వై.ఎస్.ఆర్ ఆశయాలకు విరుద్ధంగా రేవంత్ పాలన – దావ వసంత సురేష్

On
వై.ఎస్.ఆర్ ఆశయాలకు విరుద్ధంగా రేవంత్ పాలన – దావ వసంత సురేష్

ఫీజు రియాంబర్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్

జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వై.ఎస్.ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా ఉందని జిల్లా పరిషత్ తొలి ఛైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ విమర్శించారు. ఫీజు రియాంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన నిరవధిక బంద్‌కు ఆమె సంఘీభావం తెలిపారు.

అధ్యాపకులు, యాజమాన్యాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వసంత సురేష్ మాట్లాడుతూ“విద్యార్థులు, యాజమాన్యాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో విద్య వ్యవస్థ కూలిపోతుంది. ఫీజు రియాంబర్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి” అని డిమాండ్ చేశారు.
దావ వసంత సురేష్ మాట్లాడుతూ,“ఇప్పటికే రూ.1200 కోట్ల టోకెన్ నిధులు ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. జగన్ ప్రభుత్వంలో లేదా గత కేసీఆర్ పాలనలో విద్యార్థులు ఇంత దయనీయ స్థితిలో లేరు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు ఆడటం దుర్మార్గం” అని అన్నారు.»

“జిల్లాలో ₹70–100 కోట్ల వరకు, రాష్ట్రవ్యాప్తంగా ₹10,000 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. కనీసం టోకెన్ నిధులైనా విడుదల చేసి కళాశాలలకు అండగా నిలవాలి. లేకపోతే, కళాశాలలు మూతపడే పరిస్థితి వస్తుంది” అని హెచ్చరించారు.IMG-20251104-WA0044

“అణచివేతలతో, తనిఖీలతో భయపెట్టడం కాదు; సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి. లేకపోతే అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి” అని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలం ప్రవీణ్, చింతల గంగాధర్, గంగిపెల్లి వేణు, పెండెం గంగాధర్, గాజుల శ్రీనివాస్, పట్నం అనురాధ, నీలి ప్రతాప్, ప్రణయ్ తో పాటు డిగ్రీ, పీజీ కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

More News...

ఈశాన్య రాజకీయాల్లో కొత్త మార్పు సంకేతం — హిమంత బిశ్వ శర్మకు సవాల్‌ విసిరిన కొత్త మైత్రి కూటమి!

ఈశాన్య రాజకీయాల్లో కొత్త మార్పు సంకేతం — హిమంత బిశ్వ శర్మకు సవాల్‌ విసిరిన కొత్త మైత్రి కూటమి! కొత్త రాజకీయ కూటమి అవతరించిన ఈశాన్య భారతదేశంలో, NEDA భవిష్యత్తుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని కూటమికి ఇది పెద్ద సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. న్యూఢిల్లీ, నవంబర్‌ 04: ఈశాన్య భారత రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని **నార్త్...
Read More...

కోయంబత్తూర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు — ముగ్గురు నిందితులు అరెస్ట్‌

కోయంబత్తూర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు — ముగ్గురు నిందితులు అరెస్ట్‌ కోయంబత్తూర్‌, తమిళనాడు నవంబర్‌ 04:  కోయంబత్తూర్‌లో జరిగిన ఘోరమైన గ్యాంగ్‌ రేప్‌ హత్యాయత్నం కేసు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. 20 ఏళ్ల పీజీ విద్యార్థిని తన బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి కారులో వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు బలవంతంగా అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటన విమానాశ్రయం సమీపంలోని బ్రిందావన్‌నగర్‌ వద్ద చోటుచేసుకుంది....
Read More...
National  Sports  International   State News 

ఏషియా కప్ వివాదం: సూర్యకుమార్ యాదవ్‌, హారిస్ రౌఫ్ లపై క్రమశిక్షణ

ఏషియా కప్ వివాదం: సూర్యకుమార్ యాదవ్‌, హారిస్ రౌఫ్ లపై క్రమశిక్షణ   సూర్యకుమార్ యాదవ్‌కు 30% మ్యాచ్ ఫీ జరిమానా – హారిస్ రౌఫ్‌కు రెండు మ్యాచ్‌ల నిషేధం దుబాయ్, నవంబర్ 4 (ప్రజా మంటలు): ఏషియా కప్ సందర్భంగా జరిగిన ఉద్రిక్త ఘటనలపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు పాకిస్తాన్ వేగవంతమైన బౌలర్ హారిస్ రౌఫ్ పై ఐసీసీ (ICC) క్రమశిక్షణా చర్యలు...
Read More...

దుబాయ్ సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు

దుబాయ్ సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరిన TPCC NRI సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా హైదరాబాద్, నవంబర్ 4 (ప్రజా మంటలు): దుబాయ్‌లో సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణకు చెందిన యువకుడు అనిల్ (s/o బాలయ్య, చిర్లవంచ గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా) కేసు విషయాన్ని, TPCC...
Read More...

