హరిహరులకు ప్రీతికరం కార్తీకమాసం. - చెరుకు మహేశ్వర శర్మ.
నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 01 నవంబర్ (ప్రజా మంటలు) :
తెలుగు సంవత్సరం లోఎనిమిదో నెల కార్తీకమాసం.
పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకమాసం. సనాతన వైదిక ధర్మం ప్రకారం కార్తీక మాసం శివ కేశవుల పూజలకు చాలా పవిత్రమైనది.
ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైనదని తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ వివరించారు.
నా కార్తకసమో మాసో క కృతేన సమం యుగమ్,న వేదసదృశం శాస్త్రం స తీర్థం గంగయా సమమ్ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానదిని మించిన మరో నది లేనేేలేదు అని అర్ధం.
ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు.
దీపదానాలు చేయలేనివారు దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకరసంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు అని పేరు వచ్చింది.
అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునికి శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజిస్తే స్వర్గలోకంలో లక్ష సంవత్సరాలు జీవించవచ్చునంటారు.
పరమేశ్వరుడు ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాలమంటారు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహనికి పాత్రులవుతారు.
శివాలయాలలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెపుతున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్థంఅని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణవ్రతం, విష్ణ సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీకమాసంలో ఏ మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది.
కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీస్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. నదీ స్నానం చేయటం వల్ల శారీరక రుగ్మతలు తొలగుతాయని చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.మహిళలు వేకువనే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధ చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.
మాసమంత స్నాన విధిని పాటించలేనివారు పుణ్య తిథులలోనైన స్నానం ఆచరించాలి. కార్తీక మాసం ఆరంభం నుండే ‘ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజామందిరాలు, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఇహ, పర సౌఖ్యాలు కలుగచేస్తుంది.
ఈ మాసంలో ఉత్థానైకాదశి కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసానికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది. ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశదీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశదీపం.
కార్తీక దీపంలో రెండు వత్తులో కలిగి రెండు రెండుగా వేయడం లేదా మూడు వంతులు కలిపి వేయడం విశేషం. ఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీప దానానికి ఒక విశిష్టత ఉన్నది. ఈ మాసంలో ఒకసారి దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది.
అందుకే కార్తీకమాసంలో నెలంతా దీపదానాలు చేస్తారు. ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్ని దేవతలకి ప్రతీయకయైన గోవుని దూడతో కలిసి పూజిస్తారు. గోవును పూజించలేనివారు శక్తికొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశవృద్ది జరుగుతుంది. ఈ నెలలో తులసిమొక్కకు ఉసిరి చెట్టు కు పూజచేయడం, తులసి ఉసిరి కళ్యాణం విశేషంగా చెపుతారు.
ఈ మాసంలో సత్యనారాణ స్వామి వ్రతాన్ని ప్రధానంగా ఆచరిస్తారు కార్తీక దామోదర స్వరూపమైన ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద వత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు.
వనభోజనాలు: కార్తీక వనభోజనాలు అందరికీ తెలిసినవే కానీ కార్తీక మాసంలోనే చేయడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి, స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండేటువంటి వనానికి వెళ్లి, అక్కడే వంటలు చేసుకుని అందరూ కలిసి భోజనం చేసి సరదాగా గడపడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ప్రకృతిపరమైన సంరక్షణ జ్ఞానం వంటివి కలుగుతాయి.
అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లి మండలంలో 6 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
పంచాయతి ఎన్నికలు -2025 మండలం లోని మూడవ విడతలో 6 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో తేది 3 నుండి 5 వరకు సర్పంచి మరియు వార్డు సభ్యులకు 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గొల్లపల్లి మండలంలోని 27 గ్రామాలను ఆరు క్లస్టర్లుగా 6 కేంద్రాలు విభజించారు.... బాల్య వివాహాలపై అవగాహన సదస్సు.
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 01 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోనీ వర్షకొండ గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో బాల్య వివాహం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది హేమశ్రీ మాట్లాడుతూ గ్రామ సభ్యులకు,పాఠశాల విద్యార్థులకు, మరియు తల్లులకు,కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి... ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు చేయూత...
