సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
కొండ్ర మల్లారెడ్డి సేవలు మరువలేనివి
రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి
రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది
జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా మల్ల రెడ్డి చాలా కృషి చేశారని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మండలంలో ఇంటర్ స్థాయి విద్య అవకాశాలు లేని చోట, మండలానికి ఒక కళాశాల ఏర్పాటు చేయాలని భావించి,సారంగాపూర్ మండలంలో 2 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు. బీర్పూర్ మరియు సారంగాపూర్ మండలాలకు గుర్తింపు వచ్చింది అంటే దానికి కారణం కమ్మునూరు కలమడుగు గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై గల బ్రిడ్జి అని అన్నారు.
మన ప్రాంతానికి వాణిజ్యపరంగా మేలు కలిగితే,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వుట్నూరు కడెం జన్నారం ప్రాంత గిరిజనులకు ఆదివాసులకు విద్య వైద్య సదుపాయాలకు ఉత్తర ద్వారం తలుపులు తెరిచినట్టయిందని అన్నారు.
రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి
రాజుల చెరువు (రోల్లవాగు) ను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కాల్వల ఏర్పాటు సమయంలో బీర్పూర్ ప్రాంతంతో పాటుగా ధర్మపురి మండలానికి సాగునీటి ఎద్దటి కలగకుండా చూడాలని ఈ రాజుల చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 0.25 TMC నిలువ సామర్థ్యంతో రోళ్లవాగు ప్రాజెక్టుగా రూపొందించి ఎస్సారెస్పీలో ఇది అంతర్భాగంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా దీన్ని రూపొందించడం జరిగిందాని తెలిపారు.
జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా ఇలా తెలిపారు:
సాగునీటితో పాటుగా త్రాగునీరు కూడా అందించాలని రక్షిత మంచినీటి సరఫరా చేయాలని ఈ ఫిల్టర్ బెడ్ సౌకర్యం ఎక్కడ లేకుండే కానీ బీర్పూర్ లో ఏర్పాటు చేశాం .
తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ కరీంనగర్ కు మొట్టమొదటిసారి పర్యటనకు వచ్చినప్పుడు, నేను శాసన సభ్యునిగా ఉన్న సమయంలో రాయికల్ మండలం బోర్నపల్లి మరియు కడెం మండలం బెల్లాల గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై వంతెన నిర్మిస్తే ఈ ప్రాంతానికి భవిష్యత్తు వేసినట్టు అవుతాం అని కెసిఆర్ గారికి విజ్ఞప్తి చేయడంతో వెంటనే 70 కోట్లు మంజూరు చేసినారు.
కొప్పుల ఈశ్వర్ ధర్మపురి శాసనసభ్యులుగా ఉన్న సమయంలో రోళ్లవాగు ఆధునికరణ అనేది తెరమీదకి తీసుకువచ్చి 60 కోట్లతో మంజూరై 153 కోట్లకు వెళ్ళింది ఇప్పుడు.
బోర్నపల్లి వంతెన దాదాపుగా రెండు మూడు సంవత్సరాలలో పూర్తి చేసుకుని వినియోగంలోకి తెచ్చాం.రాజకీయ ప్రాతినిధ్యం ఎవరిది ఉన్న నిర్మాణంలో మాత్రం అలసత్వం. ఈ నిర్మాణ అలసత్వ కారణంగా మత్స్యకారుల కోట్లాది రూపాయల మత్స్య సంపద కోల్పోయింది.
బీర్పూర్ మండలం నర్సింహులపల్లి, తుంగూరు, తాళ్ల ధర్మారం గ్రామాల భూముల్లో ఇసుక మేటలు వేయగా రైతులు వాటిని తొలగించడానికి భూమి దరకు సమానంగా ఖర్చయింది
రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది
అప్పటి అలసత్వాన్ని ప్రభుత్వ వైపల్యమా లేక ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులను అనడమా? ఎవరిని అనడమో కానీ ఆ అలసత్వంతో నిర్మాణం జాప్యం కావడంతో ఇటు మత్స్యకారులు తీవ్ర నష్టపోయినారు. పది సంవత్సరాల నుండి అక్కడ చేపల పెంపకం అవకాశం కోల్పోయారు.
కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్న సమయంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో బీర్పూర్ లో మేము నాలుగు గంటలు ధర్నా చేశాం. ఎస్సారెస్పీ అధికారులు దిగివచ్చి రెండో పంటకు నీరు విడుదల చేస్తామని చెప్పడంతో మేము ధర్నా విరమించాం
ఉమ్మడి రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని మా బాధ్యతగా భావించి చేశాంటిఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా మేము ఆ రోజు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మా బాధ్యత మేము నిర్వహించాం
వాస్తవంగా పనులు నిలిచిపోవడానికి కారణం పెండింగ్ బిల్స్ చెల్లింపు లేకపోవడం.తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్ళగానే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 30 కోట్ల బిల్లులను చెల్లింపు చేశాం
.25 TMC నిల్వకు అదనంగా 1 TMC ప్రతిపాదన ఉన్నదో అదనపు నిల్వ సామర్థ్యానికి రెవెన్యూ ల్యాండ్ ముంపుకు గురవుతుంది దానికి అదనంగా ఫారెస్ట్ ల్యాండ్ ముంపుకు దాదాపు 800 ఎకరాలు ముంపుకు గురవుతుంది
రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ముంపుకు గురవుతున్నదో దానికి ప్రతిగా రెవెన్యూ ల్యాండ్ ఇవ్వాలి ప్రతిపాదించడం లోపల అప్పటి ప్రాతినిధ్యం చొరవ చూపెట్టక లేకపోవడంతోని ఈ జాప్యం జరిగింది
కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్స్ తో పాటుగా అటవీ శాఖకు చెందిన భూమి ముంపుకు గురవుతుందో దానికి ప్రతిగా పెగడపల్లి మండల నంచర్ల గొల్లపల్లి మండల చందోలి దట్నూర్ ప్రాంతం నుండి సబ్ స్యూడ్ ల్యాండ్ రెవెన్యూకు ప్రతిపాదించడంతో పాటుగా ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ నుండి ఢిల్లీకి ప్రతిపాదన పోతుంది దాని అనుమతి కేంద్ర ప్రభుత్వం నుండి రావాలి
More News...
<%- node_title %>
<%- node_title %>
చిలకలగూడ, ఓయూ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు
సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజామంటలు):
పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్బంగా సోమవారం చిలకలగూడ,ఓయూ డివిజన్ల పోలీస్ అధికారుల అధ్వర్యంలో రక్తదాన శిభిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. అడిక్ మెట్ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బ్లడ్ డోనెషన్ క్యాంపులో 300 మందికి పైగా యువకులు, పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. గాంధీ... గాంధీనగర్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్
సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
ఆపదలో ఉండే వారికి సంజీవని లాగా పనిచేసే బ్లడ్ ను యువకులు స్వచ్ఛందంగా వచ్చి డొనేట్ చేయడం అభినందనీయమని సెంట్రల్ జోన్ డిసిపి శిల్పవల్లి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సిటీ సెంట్రల్ జోన్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మెగా
దాదాపు... శ్రీగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు
సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాస్ నగర్ శ్రీగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం లో "జీర్ణోద్ధరణపూర్వక మహా సంప్రోక్షణ, అష్టబందన మహా కుంభభిషేకం లో భాగంగా మూడవ రోజు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం యాగశాల ద్వారతోరణ ధ్వజ కుంభఆరాధన , ప్రాతరారాధన, అర్చన,--... వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల అక్టోబర్ 27 (ప్రజా మంటలు)ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి
మహిళల భద్రతకు ప్రాధాన్యం — నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తనిఖీ సందర్భంగా ఎస్పీ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డులు, రిజిస్టర్లు, క్రైమ్ రికార్డులు, జనరల్ డైరీ, ఆర్మ్ రూమ్, స్టోర్స్, లాకప్ రూమ్‌లను పరిశీలించారు.... రష్యా సరికొత్త అస్త్రం: ప్రపంచపు తొలి అణుశక్తి క్రూజ్ మిసైల్ ‘బురేవస్త్నిక్-9M739’ విజయవంతంగా పరీక్ష
మాస్కో అక్టోబర్ 27:
ప్రపంచ రక్షణ రంగాన్ని కుదిపేస్తూ రష్యా మరో విప్లవాత్మక ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది.
