: “పాము పగ పట్టిందా?” — గొల్లపల్లి మండలంలో నెల రోజుల్లోనే ఏడుసార్లు పాము కాటు వేసిన యువకుడు!
(అంకం భూమయ్య)
గొల్లపల్లి, నవంబర్ 04 (ప్రజా మంటలు):
పల్లెల్లో పెద్దలు తరచుగా “పాము పగ పడుతది” అని చెప్పే మాటను చాలామంది మూఢనమ్మకం అంటారు. కానీ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆ మాటలో నిజం ఉందేమో అనే సందేహం కలిగిస్తోంది.
నెల రోజుల్లోనే 7 సార్లు పాము కాటు!
బొంకూరు గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడు, వృత్తిరీత్యా కూలీ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. సుమారు నెల క్రితం తన ఇంటి బాత్రూమ్ వద్ద విషపాము కాటు వేయడంతో చికిత్స పొందాడు. కుటుంబసభ్యులు ప్రాణాపాయం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.
కానీ ఆ ఊపిరి ఎక్కువ రోజులు నిలవలేదు. అదే యువకుడిని కొద్ది రోజుల వ్యవధిలో మరోసారి పాము కాటేసింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తరువాత మళ్లీ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే ఇదే క్రమం వరుసగా కొనసాగి, నెల రోజుల్లో ఏకంగా 7 సార్లు పాము కాటు వేయడంతో గ్రామం మొత్తం షాక్‌కు గురైంది.
గ్రామంలో చర్చగా మారిన ఘటన
ఘటనపై గ్రామస్తుల మధ్య అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు “పాము పగ పట్టింది” అని చెప్పుకుంటుండగా, మరికొందరు దీన్ని సహజ సంఘటనగా భావిస్తున్నారు.
యువకుని కుటుంబ సభ్యులు మాత్రం — “ఆ పాము ఇప్పటికీ కనిపించలేదు, కానీ భయాందోళనలో ఉన్నాం” అని తెలిపారు.
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో, ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కోయంబత్తూర్ గ్యాంగ్ రేప్ కేసు — ముగ్గురు నిందితులు అరెస్ట్
కోయంబత్తూర్, తమిళనాడు నవంబర్ 04:
కోయంబత్తూర్‌లో జరిగిన ఘోరమైన గ్యాంగ్ రేప్ హత్యాయత్నం కేసు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. 20 ఏళ్ల పీజీ విద్యార్థిని తన బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి కారులో వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు బలవంతంగా అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటన విమానాశ్రయం సమీపంలోని బ్రిందావన్‌నగర్ వద్ద చోటుచేసుకుంది.... ఏషియా కప్ వివాదం: సూర్యకుమార్ యాదవ్, హారిస్ రౌఫ్ లపై క్రమశిక్షణ
సూర్యకుమార్ యాదవ్‌కు 30% మ్యాచ్ ఫీ జరిమానా – హారిస్ రౌఫ్‌కు రెండు మ్యాచ్‌ల నిషేధం
దుబాయ్, నవంబర్ 4 (ప్రజా మంటలు):
ఏషియా కప్ సందర్భంగా జరిగిన ఉద్రిక్త ఘటనలపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు పాకిస్తాన్ వేగవంతమైన బౌలర్ హారిస్ రౌఫ్ పై ఐసీసీ (ICC) క్రమశిక్షణా చర్యలు... దుబాయ్ సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు
కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరిన TPCC NRI సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా
హైదరాబాద్, నవంబర్ 4 (ప్రజా మంటలు):
దుబాయ్‌లో సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణకు చెందిన యువకుడు అనిల్ (s/o బాలయ్య, చిర్లవంచ గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా) కేసు విషయాన్ని, TPCC... “సామాజిక తెలంగాణ సాధనయే మా లక్ష్యం” :కవిత
జాగృతి జనం బాట ఆదిలాబాద్‌లో కల్వకుంట్ల కవిత
నిరుద్యోగుల సమస్యలపై మండిపాటు – జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి
తలమడుగులో రైతు కుటుంబాన్ని పరామర్శించిన కవిత
ఆదిలాబాద్ నవంబర్ 4 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్‌లో “జాగృతి జనం బాట” కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునే భాగంగా 33... జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు పెండింగ్ టాక్స్ వసూలు
– పత్రాలు లేని వాహనాలకు హెచ్చరిక
జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారులు వాహనాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలను మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (MVI) షేక్ రియాజ్ స్వయంగా పర్యవేక్షించారు.
