తెలంగాణ అమరవీరులకు, వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా - కల్వకుంట్ల కవిత 

'జనం బాట' కు బయలు దేరే ముందు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు

On
తెలంగాణ అమరవీరులకు, వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా - కల్వకుంట్ల కవిత 

ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదు.
1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం జరిగింది.
ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
అమరుల కుటుంబాలకు,  తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు):


తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారు. వారి త్యాగాలతో తెలంగాణ  సాధించుకున్నాం. ఏ ఆశయాల కోసం వారు అమరులయ్యారో వాటిని ఎంత వరకు సాధించుకున్నామో ఆలోచించుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

పేగులు తెగేదాక కొట్లాడిన ఉద్యమ కారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలి.  తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీ లో చెప్పాం. కాని వారికి ఇవ్వాల్సిన గౌరవం, వారి కుటుంబాలకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు.ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చెప్పాం. కానీ 580 మందికి మాత్రమే ఇచ్చాం. మిగతా వారికి న్యాయం చేయలేకపోయామని ఆవేదన చెందారు.

ఉద్యమకారుల్లో కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎమ్పీటీసీ, సర్పంచులు లాంటి అవకాశాలు వచ్చాయి. కానీ ఇంకా వేలాది మందికి జరగాల్సిన న్యాయం జరగలేదు. ఇప్పటికి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేరుతో ఉద్యమం చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా లేకపోయిన సరే ఎంపీగా, ఎమ్మెల్సీగా కొనసాగిన. అప్పుడు అమరవీరుల కుటుంబాలాకు ఇంకో రూపంలోనైనా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల్లో చెప్పాను. కానీ మీకోసం నేను ఇంకా ఎక్కువగా కొట్లాడేది ఉండేఅమరవీరులకు, వారి కుటుంబాలను చేతులెత్తి క్షమాపణ కోరుతున్నానని అన్నారు.

ఇంకా ఇలా అన్నారు. 

తెలంగాణ యావత్ బాగుండాలనే అమరులు వారి ప్రాణాలను త్యాగం చేశారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే విధంగా పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా. ఈ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. 

ఒకవేళ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వకపోతే  ప్రభుత్వాన్ని మార్చి వచ్చే ప్రభుత్వంతో నైనా వారికి న్యాయం జరిగేలా చేస్తానని అమరుల పాదాలకు నమస్కరించి చెబుతున్నా. ఉద్యకారుల లిస్ట్ మొత్తాన్ని ప్రజాదర్భార్ పెట్టుకొని తయారు చేద్దాం.  

ఆ ఉద్యమకారులందరికీ పెన్షన్ వచ్చే వరకు విరామం లేకుండా నేను పోరాటం చేస్తా. 33 జిల్లాలు 119 నియోజకవర్గాల్లో 'జనం బాట' పేరుతో జనం కోసం బయలుదేరుతున్నా.IMG-20251025-WA0011

మీరు కూడా వచ్చేయండి. అందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది.ఆ హామీ నెరవేరే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సిందే.  

ఉద్యమకారుల పోరాటం కారణంగానే తెలంగాణ వచ్చింది. అందరం బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. మహిళలు, రైతులు, యువకులు, నిరుద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు మేలు జరగాలని తెలంగాణ సాధించుకున్నాం. 

కానీ అన్ని వర్గాలకు న్యాయం జరిగిందా అంటే జరగలేదనే చాలా మంది చెబుతున్నారు. అందరు బాగుండాలంటే సామాజిక తెలంగాణ రావాలి. ప్రతి ఒక్కరికీ సమానంగా రాజకీయ, ఆర్థిక పరమైన అవకాశాలు దక్కాలి

జాగృతి ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తోంది. వాటిని సాధించుకుంటాం. ఎస్సీలు, ఎస్టీల కోసం పోరాటం చేస్తున్నాం. మైనార్టీలకు రిజర్వేషన్లు ఉండాలని జాగృతి ఎప్పుడో చెప్పింది.  

అగ్రవర్ణాల్లోని అన్ని వర్గాలకు సరైన ప్రాతినిథ్యం లేదు.  వైశ్యుల జనాభాకు అనుగుణంగా వారికి  ప్రాతినిథ్యం లేదు. అగ్రవర్గాల్లోని అన్ని వర్గాలకు కూడా సమాన అవకాశాలు రావాలి. అందరూ బాగుంటేనే అందమైన బతుకమ్మ లాగా తెలంగాణ ఉంటుంది. 

ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ది కోసమే సామాజిక తెలంగాణ కావాలని అంటున్నా. 

