భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ జయంతి వేడుకలు
జగిత్యాల జనవరి 23 (ప్రజా మంటలు) భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో గురువారం జగిత్యాల పట్టణంలోని తహశీల్దార్ చౌరస్తా వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1887 జనవరి 23వ తేదీన కటక్ లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగం విడిచిపెట్టి దేశ స్వాతంత్య్రం కోసం కదనరంగంలో దూకిన ధైర్యశాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, బ్రిటిష్ వారిని మనదేశం నుంచి తరిమికొట్టడానికి సైనిక చర్య ద్వారానే సాధ్యం అని నమ్మి 'ఇండియన్ నేషనల్ ఆర్మీ'ని స్థాపించాడని.
ఎందరో యువకులను స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేటట్టు చేశాడని. 'మీ రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను' అని ఉర్రూతలూగించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ACS రాజు, మ్యాన మహేష్, పుప్పాల సత్యనారాయన, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెల్లీ కాశీ నాదం, జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్ , చందా సుగునాకర్ రావు, ఒడ్డపెల్లి మురళి, వేముల పొచమల్లు, చీట్ల గంగాధర్, సూర్యప్రకాష్,బండారి మల్లికార్జున్, నారేందులా శ్రీనివాస్, బండి సత్యనారాయన, మహేష్, గదాసు భూమయ్య, ఎడమల వెంకట్ రెడ్డి,కొత్తకొండ బాలయ్య, సిరిపురం గంగారాం,తునికీ అంజన్న, సంపత్ రావు, భోగ డేవన్న, బొంధుకురి శ్రీనివాస్, విఠల్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అమెరికా తర్వాత అతి పెద్ద ఏఐ పెట్టుబడి భారత్లోనే — సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం రాబోతోంది - గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
.jpeg)
బీర్ పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నూతన ట్రస్ట్ బోర్డ్

నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య

దీపావళి సందర్భంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి - చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి

యూఎస్ లో అడ్వాన్స్ దీపావళి వేడుకలు

మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ఏఐసీసీ జిల్లా ఇన్చార్జ్ జయ కుమార్ ను కలిసిన షేక్ చాంద్ పాషా

జ్యోతి సురేఖ వెన్నం – భారతీయ ఆర్చరీలోతెలుగు గర్వం
.jpg)
జ్యోతి సురేఖ వెన్నం చరిత్ర సృష్టించింది – వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పతకం!

జిల్లా సమాచార మరియు పౌరసంబంధాల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జెడ్పి డిప్యూటీ సిఈవో పి.నరేష్

42 శాతం బీసీ బిల్లుకు టిపిసిసి లీగల్ సెల్ మద్దతు

42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
