భక్తుల కొంగు బంగారం భక్త మార్కండేయ దేవాలయం నేటి నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు
భక్తుల కొంగు బంగారం భక్త మార్కండేయ దేవాలయం
నేటి నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు
గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని నడి బొడ్డున ఉన్న శ్రీ భక్త మార్కండేయ దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ ఆలయం జిల్లా కేంద్రంలో దివ్య క్షేత్రంగా వెలుగుతుంది. 49వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని పద్మశాలి సేవా సంఘం, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముస్తాబు చేశారు. కాగా శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో శ్రీ గాయత్రీ మాత, శ్రీ భక్త మార్కండేయుడు, శ్రీ సీతారామంజనేయ స్వామి, శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ గణపతి స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, కొలువై ఉన్నారు. నిత్యం భక్తులు ఈ ఆలయానికి వస్తూ పూజలు నిర్వహిస్తూ మొక్కలు చెల్లించుకోవడంతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది.
ఆదివారం 09 ఫిబ్రవరి నుంచి 13వ తేదీ వరకు ఆలయంలో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలను వేద బ్రామ్మణుల మంత్రోచ్ఛారణ మధ్య బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు. మొదటి రోజు ఆదివారం రోజున ఉదయం 9.00 ని'లకు గణపతి, గౌరీ పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కంకణధారణ, ఋత్విక్ వర్ణనం, నవగ్రహ చతుషష్టి యోగిని, వాస్తుక్షేత్రపాలక, లింగతోభద్ర దేవతల స్థాపన, సాయంత్రం నుండి ధ్వజారోహణం, అంకురారోపణ, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణతో ప్రారంభమై సోమవారం ఉ"9:00ని"లకు స్థాపిత దేవతారాధన, అగ్ని ప్రతిష్ట, గణపతి హవనం, తీర్థప్రసాద వితరణ, మంగళవారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతల పూజ, వేదమాత గాయత్రీ మాతకు పంచామృత అభిషేకం, స్థాపిత దేవత హవనం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది.
సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణం, డోలోత్సవం, వేద సదస్సు, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, బుదవారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతలకు రుద్రాభిషేకం, రుద్ర హవనం, మన్యుసూత్ర పారాయణం, పంచసుక్త హవనం, వసంతోత్సవం, మంగళహారతి, మంతపుష్పం, తీర్థప్రసాద వితరణ, గురువారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతల పూజ, హవనం, బలిహరణం, పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ, నాకబలి, ధ్వజారోహణం, కుంభోద్వాసన, దేవతాప్రొక్షణం, పల్లకి సేవ, ఏకంతసేవ, మహదాశిర్వచనం, ఆచార్య రుత్విక్ సన్మానం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తుందని పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
ఐదు రోజుల పాటు వేడుకలు బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా దేవాలయంలో ప్రధాన అర్చకులు మేడిపెల్లి శ్రీనివాస్ శర్మ పాటు, శ్రీ తిగుళ్ల విష్ణు శర్మ, ఆంజనేయ శర్మ, ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల వేడుకలు నిర్వహించనున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రిపబ్లిక్ డే పరేడ్లో తొలిసారి ‘యానిమల్ కంటింజెంట్’
న్యూఢిల్లీ, జనవరి 01 (ప్రజా మంటలు):
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈసారి ఒక ప్రత్యేక ఆకర్షణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో ‘యానిమల్ కంటింజెంట్’ ను ప్రవేశపెట్టనుంది. ఇది దేశ సైనిక చరిత్రలోనే ఓ వినూత్న ఘట్టంగా నిలవనుంది.
ఈ యానిమల్... అయ్యప్ప ఆలయంలో దావ వసంత సురేష్ ప్రత్యేక పూజలు
జగిత్యాల జనవరి 01 (ప్రజా మంటలు):
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు.