దానికోసమే నేను జనం బాట కార్యక్రమాన్ని చేపడుతున్నా. ప్రతి జిల్లాలో మేధావులను కలుస్తాం. జిల్లాలో ఎక్కడ అభివృద్ధి ఆగిపోయిందో తెలుసుకుంటాం. ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన అభివృద్ధి గురించి చర్చిస్తాం. 

జాగృతి లో ఇదివరకు పనిచేసిన వాళ్లను మళ్లీ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నా. ఇవ్వాళ ఉన్న ప్రభుత్వానికి అసలు  తెలంగాణ సోయి లేదు. 

తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మను తీసేయటం మన గుండెల్ని మెలి పెట్టినట్లైంది. మళ్లీ తెలంగాణ తల్లి చేతుల్లోకి బతుకమ్మ వచ్చే వరకు పోరాటం చేద్దాం. 

తెలంగాణలోని చాలా ప్రాంతాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ  ప్రాంతంలోని బిడ్డలకే 95 శాతం ఉద్యోగవకాశాలు రావాలని రాష్ట్రపతి ఉత్తర్వులను తెచ్చుకున్నాం. 

కానీ ఈ ప్రభుత్వం ప్రాంతేతరులకు ఉద్యోగాలు ఇస్తోంది.  హర్యానా సహా పక్కరాష్ట్రాల వారికి తెలంగాణలో ఉద్యోగాలు వస్తున్నాయి. 

ఆ అన్యాయాన్ని సహించేది లేదు.  జాగృతి చూస్తూ ఊరుకోదు. ఆత్మగౌరవంతో కూడిన  అభివృద్ధి కావాలన్నదే నా అభిమతం. 

మరోసారి అమరవీరులకు, వారి కుటుంబాలకు నా తరఫున క్షమాపణలు చెబుతున్నా. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. IMG-20251025-WA0009తెలంగాణ సోయి లేని ఈ ప్రభుత్వంపై జంగ్ సైరన్ పూరించాల్సిన అవసరం ఉంది. 

ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా.

Tags
Join WhatsApp

More News...

Local News 

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.-జగిత్యాల ఆర్డీవో మధుసూదన్

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.-జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు): వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే శిక్షర్హులేనని, జైలు శిక్ష,, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయోవృద్దుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వయోవృద్దుల సంక్షేమ చట్టం అవగాహన ప్రచార పత్రిక లను...
Read More...

అదానీ గ్రూపుకు ₹33 వేల కోట్ల LIC నిధుల మళ్లింపు?

అదానీ గ్రూపుకు  ₹33 వేల కోట్ల LIC నిధుల మళ్లింపు? వాషింగ్టన్ అక్టోబర్ 25: వాషింగ్టన్ పోస్ట్, నిన్న ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ కథనం ద్వారా, అదానీ గ్రూపు సంస్థలకు 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించి, భారత ప్రజలను ఆశ్చర్య పరిచింది. దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా, రాజకీయ పార్టీ లతో పాటు,ఆర్థికసంస్థలు, వ్యవస్థాగత పెట్టుబడిదారులలో సంచలన ప్రకంపనలు సృష్టించింది. అమెరికాలో అదానీ...
Read More...

జనం బాట కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం మద్దతు

జనం బాట కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం సంఘం మద్దతు హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, అమర వీరుల ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది. జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ గన్ పార్క్ అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే...
Read More...
Local News  State News 

జనం బాట లో భాగంగా దేవుతండా చేరుకొన్న కవిత

జనం బాట లో భాగంగా దేవుతండా చేరుకొన్న కవిత డిచ్ పల్లి అక్టోబర్ 25: జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న దేవితండాలోని జగదాంభ మాత, సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద  తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు.
Read More...
Local News 

ప్లాస్టిక్ బ్యాగ్ లు నివారించినప్పుడే అనారోగ్యం నుంచి దూరం అవుతాం- ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమే: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

ప్లాస్టిక్ బ్యాగ్ లు నివారించినప్పుడే అనారోగ్యం నుంచి దూరం అవుతాం- ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమే: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్       జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు) పట్టణ పరిశుభ్రత అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్న తరుణంలో ప్లాస్టిక్ బ్యాగులు నివారించకుంటే అనారోగ్యం తప్పదని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు అర్థం చేసుకోకుంటే ఇక ప్రమాదమేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు    ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ఆపి - రోటరీ క్లబ్ ఈ...
Read More...

