ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు
వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర
(రామ కిష్టయ్య సంగన భట్ల)
సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష నుకు వేంకటపతి వెళ్ళి విశేష పూజలందుకోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈకార్యక్రమంలో భాగంగా మంగళ వారం సాయంత్రం దేవస్థానంలో దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర పూజలు నిర్వహించిన అనంతరం, మున్సిపాలిటీ, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారిమీదుగా, బాజాభజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా స్వామివారిని సాంప్రదాయ రీతిలో ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలు స్టేషన్ ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు.
తమవద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని భక్తులు, పోలీసుల కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్టేషన్ ప్రాంగణాన స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులజేసి, ప్రత్యేక పూజలొన రించారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, రాజగోపాల్, అర్చకులు శ్రీనివాసా చార్య, వామనాచార్య, మోహన్, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు రమేశ శర్మ, వేదమంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందుకున్నారు.
పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలలో ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్,సభ్యులు, దేవస్థానం సిబ్బంది, ఎస్ ఐ శ్రీధర్, ఉమా సాగర్, పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలోగల ఉద్యోగులు పాల్గొన్నారు.
వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర
బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళ వారం సాయంత్రం దక్షిణ దిగ్యాత్ర అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రాల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా, పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులోగల ఉసిరి చెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనుల గావించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, అర్చక పౌరో హితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసాచార్య, వామన్, కిరణ్, తదితరులు ప్రత్యేక అర్చనలు గావించారు. మార్గమధ్యలో భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమవ ద్దకు అపురూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముగింపుగా ఇసుకస్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, సిబ్బంది. కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో భాగస్వాములైనారు.
అలరించిన ప్రేంకుమార్ మిమి క్రీ
ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవసా స్థానం లో ని శేషప్ప కళా వేదికపై, స్థానిక నాట్యమండల సౌజన్యంతో నిర్వహించిన రాష్ట్ర మిమిక్రీ పితామహ బిరుదాంకితులైన గుండి ప్రేం కుమార్ మిమిక్రీ కార్యక్రమం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆరు దశాబ్దాల కాలానికి పైగా రాష్ట్రంతో పాటు రా ష్టేతర ప్రాంతాల్లోనూ వేలాది ధ్వన్యను కరణ ప్రదర్శనలు ఇచ్చి, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ నాయకులు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సినీ ప్రముఖులు, సి. నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య లాంటి సాహితీ వేత్తలతో పాటు పలు రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్న, ధర్మపు రి క్షేత్రానికి చెందిన గుండి ప్రేం కుమార్ పుట్టిన గడ్డపై దైవ సన్నిధిలో గంటకు పైగా ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం భక్తుల, యాత్రికుల, కళాకారుల నిర్వాహకులను ఆకట్టుకుంది. ప్రధానంగా వివిధ పక్షుల కూతలు, జంతువుల అరుపు లు, మువ్వల సవ్వడులు, హర్షధ్వనాలు, వివిధ ప్రయాణ సాధనాల ధ్వనులు, సితార్ వాద్యను కరణలు ఆహూతుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. దేవస్థానం పక్షాన మిమిక్రీ చక్రవర్తి ప్రేం కుమార్ను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇండియా vs సౌత్ ఆఫ్రికా — ఎడెన్ గార్డెన్స్‌లో, సౌత్ ఆఫ్రికా ఉత్కంఠ భరిత విజయం
ఇండియా vs సౌతాఫ్రికా ఎడెన్ గార్డెన్స్ టెస్ట్ 2025లో సౌతాఫ్రికా 30 రన్లతో గెలిచింది. బుమ్రా ఫైవర్, హ్యార్మర్ 8 వికెట్లు, బవుమా కీలక ఇన్నింగ్స్, ఇండియా 93కి ఆలౌట్ – పూర్తి మ్యాచ్ విశ్లేషణ ఇక్కడ చదవండి. రామోజీరావు ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రకటన
రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్–2025 ఈ సంవత్సరం మరోసారి సేవ, ప్రతిభ, కృషికి ఇచ్చే గౌరవం ఎంత గొప్పదో నిరూపించాయి. సమాజానికి నిజమైన సేవచేసే వ్యక్తులకు ఇది మరొక ప్రమేయం, మరొక ప్రోత్సాహం. మా నిధుల మూలం ‘గురు దక్షిణ’ : RSS చీఫ్.మోహన్ భగవత్
స్వయంసేవకులు తమ అవసరాలను తగ్గించుకుని, స్వచ్ఛందంగా సంస్థకు సహకరిస్తారు : మోహన్ భగవత్
జైపూర్ రాజస్తాన్, నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్వసంఘచాలకుడు మోహన్ భగవత్ జైపూర్‌లో జరిగిన, వంద సంవత్సరాల RSS సభలో, ఆర్ఎస్ఎస్ ప్రయాణం, సేవా కార్యకర్తల త్యాగం, సంస్థ నిధుల వ్యవస్థపై విశదీకరించారు. సంఘం... తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి రెండు కీలక ఫిర్యాదులు; విచారణకు ఆదేశాలు
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):
తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ (TGHRC) చైర్మన్ గౌరవనీయ న్యాయమూర్తి డా. జస్టిస్ షమీమ్ అక్థర్ ఆధ్వర్యంలో రెండు వేర్వేరు మానవ హక్కుల ఉల్లంఘన కేసులను స్వయంగా నమోదు చేసి సంబంధిత అధికారులకు విచారణకు సంబంధించి కీలక దిశానిర్దేశాలు జారీ చేసింది.
