భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

On
భూ భారతి పైలెట్ మండలంగా బుగ్గారంను గుర్తించినందుకు హర్షం

ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ లకు కృతజ్ఞతలు తెలిపిన విడిసి, ఎండిసి
రైతులు భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : చుక్క గంగారెడ్డి 


బుగ్గారం ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లాలో బుగ్గారం మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ మండలంగా గుర్తించి సోమవారం రెవెన్యూ సదస్సులు ప్రారంభించినందులకు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు, జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ కు, ఇతర అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుగ్గారం విడిసి, ఎండిసి లు కృతజ్ఞతలు తెలిపాయి. గ్రామ అభివృద్ది కమిటీ అధ్యక్షులు నక్క చంద్రమౌళి అధ్యక్షతన
సోమవారం మండల కేంద్రంలో రైతులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మండల అభివృద్ధి కమిటి కన్వీనర్ చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ రైతులు ఇట్టి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ లు మండలాన్ని పైలెట్ మండలంగా గుర్తించడం హర్షణీయం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం, ఎమ్మెల్యేలు ఏక తాటితో వ్యవహరించి రైతుల సమస్యలను, ప్రజల సమస్యలను అర్థం చేసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టాన్ని తెరపైకి తేవడం జరిగిందన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో షెడ్యూల్ ప్రకారం నేటి నుండి ఈ నెల 16 వరకు జరిగే రెవెన్యూ సదస్సులకు రైతులు, ప్రజలు తగిన ఆధారాలతో సహా హాజరై మీకున్న భూ సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేయాలన్నారు. నిరక్షరాస్యులైన రైతులకు ఆయా గ్రామాల్లోని యువత సహకరించి దరఖాస్తులు వ్రాసి ఇవ్వాలని కోరారు.

బుగ్గారం మండలంలో వందకు - వంద శాతం భూ సమస్యలు తొలగించే విధంగా అధికారులు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎండిసి కో - కన్వీనర్ పెద్దనవేణి రాగన్న, విడిసి సభ్యులు, మాజీ ఎంపీటీసీ నగునూరి చిన్న రామాగౌడ్, మాజీ ఉప సర్పంచ్ పెద్ద రామ గౌడ్, కోడిమ్యాల రాజన్న, పెరంభూదూరి రామకృష్ణ స్వామి, పరమాల మల్లయ్య, సిరికొండ గంగన్న, ఆకుల రాజన్న, పచ్చిమట్ల సత్తన్న తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్ (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)-గొల్లపల్లి  ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్  ప్రారంభించారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ...మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తడిసిన...
Read More...
National  State News 

వరద ప్రభావిత ప్రాంతాల సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల సీఎం రేవంత్ రెడ్డి పర్యటన   – బాధితులకు భరోసా, జిల్లాల వారీగా నష్టం నివేదికలు సమర్పించాలన్న ఆదేశాలు హనుమకొండ నవంబర్ 01 (ప్రజా మంటలు):భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం జరిగిన ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో ఏరియల్ సర్వే చేసిన అనంతరం, సమ్మయ్యనగర్‌, కాపువాడ, పోతననగర్‌ ప్రాంతాల్లో బాధితులను...
Read More...

జగిత్యాల వ్యాపారవేత్త బట్టు సుధాకర్ మృతి

జగిత్యాల వ్యాపారవేత్త బట్టు సుధాకర్ మృతి   – కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్): నవంబర్ 01 (ప్రజా మంటలు): పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బట్టు సుధాకర్ మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ...
Read More...
Local News  State News 

బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో వర్షిత మృతి – ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్

బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో వర్షిత మృతి – ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ వర్షిత మృతి అనుమానాస్పదం – కవిత 110 మంది పిల్లలు ఏడాదిన్నరలో చనిపోయారని ఆవేదన స్పెషల్ ఎంక్వైరీ, సిట్ వేయాలని డిమాండ్ ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని విజ్ఞప్తి రాంపూర్,హుజురాబాద్ నవంబర్ 01 (ప్రజా మంటలు):: బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో అనుమానాస్పదంగా మృతిచెందిన శ్రీ వర్షిత కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు....
Read More...
National  Comment  State News 

ఇంకెన్నాళ్లీ అంతర్యుద్ధం? కాంగ్రెస్ vs కాంగ్రెస్ — జగిత్యాల వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు

ఇంకెన్నాళ్లీ అంతర్యుద్ధం? కాంగ్రెస్ vs కాంగ్రెస్ — జగిత్యాల వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు 45 ఏళ్ళ రాజకీయ జీవితం అర్ధంతరంగా ముగిసినా? పార్టీలో పట్టుకోల్పోతున్నారా? పదేళ్ల నాయకుడు సంజయ్ తో పోటీ పడలేకపోతున్నారా?    జగిత్యాల, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):జగిత్యాల నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధానికి వేదికగా మారింది. అధికారపక్షంలో ఇలాంటి అంతర్గత యుద్ధం జరగడం కార్య‌కర్త‌ల‌లో, నాయకులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకదశలో రాష్ట్ర...
Read More...

చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించుకుందాం — కల్వకుంట్ల కవిత

చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించుకుందాం — కల్వకుంట్ల కవిత కరీంనగర్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ పర్యటనలో పాల్గొన్న సందర్భంగా జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మలు, బోనాలు, ఒగ్గుడోలు, డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా ఆమెను ఆహ్వానించారు. అల్గునూరు చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, భారీ ర్యాలీగా తెలంగాణ అమరవీరుల...
Read More...
Local News  Spiritual  

కొత్త గుడిలో భక్తులకు  దర్శనమిచ్చిన వెంకన్న స్వామి

కొత్త గుడిలో భక్తులకు  దర్శనమిచ్చిన వెంకన్న స్వామి శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పున:ప్రారంభించిన పీఠాధిపతులు పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల రాక సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) : సీతాఫల్మండి డివిజన్ శ్రీనివాస్ నగర్ లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం  జీర్ణోద్దరణ పూర్వక మహా  సంప్రోక్షణ, అష్ట బంధన మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించి, ఆలయాన్ని పున ప్రారంభించారు. కంచి...
Read More...
Local News  Spiritual  

నేటి నుంచి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 150వ వార్షికోత్సవాలు 

నేటి నుంచి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 150వ వార్షికోత్సవాలు  సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు): సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి 150వ వార్షికోత్సవాలను నవంబర్ 1వ తేదీ నుంచి ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్టాండింగ్ కమిటీ, జూబ్లీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రాబర్ట్ సూర్య ప్రకాష్ తెలిపారు. శుక్రవారం చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చర్చి సీనియర్ పాస్టర్ డాక్టర్...
Read More...
Local News 

కోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రి క్యాంటీన్ ను సీజ్ చేసిన అధికారులు

కోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రి క్యాంటీన్ ను సీజ్ చేసిన అధికారులు సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) : గాంధీ ఆస్పత్రి ఆవరణలోని  పెషీ కేఫ్‌ను కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఆస్పత్రి అధికారులు సీజ్‌చేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో గాంధీ హాస్పిటల్‌డెవలప్‌మెంట్‌సొసైటీ (హెచ్‌డీఎస్‌) తరఫున అధికారులు కేఫ్‌ లోని సామాన్లు బయటకు తీయించి తాళం వేశారు. ఓపీ బ్లాక్‌ఎదురుగా ఉన్న ఈ కేఫ్‌కాంట్రాక్టు గడువు 2018లో ముగిసినప్పటికీ,...
Read More...
Local News  Spiritual  

స్కందగిరిలో స్వర్ణరథాన్ని ఆవిష్కరించిన కంచి పీఠాధిపతి

స్కందగిరిలో స్వర్ణరథాన్ని ఆవిష్కరించిన కంచి పీఠాధిపతి సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) : పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో భక్తుల విరాళాలతో రూపొందించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి స్వర్ణ రథాన్ని శుక్రవారం రాత్రి కంచి కామకోటి పీఠాధిపతి శంకరా చార్య శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి  ప్రారంభించారు. వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వర్ణ...
Read More...
Local News 

గొల్లపల్లి మండలం పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ 

గొల్లపల్లి మండలం పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ  (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 31 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని  రన్ ఫర్ యూనిటీ ఐక్యత  కార్యక్రమం ఎస్ఐ కృష్ణా సాగర్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు పోలీస్ సిబ్బంది,ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాకారులు, ,  యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల...
Read More...
Local News 

బుగ్గారం  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ 

బుగ్గారం  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ  (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 31 (ప్రజా మంటలు): బుగ్గారం మండలంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ (ఐక్యత పరుగు) కార్యక్రమం  ఎస్ఐ ,జి సతీష్ , ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజా ప్రతినిధులు, మరియు యువత ఉత్సాహంగా...
Read More...