బీసీ నాయకుల చే బీసీ కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
కరీంనగర్ నవంబర్ 1 (ప్రజా మంటలు) :
తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ కి మెమోరాండం అఫిడవిట్ సమర్పించిన జగిత్యాల జిల్లా బీసీ నాయకులు...
విషయం: తెలంగాణలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు గత 76 సంవత్సరాలుగా వెనుకబడి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బి సి లకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లను కల్పించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బి సి లకు ఇస్తున్న పథకాలకు చట్టబద్ధత కల్పించాలని విన్నపం.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...... తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి ఎస్సీ ఎస్టీ మైనార్టీల వారితో పోల్చుకుంటే 76 సంవత్సరాలనుండి అన్యాయం జరుగుతున్నది.
ప్రధానంగా గత పది సంవత్సరాల కాలంలో బి సి- ఎం బి సి కార్పొరేషన్ లు ఏర్పాటు చేసినప్పటికీ అమలు విషయానికి వస్తే చాలా అన్యాయం జరుగుతుంది.
బి సి- ఎం బి సి లను బాగుపరుస్తామని చెప్పిన గత ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ రుణాలు ఇవ్వకపోవడం తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన కులవృత్తుల వారు నానా ఇబ్బందులకు గురైనారు.
బి సి ల బతుకు దుర్భరంగా మారాయి. కుల వృత్తులకు ఆదరణ కరువైంది. ఇప్పటికైనా మేం ప్రతిపాదిస్తున్న ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి అమలుకు తగు చట్ట పరిధిలో చర్యలు చేపట్టడం ఆదేశించగలరని మా యొక్క అభ్యర్థన.
- తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి చట్టబద్ధత చేయాలి.
- రాష్ట్రంలోని కులవృత్తుల వారికి బి సి కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలి.
- బి సి ఉద్యోగులకు ప్రమోషన్లలో 42% రిజర్వేషన్ కల్పించాలి.
- రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణనను చేపట్టి చట్టబద్ధత కల్పించాలి.
- పార్టీలకు అతీతంగా ఆయా పార్టీలలో పనిచేస్తున్న బి సి నాయకులకు తప్పకుండా వారికి 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు అవకాశం ఇవ్వాలి.
- తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 66% బి సి లము "మేమెంతో మాకంతవాటా" అనే నినాదం అమలు చేయాలి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, నియోజకవర్గ అధ్యక్షురాలు బిసి సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు గుంటి గంగారాం, బిసి సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు నులుగొండ సురేష్, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