అనంతరం జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ,... నూతన సంవత్సర సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అడ్లూరి
జగిత్యాల/వేములవాడ జనవరి 01 (ప్రజా మంటలు):
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని, అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.... కేసీఆర్ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపిన కరీంనగర్ ఎమ్మెల్సీ
సిద్దిపేట జనవరి 01 (ప్రజా మంటలు):
తెలంగాణ శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించినందుకు కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి గ్రామంలోని కేసీఆర్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా... హైదరాబాద్లో న్యూ ఇయర్ కిక్కే ‘కిక్కు’ – రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు
హైదరాబాద్ జనవరి 01 (ప్రజా మంటలు):
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భాగ్యనగర వాసులు అంబరాన్నంటే సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి వేళ నగరం మొత్తం వెలుగుల్లో మునిగిపోయి ఉత్సాహంగా కనిపించింది. అయితే ఈ ఉత్సవాల వెనుక నిబంధనల ఉల్లంఘనలు తీవ్రంగా చోటుచేసుకున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు.
న్యూ ఇయర్... మైనర్పై అత్యాచార కేసులో రాజేంద్ర సిసోడియా అరెస్ట్
మథుర, (ఉత్తరప్రదేశ్)| జనవరి 01:
ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లా పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన రాజేంద్ర సిసోడియా చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటన కొన్ని వారాల క్రితం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం... మంత్రి కైలాష్ విజయవర్గీయ వ్యాఖ్యలపై వివాదం – విచారం వ్యక్తం చేసిన మంత్రి:
ఇండోర్ జనవరి 01 (ప్రజా మంటలు):
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలోని భగీరథపురం ప్రాంతంలో కలుషిత తాగునీటి కారణంగా చోటుచేసుకున్న డయేరియా వ్యాప్తి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రశ్నించిన మీడియాపై రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఆరోగ్య శాఖ సమాచారం... గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైదరాబాద్, జనవరి 01 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సానుకూల చర్చ జరిపారు. జిల్లా కేంద్రంలో పోలీసుల అలర్ట్
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలో న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ,టౌన్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం ,టౌన్ ఎస్ఐలు... జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రధాన ప్రమాదాలు, రాజకీయ–సామాజిక ఘటనలు
జగిత్యాల జిల్లా – ముఖ్య ఘటనలు (2025)(సంక్షిప్తంగా – తేదీలతో)
🔴 ప్రమాదాలు / దుర్ఘటనలు
జనవరి 6, 2025 – మెట్పల్లి సమీపంలో కారు–లారీ ఢీకొని ఇద్దరు మృతి.
జనవరి 18, 2025 – కోరుట్ల మండలంలో విద్యుత్ షాక్తో రైతు మృతి.
ఫిబ్రవరి 2, 2025 – జగిత్యాల పట్టణంలో అగ్ని... నూతన సంవత్సరానికి స్వాగతంగా నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేసిన స్కై ఫౌండేషన్.
సికింద్రాబాద్ డిసెంబర్ 31 (ప్రజా మంటలు):
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులు, అనాధలకు మానవతా కార్యక్రమం నిర్వహించారు. విపరీతమైన చలితో ఇబ్బందులు పడుతున్న ఫుట్పాత్లపై నివసించే నిరాశ్రయుల్ని దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వేళ దుప్పట్ల పంపిణీ చేపట్టారు.
ఈ సందర్భంగా స్కై ఫౌండేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డాక్టర్ వై.... టి.పి.టి.ఎఫ్ నూతన సంవత్సర(2026) కాలమణిని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు ఎం.సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 31 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల-వైద్యులు సూద కళ్యాణ్ కుమార్, బిల్డర్&సర్వేయర్ వెయ్య గంగయ్య గార్ల సౌజన్యంతో రూపొందించిన టీ.పీ.టీ.ఎఫ్ జగిత్యాల జిల్లాశాఖ టేబుల్ మరియు వాల్ క్యాలెండర్ లను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించడం జరిగినది.
ఈ సందర్భంగా
ఈ... 