉండదు.
నాపై ఆరోపణలు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ వివాద కాంప్లెక్స్ లో వ్యాపార ప్రారంబానీకి వెళ్లారు. అప్పుడు వారికి ఈ విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఎంపీ ఎన్నికల ఓట్ల సందర్భంగా, వ్యాపారవేత్త ఇంటికి వెళ్ళి అల్పాహారం చేశారు.అప్పుడు కూడా ఆయనకు ఈ విషయం తెలుసు అనుకుంటాను. నా పై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నా...ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేయాలీ.చట్ట వ్యతిరేక విధానాలకు మద్దతు నాకు నా కుటుంబానికి అవసరం లేదు ఉండదని సంజయ్ తెలిపారు.
నా జీవితం తెరచిన పుస్తకం జగిత్యాల ప్రజలందరికీ తెలుసు
బురద జల్లే ప్రయత్నం చేయడం వల్లనే బురద కడుక్కోవడానికి ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.ఏ విషయం లో నైనా మీడియా ప్రతినిధులకు వివరణ ఇస్తా అసత్య ప్రచారాలు,వార్తలు రాయవద్దని కోరుతున్న.. అన్ని వేళలా ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులు అండగా ఉన్నారని తెలిపారు.
రాష్ట్రంలో అత్యధిక నిధులు నా నియోజకవర్గానికి వచ్చాయ్
అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద బ్యాంక్ లోన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సేకరించి జగిత్యాల కు అత్యధికంగా 50 కోట్లు నిధులు మంజూరు చేయగా,ఆర్మూరు 18.70 కోట్లు, బోధన్ 18.70 కోట్లు నిజామాబాద్ కు 32 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని సంజయ్ తెలిపారు.
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రాష్ట్రాలకు అప్పుగా వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 ఏండ్ల లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రాష్ట్రం జగిత్యాల కు 50 కోట్లు,రాష్ట్ర ప్రభుత్వం నిధులు 12 కోట్లు మొత్తం గా 62.50 లక్షల కోట్లు,రాయికల్ పట్టణ అభివృద్ధి కి 15 కోట్లు మంజూరు చేయటం జరిగిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని చెప్పడం వారి అవగాహన లోపం.జగిత్యాల అభివృద్ది కి అందరితో కలిసి పనిచేస్తా...
ప్రజల డబ్బు ప్రజలకు అందించే విదంగా కృషి చేయటం ప్రజా ప్రతినిధులు బాధ్యత
నిధులు తెస్తే ఓర్వలేకనే జగిత్యాల అభివృద్దికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు - సంజయ్
కేంద్రీయ విద్యాలయం.. జగిత్యాల తిప్పన్న పెట్ బ్లాక్ స్పాట్ రోడ్డు, రోళ్ళవాగు పర్యావరణ అనుమతులు పరిష్కారం తదితర ప్రతిపాదనలు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం నా వంతు బాధ్యత..
కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యం...
రాజకీయాల్లో విలువలు ప్రదానం...
నష్ట పరిహారం చెల్లించి యావర్ రోడ్డు విస్తరణ చేయటం నా ప్రధాన అతి ముఖ్యమైన లక్ష్యం...
జగిత్యాల ప్రజలు చైతన్య వంతులు వారికి అన్ని తెలుసునని అన్నారు.
