బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఘనంగా గణేశ చరపతిష్ట

On
బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో ఘనంగా గణేశ చరపతిష్ట

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల సెప్టెంబర్ 7 (ప్రజా మంటలు) : 

జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి చర ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

అంతకముందు విగ్రహ దాత జవ్వాజి వెంకట నాగరాజు దంపతులు స్వగృహంలో పూజ నిర్వహించి అఖిల బ్రాహ్మణ సేవా సంఘం వారిచే హరిహరాలయం లో శోభాయాత్రగా ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు.

సాయంత్రం శమంతకో పాఖ్యానం ను నంబి నరసింహాచారి (చిన్నస్వామి) ప్రవచనం చేశారు.

భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.

Tags