తనిఖీలలో భాగంగా పలు వాహనాల పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలించారు.... తలసాని తొందరపడి రాజీనామా చేయొద్దు.. చేస్తే గెలిచే అవకాశం లేదు
* పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమా విమర్శ
సికింద్రాబాద్, నవంబర్ 04 (ప్రజామంటలు):
మాజీ మంత్రి, సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమా సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన పదేళ్ల బిఆర్ఎస్... పటేల్ లేకుంటే హైదరాబాద్ పాకిస్థాన్ ఆధీనంలో ఉండేది.?
*వల్లభాయ్ పటేల్ చొరవతో దేశంలోని 565 సంస్థానాలు ఇండియాలో విలీనం *యువత సమైక్య భారత్ నిర్మాణానికి ముందుకు రావాలి *రాజ్యసభ సభ్యులు డా.కే.లక్ష్మన్ *సర్దార్@150 ఏక్తా మార్చ్ లో పాల్గొనాలని పిలుపు
సికింద్రాబాద్, నవంబర్ 04, (ప్రజామంటలు) :
సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకోకపోయి ఉన్నట్లయితే హైదరాబాద్ ప్రాంతం ఇస్లాం దేశంగా, లేదా పాకిస్థాన్... శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినికి రెండు బంగారు పతకాలు
- అభినందించిన కళాశాల యాజమాన్యం...
సికింద్రాబాద్, నవంబర్ 04 (ప్రజా మంటలు) :
పట్టుదలతో చదివితే విద్యార్థినులు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ కె. రాధా కిషన్ రావు అన్నారు. వట్టినాగులపల్లిలోని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల, పి. హేమశ్రీ అసాధారణ విజయాన్ని గర్వంగా జరుపుకుంది. జవహర్లాల్... వై.ఎస్.ఆర్ ఆశయాలకు విరుద్ధంగా రేవంత్ పాలన – దావ వసంత సురేష్
ఫీజు రియాంబర్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వై.ఎస్.ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా ఉందని జిల్లా పరిషత్ తొలి ఛైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ విమర్శించారు. ఫీజు రియాంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన... ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారమే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి – పిఆర్టియుటిఎస్, జగిత్యాల జిల్లా శాఖ
జగిత్యాల, నవంబర్ 04 (ప్రజా మంటలు):
ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 25 (తేదీ 12.08.2021) ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాట్లు జరగాలని పిఆర్టియుటిఎస్ (PRTUTS) జగిత్యాల జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
జిల్లా శాఖ అధ్యక్షుడు బోయినపల్లి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్నాథ్ రెడ్డి నేతృత్వంలో జిల్లా విద్యా... బహరేన్లో గల్ఫ్ కార్మికుడి మృతదేహం ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు
మెటుపల్లి, నవంబర్ 04 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్లో దుర్మరణం చెందగా, ఆయన మృతదేహం ఇప్పటివరకు అక్కడి అతిశీతల శవాగారంలో నిల్వ ఉంది. సాంకేతిక కారణాల వల్ల మృతదేహాన్ని భారత్‌కు తరలించడం సాధ్యం కాదని బహరేన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పష్టంచేసింది.... వర్షకొండ–ఇబ్రహీంపట్నం రోడ్డుపై శ్రమదానంతో గుంతలు పూడ్చిన గ్రామ నాయకులు
ఇబ్రహీంపట్నం నవంబర్ 4 (ప్రజా మంటలు: దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ–ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ రోడ్డుపై ప్రతిరోజు ప్రయాణించే వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతుండడంతో, స్థానిక నాయకులు ముందడుగు వేసి శ్రమదానానికి దిగారు.
అధికారులు పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు లేకపోవడంతో, వర్షకొండ... 