ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ.. ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు బ్రిటిష్ పౌరుడు
సికింద్రాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):
130 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లో మరణించిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఇంగ్లండ్‌కు చెందిన రాబిన్ డిక్సన్ హైదరాబాద్‌కు వచ్చారు. దాదాపు 19 ఏళ్ల అన్వేషణ ఎట్టకేలకు ఫలించడంతో, పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో నివాళులర్పించారు.
రాబిన్ డిక్సన్ తన కుటుంబ పాత దస్త్రాల ద్వారా తన ముత్తాత చార్లెస్ విల్సన్ బ్రిటిష్ ఇండియాలో మరణించారని తెలుసుకున్నారు. 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరిన చార్లెస్ విల్సన్ బెంగళూరు, మద్రాస్ ప్రాంతాల్లో సేవలందించి, అనంతరం సికింద్రాబాద్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌గా పనిచేశారు. 1906 ఆగస్టు 4న అనారోగ్యంతో తిరుమలగిరి ఆసుపత్రిలో కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 48 సంవత్సరాలు.
తన ముత్తాత సమాధి స్థలాన్ని గుర్తించేందుకు రాబిన్ దాదాపు రెండు దశాబ్దాల పాటు బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్‌లలో అన్వేషించారు. స్థానిక జర్నలిస్ట్ రవిరెడ్డి సహకారంతో, ఎనిమిది నెలల క్రితం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ‘సెమెట్రీ-12’లో సమాధిని గుర్తించారు.
ఈ విషయం తెలిసిన వెంటనే రాబిన్ తన భార్య లిన్‌తో కలిసి ఇంగ్లండ్ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చారు. సమాధిపై తెల్ల గులాబీలు ఉంచి కన్నీటి పర్యంతమయ్యారు. “ఈ క్షణం కోసమే ఇన్నేళ్లుగా ఎదురుచూశాను” అంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.
ప్రేమ, అనుబంధాలకు సరిహద్దులు ఉండవన్న మాటకు ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెట్పల్లిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సంజయ్
మెట్పల్లి, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెట్పల్లిలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. సంజయ్, న్యాయవాది తుల రాజేందర్ కుమార్, తులగంగవ్వ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం... అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్‌ను... రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్‌కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్... శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు
జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు... విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్
వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన... ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర
గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం... వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా... మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్ రమేష్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
టీఎన్జీవో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్ పల్లాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ... ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000... బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు
ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది.
ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల... భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు
గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో... 