138 సర్వే నంబర్ భూమిలో ఉన్న కృష్ణ పెట్రోల్ బంక్,బాలకృష్ణ బార్ స్వాగత్ బార్ లు ఇతర వ్యాపార సముదాయాలు జగిత్యాల మున్సిపల్ భూమికి సంబంధించి చట్ట విరుద్ధం గా ఉన్నట్లయితే అట్టి సముదాయాల పై తగుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాని , ఆమేరకు లేఖ రాసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గోలి శ్రీనివాస్, బాలే శంకర్, క్యాదసు నాగయ్యా చెట్పల్లి సుధాకర్, ముస్కు నారాయణ రెడ్డి, కుసరి అనిల్, బద్దం జగన్ పంబల రాము, కాంగ్రెస్ నాయకులు దుమాల రాజ్ కుమార్, శ్రీనివాస్, తిరుమలయ్య, బోడ్ల జగదీష్, అహమ్మద్, కోరే గంగమల్లు, రామ్మోహన్ రావు, గుర్రం రాము క్యాదసు నవీన్, కూతురు శేఖర్ అరుముల్ల పవన్, దాసరి ప్రవీణ్, పోతునుక మహేష్, లవంగ రాజేందర్, రామకృష్ణ రెడ్డి, శరత్ రావు, రంగు మహేష్ శ్రీరామ్ భిక్షపతి, ప్రవీణ్ రావు, గౌస్, వంశీబాబు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం
ఖమ్మం, మార్చ్ 9 (ప్రజా మంటలు):
ఖమ్మం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంబేద్కర్ భవన్లో వెలుగుమట్ల బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడిన ఆమె, తెలంగాణ జాగృతి, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ... ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిశీలించాలి
జగిత్యాల మార్చ్ 9(ప్రజా మంటలు)ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు.
అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బిఎస్ లత మాట్లాడుతూ... ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా ఖమెనీ నియామకం –
ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా కామెనీ నియామకం
మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో అత్యున్నత మత-రాజకీయ అధికారం అయిన సుప్రీం లీడర్ పదవికి మోజ్తభా కామెనీను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.మోజ్తభా కామెనీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా... ఖమ్మంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ – మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టుపై వివాదం
ఖమ్మం, మార్చి 09 (ప్రజా మంటలు):
వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కవితతో... సైబర్ మోసలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి:సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ
జగిత్యాల మార్చ్ 9(ప్రజా మంటలు)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సింగ్ విద్యార్థినులకు సైబర్ నేరాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళా నర్సింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ ముఖ్య అతిథిగా... వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోంది: కల్వకుంట్ల కవిత
ఖమ్మం, మార్చ్ 09 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయల్దేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.పిల్లల పరీక్షల... సీనియర్ సిటిజెన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సందర్భంగా సన్మానాలు
జగిత్యాల మార్చి 8:తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆదివారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అస్సోసియేషన్ సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లాలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలను సన్మానించారు.
ధర్మపురి... హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు – సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 08 (ప్రజా మంటలు):
దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలు భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్లో జరిగిన... మెట్రో ఛానల్ వద్ద మమతా బెనర్జీ ధర్నా – సింగూర్ ఉద్యమం జ్ఞాపకాలతో ఎన్నికల సమరానికి సంకేతం
బెంగాల్ రాజకీయాలపై ప్రత్యేక కథనం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి Mamata Banerjee మరోసారి కోల్‌కతాలోని Metro Channel వద్ద ధర్నా చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా రాజకీయ పార్టీలు నిరసనలు నిర్వహించే ప్రదేశంగా ఈ స్థలం ప్రసిద్ధి పొందింది. కానీ మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.... రేచపల్లి లో బావిలో బాలుడి మృతదేహం
జగిత్యాల రూరల్, మార్చ్ 08 (ప్రజా మంటలు):
రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ (10) సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు.పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ... జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – ఎంపీ అరవింద్ విమర్శలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కౌంటర్
జగిత్యాల మార్చ్ 07 (ప్రజా మంటలు):
జగిత్యాల అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయం విషయంలో కాలయాపన చేస్తున్నారని ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా స్పందించారు.జగిత్యాల పట్టణంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో... హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ మార్చ్ 07 (ప్రజా మంటలు):
హింస ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యం కాదని, ప్రజాస్వామ్య మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు.లొంగిపోయిన మావోయిస్టులకు ప్రాణరక్షణతో పాటు ఆర్థిక సహాయం, పునరావాసం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర... 