ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయి
హైకోర్ట్ జస్టిస్ (రిటైర్డ్) చంద్రకుమార్
సికింద్రాబాద్, సెప్టెంబర్ 07 (ప్రజామంటలు) :
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతు ఇస్తూ తీర్పునిచ్చారని ఆరోపించడం దురదృష్టకరమని ఉమ్మడి ఏపీ హైకోర్టు (రిటైర్డ్) జస్టిస్ చంద్రకుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి సంఘీభావంగా ఆదివారం ఉదయం సికింద్రాబాద్ బోయిగూడలోని నాలెడ్జ్ సెంటర్లో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు బన్నూరు కొండారెడ్డి అధ్యక్షతన న్యాయవాదుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గురించి చెప్పుకోదగ్గ విషయాలు ఏమీ లేకపోవడంతో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా నిస్సత్తువ ఆరోపణలు చేస్తున్నారని జస్టిస్ చంద్రకుమార్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని బ్రష్టుపట్టించడానికి అనైతికచర్యలకు పాల్పడుతున్నారని, దీనికి నిలువెత్తు నిదర్శనం 58వ స్థానంలో ఉన్న పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విపుల్ మనుభాయ్ పంచోలిని ఇటీవల భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారని, సుప్రీంకోర్టు కొలీజియంలోని జస్టిస్ నాగరత్న వ్యతిరేకించినా పట్టించుకోలేదని ఆయన వివరించారు.రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలందరిపై ఉందని జస్టిస్ చంద్రకుమార్ నొక్కిచెప్పారు. ఇప్పటికైనా గ్రహించి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ పిలుపునిచ్చారు. వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజ్యాంగానికి, రాజ్యాంగ వ్యతిరేకతకు జరుగుతున్న పోరు అని, రాజ్యాంగ పరిరక్షణకు మనమందరం పాటుపడాలని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రెహ్మాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అడ్వకేట్ల పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు. బిఆర్ఎస్ నేతలు ఎరువు బస్తాలు ఇస్తే ఓటేస్తామని జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ని అనడం హాస్యాస్పదమని, ఎరువు బస్తాలకు, ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఏమైనా సంబంధముందా అని రెహ్మాన్ ప్రశ్నించారు ? బిఆర్ఎస్ కు ఉన్న ఆ రెండు ఓట్లు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి వేయకపోతే భవిష్యత్తులో బిఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు క్షమించరని రెహ్మాన్ హెచ్చరించారు.సమావేశంలో కన్వీనర్ బన్నూరు కొండారెడ్డి న్యాయవాదుల తరపున ఎంపీలందరికీ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి ఓటువేసి ఉపరాష్ట్రపతిగా గెలిపించాలంటూ ఈ-మెయిల్స్ పంపిద్దామని తీర్మానం ప్రవేశపెట్టగా న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.
న్యాయవాదులతో సమావేశ హల్ లో ఏపీసీఎల్సీ నేత సురేష్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ప్రొఫెసర్ వాగేష్, గోవర్ధన్, సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ బాబు, బీవీ శేషగిరి, డా. అశోక్ కుమార్ తదితరులు ప్రసంగించారు. ఏఎంఏసీఎస్డైరెక్టర్లు తోర్నాల గిరి, అర్ముల మహేశ్వర్, హయత్ నగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోడెం ప్రభాకర్ గౌడ్,అడ్వకేట్లు టీవీఎం శ్రీనివాస్, మల్కన్‌గిరి రవికుమార్, ఉమర్, ఎ. నరేన్ రాజా, పట్లోల్ల జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వయోవృద్ధులకు టాస్కా ఆసరా

సనాతన ధర్మానికి త్యాగానికి ప్రతీక కాషాయ ధ్వజం -విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు_ జిట్టవేణి అరుణ్ కుమార్

అహింసతోనే అఖండ భారతావనికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీజీ: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

నంబి వాసుదేవ ఆచార్యచే దేవి భాగవత ప్రవచనామృతం

గాంధీ మెడికల్ కాలేజీలో గాంధీ జయంతి

శమీ, ఆయుధ పూజలకు ఏర్పాట్లు

బల్కంపేట లో ఘనంగా దేవి నవరాత్రోత్సవాలు..

శ్రీమహిషాసుర మర్ధిని రూపంలో అమ్మవారు - ఉజ్జయిని టెంపుల్ లో చండీహోమం

తెలంగాణ కి దసరా కానుక ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి

సాయం చేయాలనే ఆలోచన ఉన్నవారే ఇతరులకు అండగా ఉంటారు.

పోలీసుల భయం లేకుండా మావోయిస్టులు బయటకు రావచ్చు - నూతన డీజీపీ శివధర్ రెడ్డి
.jpg)
ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే!
