వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం-ఆర్ఎస్ఎస్ జిల్లా గో సేవ ప్రముఖ్ సంతోష్
జగిత్యాల అక్టోబర్ 3 (ప్రజా మంటలు)
వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని ఆర్ఎస్ఎస్ జిల్లా గో సేవా ప్రముఖ్ సంతోష్ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణం పోచమ్మ వాడ బస్తి ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న సంతోష్ మాట్లాడుతూ సంఘటిత హిందూ సమాజం తోనే దేశాభివృద్ధి జరుగుతుందని దీనికోసమే ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా కృషి చేస్తుందన్నారు.1925 సంవత్సరం విజయదశమి రోజున నాగపూర్ లో
డా. హెడ్గేవార్ ఆర్ ఎస్ ఎస్ ను కేవలం కొద్దిమంది పిల్లలతో ప్రారంభించారన్నారు.ఎన్నో ఇబ్బందులు,నిర్బంధాలను ఎదురించి ఈ వంద సంవత్సరాల కాలం లో సంఘం ఎన్నో విజయాలు సాధించిందని,సంఘటిత హిందూ సమాజం కోసం నిత్య శాఖ ద్వారా కృషి చేస్తుందని వివరించారు.మన దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విదేశీ శక్తులు ఎన్నో కుట్రలు పన్నుతున్నాయని,
దురదృష్టవశాత్తు మన దేశం లోని కొంతమంది వ్యక్తులు విదేశీ శక్తుల కు వత్తాసు పలుకుతున్నారని వారిపట్ల మనం అప్రమత్తంగా ఉండాలన్నారు.
దేశం పట్ల, సంస్కృతి పట్ల దేశప్రజల్లో భక్తి భావం పెంపొందించాలన్నారు.అతి విశిష్టమైన మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని,
అన్నికులాల మధ్య సామరస్య భావనను పెంపొందించుకోవాలని, పర్యావరణం ను పరిరక్షించుకోవాలని కోరారు.దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచేందుకు జీవితం లో స్వదేశీ భావనను పెంపొందించుకోవాలని, వ్యక్తిగతంగా,సామూహికంగా పౌర విధులను పాటించడం ద్వారా దేశం లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు.
ప్రతి ఒక్కరూ నియమాలను పాటించాలని కోరారు. సమాజం కోసం ప్రతి ఒక్కరూ సమయం ఇవ్వాలని కోరారు.విజయదశమి ఉత్సవం లో భాగంగా శస్త్ర పూజ నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీ ఆసుపత్రిలో ఘనంగా జాతిపిత జయంతి

ఉజ్జయిని టెంపుల్ లో విజయదశమి పూజలు - ఆలయంలో భక్తుల రద్దీ

చెరువులో పడి వ్యక్తి మృతి

మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య.

మహాత్ముడి బాట యువతకు ఆదర్శం కావాలి *పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

గోదావరి చెంతకు చేరిన దుర్గదేవి అమ్మవారు

తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా మంచాల వరలక్ష్మి

స్వదేశీ స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుంది వేములకుర్తి లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

సీనియర్ సిటీజేన్స్ దసరా సమ్మేళనం.

మానవత్వం చాటుకున్న వెల్గటూర్ ఎస్ఐ ,ఉమాసాగర్

వివిధ దుర్గ మాత మంటపాల వారిచే మహిషాసుర మర్దన నిర్వహణ

జగిత్యాలలో ఘనంగా దసరా వేడుకలు