మంథనిలో పోలీసులు కొట్టడంతో యువకుడు మృతి... రాజకీయ నాయకురాలిగా ఎదిగిన గాయని మైథిలి ఠాకూర్
తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీకి ఎన్నికైన మైథిలీ ఠాకూర్
పాట్నా నవంబర్ 16:
మైథిలీ ఠాకూర్ , సుప్రసిద్ధ ఫోక్-శాస్త్రీయ గాయికగా పిలువబడే యువ ప్రతిభ. 2000 జూలై 25న బిహార్ మధుబాని జిల్లా బెనిపట్టీలో జన్మించింది. ఆమె సంగీత ప్రస్థానం చిన్న వయసులో ప్రారంభమైంది — తండ్రి రమేష్ ఠాకూర్ వలన ఆమె బాల్యానికి సంగీత... రాజ్‌కోట్‌లో భారత్-A బౌలర్లు నిప్పులు: SA-A 132 రన్లకే ఆలౌట్
రాజ్‌కోట్, నవంబర్ 16:
రాజ్‌కోట్‌లోని నిరంజన్ స్టేడియంలో జరిగిన India A vs South Africa A రెండవ అనధికార ODIలో భారత A జట్టు బౌలర్లు బిజీగా ఉన్నారు. టాస్ గెలిచిన SA-A జట్టు బ్యాటింగ్ తీసుకున్నప్పటికే వ్యాప్తి వచ్చింది — భారత బౌలర్లు ధాటికి SA-A 30.3 ఓవర్లు వేసినప్పుడు కేవలం ... నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయ–ఆర్థిక ఏటీఎంగా మారింది: జీవన్ రెడ్డి
నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయంగా, ఆర్థికంగా ఏటీఎంగా మారిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. లబ్ధిదారుల ఓటు చోరీ కుట్రపై చర్యలు చేపట్టాలని డిమాండ్. జర్నలిస్టుల ఐక్యతపై డబ్ల్యూజేఐ దృష్టి –కరీంనగర్ జిల్లా కొత్త కార్యవర్గం ఎన్నిక
కరీంనగర్, నవంబర్ 16 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడమే సంస్థ ప్రధాన లక్ష్యమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కరీంనగర్ సప్తగిరి కాలనీలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో డబ్ల్యూజేఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన... 2026 హార్లీ-డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ 883 జనవరిలో లాంచ్ – కొత్త ఫీచర్లతో అదిరిపోయే క్రూజర్
న్యూయార్క్ నవంబర్ 16:
ప్రపంచవ్యాప్తంగా బైక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 Harley-Davidson Sportster 883 చివరకు జనవరి 2026లో అధికారికంగా లాంచ్ కానుంది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, రైడింగ్ కంఫర్ట్—మొత్తంగా హార్లీ బ్రాండ్‌కి తగ్గట్టే ఈ మోడల్ అందరినీ ఆకట్టుకోనుంది.
హార్లీ-డేవిడ్సన్లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో స్పోర్ట్‌స్టర్ 883 ఒకటి. తాజా... కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగం పట్ల స్పష్టమైన చర్యలు తీసుకోలేదు:: కల్వకుంట్ల కవిత
టీజేటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం“తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” అంశంపై నిపుణుల చర్చ, కవిత వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజా మంటలు);
తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో “తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొని పలు... శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఘనంగా జయంతి ఉత్సవాలు ప్రారంభం
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయముజగిత్యాల లో ఘనంగా ప్రారంభమైన శ్రీ ధన్వంతరి జయంతోత్సవము మరియు శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవము
మొదటి రోజునవంబర్ 16 ఆదివారం (భానువాసరే కార్తీక మాసం శుక్ల పక్షం ద్వాదశి ఉ.గం. 5.15 ని.ల... సన్మార్గంలో నడిపించే శక్తి.. సంగీత, సాహిత్యాల సొంతం తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు)సమాజాన్ని సన్మార్గంలో నడిపించే శక్తి సంగీతం సాహిత్యాల సొంతమని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పుల్లూరి నారాయణ దాసు ఆశ్రమం ఆవరణలో సంగీత సాహిత్య సామాజిక సేవా సంస్థ కలం స్నేహం అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో... 