భీమదేవరపల్లి ఎపిఎం, సిఏ లపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
సంఘాలలో అక్రమాలు జరుగుతున్న స్పందించని ఏపిఎం - పచ్చునూరి లత
భీమదేవరపల్లి జూలై 02 (ప్రజామంటలు) :
భీమదేవరపల్లి మహిళా సంఘంలో అక్రమాలకు పాల్పడుతున్న ఏపీఎం, సీఏలు చేస్తున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పచ్చునూరి లతా రాజేష్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దంపతులు ఇద్దరు మీడియా మాట్లాడుతూ, స్థానికంగా ఉండే మహిళలకు మహిళా సంఘంలో అవకాశం కల్పించకుండా, ఊరితో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి, ఊర్లో ఉన్న వాళ్ళని కాదని, బంధుప్రీతితో మహిళా సంఘ గ్రూపులలో కొనసాగిస్తున్నారని అన్నారు.
దీనిపై పూర్తి స్దాయిలో సమగ్ర విచారణ జరిపించాలని, మహిళా సంఘంలో జరుగుతున్న అవకతవకలని ఏరి వేయాలని అన్నారు. సి ఏ తమను బూతు మాటలు మాట్లాడుతూ, మానసికంగా అవమాన పరుస్తున్నారని ఆరోపించారు. ఏపీఎం, సీఏ, లీడర్ ముగ్గురు కుమ్మక్కై నానా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. మండల కేంద్రంలోని మహిళా సంఘాల అవినీతిని అరికట్టి తగిన న్యాయం చేకూర్చాలని కలెక్టర్ కు విన్నవించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