తెలంగాణ అమరవీరులకు, వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా - కల్వకుంట్ల కవిత 

తెలంగాణ అమరవీరులకు, వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా - కల్వకుంట్ల కవిత  ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదు. 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం జరిగింది. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అమరుల కుటుంబాలకు,  తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...
Read More...
Local News 

అత్యంత ప్రాధాన్యత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి మున్సిపల్ కమిషనర్లకు ఎమ్మెల్యే డా సంజయ్ ఆదేశం

అత్యంత ప్రాధాన్యత పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి మున్సిపల్ కమిషనర్లకు ఎమ్మెల్యే డా సంజయ్ ఆదేశం    జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు)అత్యంత ప్రాధాన్యత కలిగిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల, రాయికల్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. పట్టణ మెప్మా కార్యాలయం లో మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ముఖ్యమంత్రి...
Read More...
Local News 

నేరం చేస్తే శిక్ష తప్పదు  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  _ ఈ సంవత్సరంలో న్యాయస్థానాల్లో 83 కేసుల్లో 92  మందికి జైలు శిక్షలు, జరిమానాలు

నేరం చేస్తే శిక్ష తప్పదు  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,  _ ఈ సంవత్సరంలో న్యాయస్థానాల్లో 83 కేసుల్లో 92  మందికి జైలు శిక్షలు, జరిమానాలు జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు) నేర నియంత్రణలో, న్యాయస్థానాలలో న్యాయ నిరూపణలో జిల్లా పోలీసులు విశేష ఫలితాలను సాధిస్తున్నారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,  తెలిపారు.ఈ సంవత్సరం (జనవరి నుండి అక్టోబర్ వరకు) కాలంలో, జిల్లా పోలీసు శాఖ సమగ్రంగా వ్యవహరించి న్యాయస్థానాల్లో 83 కేసుల్లో తీర్పులు వెలువడగా, వాటిలో 92 మంది...
Read More...
Local News  Crime 

నేరెళ్లలో పేకాట ఆడుతున్నారని పట్టుకొన్న పోలీసులు

నేరెళ్లలో పేకాట ఆడుతున్నారని పట్టుకొన్న పోలీసులు ధర్మపురి అక్టోబర్ 25 (ప్రజా మంటలు): ధర్మపురి మం. నేరెళ్ల గ్రామంలో పేకాట స్థావరం పై పోలీసుల దాడి, లక్ష 16 వేల నగదు స్వాధీనం చేసుకొని, 5 గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ధర్మపురి మండలంలోని నేరెళ్ల గ్రామంలో పేకాట ఆడుతున్న స్థావరంపై జగిత్యాల సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ధర్మపురి పోలీసులు...
Read More...
Local News  Crime  State News 

లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన కొమరం భీం జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు

లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన కొమరం భీం జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు మంచిర్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు): బెజ్జూర్ పిఎసిఎస్ లో పనిచేస్తున్న మాజీ సీఈవో వెంకటేశ్వర్ గౌడ్‌ను రెన్యువల్ చేసేందుకు, సహకార అధికారి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, తప్పనిసరి అయి, రెండు విడుదలగా ఇచ్చేందుకు రూ. 8 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో రూ. 2 లక్షలు,మొదటి విడత డబ్బులు ఇచ్చేందుకు మాజీ సీఈవో...
Read More...
National  International  

వివాదాస్పదమైన వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత

వివాదాస్పదమైన వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ కూల్చివేత చారిత్రాత్మక మాగ్నోలియా చెట్లు నరికి వేయబడ్డాయా? వాషింగ్టన్‌ అక్టోబర్ 25: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేపట్టిన కొత్త వైట్‌హౌస్‌ బాల్‌రూమ్‌ నిర్మాణ ప్రాజెక్ట్‌ తీవ్ర వివాదానికి దారితీసింది. తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం, వైట్‌హౌస్‌ ఈస్ట్‌ వింగ్‌ పూర్తిగా కూల్చివేయబడింది. ఈ నిర్మాణ పనుల నేపథ్యంలో కనీసం ఆరు చెట్లు తొలగించబడ్డాయి. వీటిలో 1940ల...
Read More...
State News 

సీఎం ప్రజావాణి చొరవతో 1087 మందికి డబుల్ బెడ్ రూం లు కేటాయింపు 

సీఎం ప్రజావాణి చొరవతో 1087 మందికి డబుల్ బెడ్ రూం లు కేటాయింపు  చిన్నారెడ్డి, దివ్యలను సన్మానించిన లబ్దిదారులు సీఎం ప్రజావాణిలో 229 దరఖాస్తులు హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు):సీఎం ప్రజావాణి చొరవతో 1087 మందికి డబుల్ బెడ్ రూం లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ శుక్రవారం ప్రజా భవన్ లో...
Read More...