“సామాజిక తెలంగాణ సాధనయే మా లక్ష్యం” :కవిత

“సామాజిక తెలంగాణ సాధనయే మా లక్ష్యం” :కవిత జాగృతి జనం బాట ఆదిలాబాద్‌లో కల్వకుంట్ల కవిత నిరుద్యోగుల సమస్యలపై మండిపాటు – జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి తలమడుగులో రైతు కుటుంబాన్ని పరామర్శించిన కవిత ఆదిలాబాద్ నవంబర్ 4 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్‌లో “జాగృతి జనం బాట” కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునే భాగంగా 33...
Read More...

జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు పెండింగ్ టాక్స్ వసూలు

జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు పెండింగ్ టాక్స్ వసూలు – పత్రాలు లేని వాహనాలకు హెచ్చరిక జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారులు వాహనాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలను మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI) షేక్ రియాజ్ స్వయంగా పర్యవేక్షించారు. తనిఖీలలో భాగంగా పలు వాహనాల పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలించారు....
Read More...
Local News  State News 

తలసాని తొందరపడి రాజీనామా చేయొద్దు.. చేస్తే గెలిచే అవకాశం లేదు

తలసాని తొందరపడి రాజీనామా చేయొద్దు.. చేస్తే గెలిచే అవకాశం లేదు     * పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమా విమర్శ సికింద్రాబాద్, నవంబర్ 04 (ప్రజామంటలు): మాజీ మంత్రి, సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమా సంచలన వ్యాఖ్యలు చేశారు.  గడిచిన పదేళ్ల బిఆర్ఎస్...
Read More...
Local News  State News 

పటేల్ లేకుంటే హైదరాబాద్ పాకిస్థాన్ ఆధీనంలో ఉండేది.?

పటేల్ లేకుంటే హైదరాబాద్ పాకిస్థాన్ ఆధీనంలో ఉండేది.?   *వల్లభాయ్ పటేల్ చొరవతో దేశంలోని 565 సంస్థానాలు ఇండియాలో విలీనం    *యువత సమైక్య భారత్‌ నిర్మాణానికి ముందుకు రావాలి    *రాజ్యసభ సభ్యులు డా.కే.లక్ష్మన్    *సర్దార్@150 ఏక్తా మార్చ్ లో పాల్గొనాలని పిలుపు సికింద్రాబాద్, నవంబర్ 04, (ప్రజామంటలు) : సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకోకపోయి ఉన్నట్లయితే హైదరాబాద్ ప్రాంతం ఇస్లాం దేశంగా, లేదా పాకిస్థాన్...
Read More...
Local News 

శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినికి రెండు బంగారు పతకాలు

శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినికి రెండు బంగారు పతకాలు - అభినందించిన కళాశాల యాజమాన్యం...  సికింద్రాబాద్,  నవంబర్ 04 (ప్రజా మంటలు) :  పట్టుదలతో చదివితే విద్యార్థినులు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ కె. రాధా కిషన్ రావు అన్నారు. వట్టినాగులపల్లిలోని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల, పి. హేమశ్రీ అసాధారణ విజయాన్ని గర్వంగా జరుపుకుంది. జవహర్‌లాల్...
Read More...

వై.ఎస్.ఆర్ ఆశయాలకు విరుద్ధంగా రేవంత్ పాలన – దావ వసంత సురేష్

వై.ఎస్.ఆర్ ఆశయాలకు విరుద్ధంగా రేవంత్ పాలన – దావ వసంత సురేష్ ఫీజు రియాంబర్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వై.ఎస్.ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా ఉందని జిల్లా పరిషత్ తొలి ఛైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ విమర్శించారు. ఫీజు రియాంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన...
Read More...
Local News  State News 

ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారమే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి – పిఆర్టియుటిఎస్, జగిత్యాల జిల్లా శాఖ

ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారమే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి – పిఆర్టియుటిఎస్, జగిత్యాల జిల్లా శాఖ జగిత్యాల, నవంబర్ 04 (ప్రజా మంటలు): ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 25 (తేదీ 12.08.2021) ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాట్లు జరగాలని పిఆర్టియుటిఎస్ (PRTUTS) జగిత్యాల జిల్లా శాఖ డిమాండ్ చేసింది. జిల్లా శాఖ అధ్యక్షుడు బోయినపల్లి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్నాథ్ రెడ్డి నేతృత్వంలో జిల్లా విద్యా...
Read More...

బహరేన్‌లో గల్ఫ్ కార్మికుడి మృతదేహం ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు

బహరేన్‌లో గల్ఫ్ కార్మికుడి మృతదేహం ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు మెటుపల్లి, నవంబర్ 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్‌లో దుర్మరణం చెందగా, ఆయన మృతదేహం ఇప్పటివరకు అక్కడి అతిశీతల శవాగారంలో నిల్వ ఉంది. సాంకేతిక కారణాల వల్ల మృతదేహాన్ని భారత్‌కు తరలించడం సాధ్యం కాదని బహరేన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పష్టంచేసింది....
Read More...