న్యాయ శాస్త్రంలో 'అనన్య'కు 8 బంగారు పతకాలు

On
న్యాయ శాస్త్రంలో 'అనన్య'కు 8 బంగారు పతకాలు

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల రూరల్ మార్చి 24 ( ప్రజా మంటలు )

మండలంలోని లక్ష్మీపూర్ చెందిన కూర్మచలం అనన్య న్యాయ శాస్త్రంలో 8 బంగారు పతాకాలను సాధించింది.

ఈ మేరకు అదివారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి ప్రియదర్శిని చేతుల మీదుగా న్యాయశాస్త్ర డిగ్రీ పట్టాతో పాటు 8 బంగారు పతకాలను అనన్య అందుకుంది.

ఉస్మానియా యూనవర్శిటి పరిధిలోని ఆంధ్ర మహిళా సభ లా కళాశాలలో 2020-2023 వరకు బ్యాచిలర్ ఆఫ్ లా కోర్సు పూర్తి చేసింది.

ఈ మేరకు న్యాయ శాస్త్రంలోని లేబర్ లా, కానిస్టిట్యూషనల్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, ఫ్యామిలా, లా ఆఫ్ జూరిస్క్రిప్రిడెన్స్ విభాగాలతో పాటు ఎల్ఎల్బీ ఫస్ట్ ఇయర్, ఎల్ఎల్బి సెకండ్ ఇయర్, 2020-2023 బ్యాచ్ లో అత్యుత్తమ విద్యార్థినిగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు కళాశాల యజమాన్యం 8 బంగారు పతకాలతో సత్కరించింది. అనన్య తండ్రి కూర్మచలం వేణుమాధవ్ జగిత్యాల జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాది కాగా, తల్లి పుష్పలత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. అనన్య భర్త గొనెపట్ల అజయ్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నాడు.

ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ..... న్యాయశాస్త్రంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగేందుకు, సామాన్యుడికి సత్వర న్యాయం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు.

అనన్యకు బంగారు పతకాలు రావడం పట్ల లక్ష్మీపూర్ వాసులతో పాటు జగిత్యాల కోర్టు న్యాయవాదులు, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.

Tags