రష్యా రక్షణ శాఖ ప్రపంచంలోనే తొలి అణుశక్తితో నడిచే క్రూజ్ మిసైల్ “బురేవస్త్నిక్-9M739” ను సఫలంగా పరీక్షించిందని అధికారికంగా ప్రకటించింది.
🔸 ముఖ్యాంశాలు:
రష్యా విజయవంతంగా పరీక్షించిన అణుశక్తి ఆధారిత క్రూజ్ మిసైల్
“అనంత రేంజ్ ఉన్న... తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘ మహిళ ప్రధాన కార్యదర్శిగా మంచాల వరలక్ష్మి
సికింద్రాబాద్, అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర పెరిక (పురగిరి క్షత్రియ) సంఘ రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శిగా మంచాల వరలక్ష్మి ఎన్నికయ్యారు. హైదరాబాదులో సోమవారం జరిగిన సంఘ సమావేశంలో రాష్ట్ర నాయకులు అంతా కలిసి ఏకగ్రీవంగా ఆమెను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ..తనపై విశ్వాసంతో అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తానని..పెరిక... వీధి కుక్కల బారి నుండి రక్షించండి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో గత కొన్ని నెలలుగా వీధి కుక్కలు సంఖ్య ఎక్కువైపోయింది. ఆవి రాత్రి పగలు తేడా లేకుండా వీధులలో తిరుగుతూ చిన్నపిల్లలను, పెద్దలను కరుస్తున్నాయి ప్రజలు కుక్క కాట్ల వల్ల గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సందర్భాలు ఉన్నాయి, భయంతో, ఆరోగ్య
ప్రజలకు... సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి
రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది
జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా... కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పానెల్ ను ప్రకటించలేదు
తమకే మంత్రుల అండదండ ఉందంటూ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు
అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం.. బ్యాంకు అభివృద్ధికి ప్రభుత్వం పక్షాన సహకరిస్తాం
కరీంనగర్ అక్టోబర్ 27 (ప్రజా మంటలు):
జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్చార్జి మంత్రిగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప... సారంగాపూర్ లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
జగిత్యాల (రూరల్), అక్టోబర్ 27 (ప్రజా మంటలు):సారంగాపూర్ మండలానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా రూ. 2 లక్షల 46 వేల విలువగల చెక్కులను జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే... "No Kings" ఉద్యమంలో 40 ఏళ్ల విద్యావంతులైన తెల్లజాతి మహిళల ఆధిక్యం: నిపుణుల విశ్లేషణ
(సిహెచ్ వి ప్రభాకర్ రావు)
వాషింగ్టన్ అక్టోబర్ 27:
అమెరికాలో ఇటీవల బలంగా కొనసాగుతున్న “No Kings” ఉద్యమం పై నిపుణులు చేసిన తాజా విశ్లేషణ ఆసక్తికరంగా మారింది. New York Post నివేదిక ప్రకారం, ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారి పెద్దశాతం 40ల వయస్సులో ఉన్న, ఉన్నత విద్యావంతులైన తెల్లజాతి మహిళలు అని తేలింది.... సామాజిక న్యాయం రచనల్లో ప్రతిబింబించాలి. పూర్వ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు.
హైదరాబాద్ అక్టోబర్ 27:
యువరచయితలు ,కవులు,కవయిత్రులు సామాజిక న్యాయం కోసం సాహిత్యాన్ని సృష్టించాలని పూర్వ బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు పిలుపునిచ్చారు.తాను దేశమంతా పర్యటించి ప్రత్యామ్నాయ సాహిత్య సృష్టితో ప్రజా ఉద్యమాలను నిర్మించానని తెలిపారు.దళిత బహుజనులు చైతన్యవంతులై రాజ్యాధికారం చేపట్టిన నాడే సామాజిక న్యాయం సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారతీయ సాహిత్యం అనువాద ఫౌండేషన్... 