మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్
హైదరాబాద్ అక్టోబర్ 22 (ప్రజా మంటలు):.
మాజీ ప్రజాప్రతినిధులు వయో వృద్ధులు కావడంతో వైద్య అవసరాల సమయంలో ముందుగా నగదు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ పొందే ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించి, తక్షణమే నగదు రహిత చికిత్స సదుపాయాన్ని అమలు చేయాలని ఫైనాన్స్ శాఖను మాజీ ప్రజాప్రతినిధుల సంఘ నాయకులు కోరారు.
మాజీ మంత్రి, మరియు శాసనమండలి సభ్యుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జి. రాజేశం గౌడ్ , మాజీ మంత్రి మరియు సెక్రటరీ సుద్దాల దేవయ్య , మాజీ విప్ ఆరెల్లి మోహన్ ఈ రోజు సచివాలయంలో ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాన్ ను, ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి, సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు మరియు ప్రస్తుత ప్రజాప్రతినిధుల ఆరోగ్య భీమా పథకానికి సంబంధించి నగదు రహిత (Cashless) వైద్య సేవలను అందించాలన్న అంశంపై సవివరంగా చర్చించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు మరియు ప్రస్తుత ప్రజాప్రతినిధులు సమయానుకూలంగా మెరుగైన వైద్య సేవలు పొందగలుగుతారని, ఇది మానవతా దృక్పథంలో కూడా ఎంతో అవసరమని వర్కింగ్ ప్రెసిడెంట్ జి. రాజేశం గౌడ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జి. రాజేశం గౌడ్ ఫైనాన్స్ సెక్రటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తాన్ కు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇటీవల ఫైల్ ఆమోదం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తాన్ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వార్తగా రాయండి
More News...
<%- node_title %>
<%- node_title %>
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
