స్వచ్చంధ సంస్థల భాగస్వామ్యంతో బాల్యవివాహాల రహిత దేశంగా దూసుకెళ్తోంది
ఆశ్రిత సంస్థ డైరెక్టర్ ఎస్.నాగరాజు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 29 (ప్రజామంటలు):
దేశంలో బాల్యవివాహాలు గణనీయంగా తగ్గాయని జస్టిస్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ( జేఆర్సీ) తాజా నివేదిక వెల్లడించినట్లు ఆశ్రిత సంస్థ డైరెక్టర్ ఎస్.నాగరాజు తెలిపారు. ఆయన సోమవారం సికింద్రాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..బాలికల బాల్యవివాహాలు 69 శాతం, బాలుర బాల్య వివాహాలు 72 శాతం వరకు తగ్గినట్టు టిప్పింగ్ పాయింట్ టు జీరో నివేదిక తెలిపినట్లు పేర్కొన్నారు.అస్సాంలో 84 శాతం, మహారాష్ట్ర–బీహార్‌లో 70 శాతం, రాజస్థాన్‌లో 66 శాతం, కర్ణాటకలో 55 శాతం వరకు తగ్గుదల నమోదయింది. చట్ట అమలు, అవగాహన, విద్యా అవకాశాలతో 2030 నాటికి భారత్‌ను బాల్యవివాహ రహిత దేశంగా మలుస్తాం అని జేఆర్సీ జాతీయ కన్వీనర్ రవికాంత్ విశ్వాసం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాల్లో ఎన్జీఓలు ప్రధాన పాత్ర పోషించాయని నివేదికలో పేర్కొన్నారు. పేదరికం, భద్రతా సమస్యలు, సాంప్రదాయాలు బాల్యవివాహాలకు కారణమని సర్వే తేల్చింది. కాగా బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఆశ్రిత సంస్థ సేవలకు గుర్తింపుగా ఇటీవల జాతీయ స్థాయిలో ఉత్తమ సంస్థ అవార్డు లభించింది. అమెరికాలోని వరల్డ్ లా కాంగ్రెస్ వరల్డ్ జురియస్ట్ అవార్డును జస్ట్ రైట్స్ ఫర్ చిల్ర్డన్ వ్యవస్థాపకుడు భువన్ రిభు చేతుల మీదుగా నాగరాజు ఈ అవార్డును అందుకున్నారు. 2008 నుంచి ఆశ్రిత సంస్థ బాల్య వివాహాల అరికట్టడం,బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల అక్రమ రవాణా నివారించడం తదితర సామాజిక రుగ్మతల నివారణకు పనిచేస్తోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