కొండగట్టు డిసెంబర్ 1(ప్రజా మంటలు)ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు సోమవారం రూపాయలు 40 వేల విలువగల దుస్తువులను కంపెనీ ప్రతినిధులు అందజేశారు.
ఈ సందర్బంగా కంపెనీ ASM రమేష్ కుమార్ , CFA ఏజెంట్ వూటూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం కొండగట్టులోని... హెచ్ఐవీ బాధితులు ఆందోళన చెందొద్దు : సూపరింటెండెంట్ డాక్టర్ వాణి
గాంధీ ఏఆర్టీ సెంటర్ లో అందుబాటులో చక్కటి వైద్యం
సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు) : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాంధీ ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం,ఎ.ఆర్.టి. సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ, అవేర్నెస్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ వాణి హాజరయ్యారు.
అనంతరం ఎ ఆర్... మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు)
మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 28 లక్షల విలువగల 136 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ... ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తప్పవు : ఐడీహెచ్ కాలనీలో బోర్డు పెట్టిన రెవిన్యూ సిబ్బంది
సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు):బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడా ఐడిహెచ్ కాలనీ లోని ఉన్న భూమి ప్రభుత్వానికి చెందినదని స్పష్టంచేస్తూ సికింద్రాబాద్ తహాసీల్దార్ కార్యాలయ సిబ్బంది సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
ఈ భూమి ప్రభుత్వానికి చెందిన భూమి...అక్రమంగా ఆక్రమించే వారికి కఠిన చర్యలు తప్పవు.. అని బోర్డుపై పేర్కొన్నారు. సదరు... ఈశ్వరీబాయి పోరాట పటిమ అందరికీ ఆదర్శం : ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్- కంటోన్మెంట్, డిసెంబర్ 01 ( ప్రజా మంటలు):
ఈశ్వరీబాయి 107వ జయంతి వేడుకలు మారేడ్పల్లిలో సోమవారం ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, మాజీ మంత్రి గీతారెడ్డి ఈశ్వరీబాయి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ— మహిళా సాధికారతకు ప్రతీక అయిన ఈశ్వరీబాయి 100 ఏళ్ల క్రితమే లింగ వివక్షను ఎదుర్కొంటూ ఉన్నత... ‘భూతశుద్ధి వివాహం’ అంటే ఏమిటి?
హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
సమంత–రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూరు ఈషా యోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో ‘భూతశుద్ధి వివాహం’ పద్ధతిలో జరిగినట్లు ఈషా సంస్థ వెల్లడించింది. ఈ వార్త బయటకు రావడంతో భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? అనే ఆసక్తి అందరిలో పెరిగింది.
ఈషా నిర్వాహకుల వివరణ ప్రకారం, భూతశుద్ధి వివాహం అనేది... సీనియర్ సిటిజెన్స్ డిమాండ్లు పరిష్కరించాలి. -టాస్కా జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
జగిత్యాల డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ డిమాండ్లు సత్వరం పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రం లోని టాస్కా కార్యాలయంలో అయన విలేకరులతో మాట్లాడారు.సీనియర్ సిటిజెన్స్ సమస్యలు పరిష్కారం, సంక్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో సీనియర్... సినీనటి సమంత–రాజ్ నిడిమోరు వివాహం
కోయంబత్తూరులో
హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
టాలీవుడ్ స్టార్ సమంత రూత్ ప్రభు దర్శకుడు రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ – లింగభైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న ఇద్దరూ, కుటుంబ సభ్యులు–సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయ భూతశుద్ధి వివాహం విధానం ద్వారా... ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే మేలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)ఎయిడ్స్ కు చికిత్స కంటే .. నివారణే మేలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజ గౌడ్ అన్నారు
యువత ఎట్టి పరిస్థితుల్లోని ఎయిడ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలనీ
సోమవారం రోజున ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ... గీతా భవన్ లో ఘనంగా గీత జయంతి వేడుకలు
జగిత్యాల డిసెంబర్ 1 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో గీతా జయంతి పురస్కరించుకొని గీతా సత్సంగం 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు.
ఉదయం సంపూర్ణ సామూహిక శ్రీలక్ష్మి అష్టోత్తర సహిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, మరియు శ్రీమద్భవద్గీత 18... 