హరిహరులకు ప్రీతికరం కార్తీకమాసం. - చెరుకు మహేశ్వర శర్మ.
నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 01 నవంబర్ (ప్రజా మంటలు) :
తెలుగు సంవత్సరం లోఎనిమిదో నెల కార్తీకమాసం.
పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకమాసం. సనాతన వైదిక ధర్మం ప్రకారం కార్తీక మాసం శివ కేశవుల పూజలకు చాలా పవిత్రమైనది.
ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రదమైనదని తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ వివరించారు.
నా కార్తకసమో మాసో క కృతేన సమం యుగమ్,న వేదసదృశం శాస్త్రం స తీర్థం గంగయా సమమ్ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానదిని మించిన మరో నది లేనేేలేదు అని అర్ధం.
ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు.
దీపదానాలు చేయలేనివారు దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకరసంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు అని పేరు వచ్చింది.
అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపరాచాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుడిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగచేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునికి శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజిస్తే స్వర్గలోకంలో లక్ష సంవత్సరాలు జీవించవచ్చునంటారు.
పరమేశ్వరుడు ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోషకాలమంటారు. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహనికి పాత్రులవుతారు.
శివాలయాలలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెపుతున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్థంఅని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణవ్రతం, విష్ణ సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీకమాసంలో ఏ మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది.
కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణ చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీస్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాలలో కలుస్తుంది. నదీ స్నానం చేయటం వల్ల శారీరక రుగ్మతలు తొలగుతాయని చెరుకు మహేశ్వర శర్మ తెలిపారు.మహిళలు వేకువనే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధ చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.
మాసమంత స్నాన విధిని పాటించలేనివారు పుణ్య తిథులలోనైన స్నానం ఆచరించాలి. కార్తీక మాసం ఆరంభం నుండే ‘ఆకాశదీపం ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజామందిరాలు, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఇహ, పర సౌఖ్యాలు కలుగచేస్తుంది.
ఈ మాసంలో ఉత్థానైకాదశి కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి వంటి దినాలు ప్రశస్తమైనవి. ఈ మాసానికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది. ఈ మాసంలో దీపాలను రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశదీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశదీపం.
కార్తీక దీపంలో రెండు వత్తులో కలిగి రెండు రెండుగా వేయడం లేదా మూడు వంతులు కలిపి వేయడం విశేషం. ఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటిని ఉపయోగిస్తారు. కార్తీకంలో దీప దానానికి ఒక విశిష్టత ఉన్నది. ఈ మాసంలో ఒకసారి దీప దానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది.
అందుకే కార్తీకమాసంలో నెలంతా దీపదానాలు చేస్తారు. ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్ని దేవతలకి ప్రతీయకయైన గోవుని దూడతో కలిసి పూజిస్తారు. గోవును పూజించలేనివారు శక్తికొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశవృద్ది జరుగుతుంది. ఈ నెలలో తులసిమొక్కకు ఉసిరి చెట్టు కు పూజచేయడం, తులసి ఉసిరి కళ్యాణం విశేషంగా చెపుతారు.
ఈ మాసంలో సత్యనారాణ స్వామి వ్రతాన్ని ప్రధానంగా ఆచరిస్తారు కార్తీక దామోదర స్వరూపమైన ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద వత్తి వెలిగించి దానమివ్వడం చేస్తారు.
వనభోజనాలు: కార్తీక వనభోజనాలు అందరికీ తెలిసినవే కానీ కార్తీక మాసంలోనే చేయడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి, స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండేటువంటి వనానికి వెళ్లి, అక్కడే వంటలు చేసుకుని అందరూ కలిసి భోజనం చేసి సరదాగా గడపడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ప్రకృతిపరమైన సంరక్షణ జ్ఞానం వంటివి కలుగుతాయి.
అన్ని మాసాల్లోకి విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
చేవెళ్ల బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డాక్టర్ జీ. చిన్నారెడ్డి
క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించి, రోడ్డు భద్రతపై తక్షణ చర్యల హామీ
చేవెళ్ల, నవంబర్ 03 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి స్వయంగా పరిశీలించారు. టిప్పర్ లారీ – ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో... “మంగోలియాలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా విమానం
మధ్య గగనంలో భయం – శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మంగోలియాలో అత్యవసర ల్యాండింగ్
సాంకేతిక లోపం గుర్తించిన సిబ్బంది – ప్రయాణికుల భద్రత కోసం ఉలాన్‌బాతర్‌లో సురక్షిత ల్యాండింగ్
న్యూఢిల్లీ నవంబర్ 03 :శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రయాణికుల విమానం (AI-176)... జగిత్యాల పట్టణంలో ప్రమాదాలకు నిలువైన యావరోడ్ విస్తరణకు ప్రజా వినతి
కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన పట్టణ అభివృద్ధి ప్రజా సేవా సంఘం సభ్యులు
జగిత్యాల, నవంబర్ 03 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ఉన్న యావరోడ్ విస్తరణ లేదా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలంటూ జగిత్యాల పట్టణ అభివృద్ధి ప్రజా సేవా సంఘం తరఫున జిల్లా కలెక్టర్ గారికి... షాద్ నగర్ సాంఘిక సంక్షేమ కాలేజీని ఆకస్మికంగా సందర్శించిన చిన్నారెడ్డి
కాలేజీ దుస్థితిపై ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక ఇవ్వనున్న ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్
- షాద్ నగర్ సాంఘిక సంక్షేమ కాలేజీలో విద్యార్థినుల ఆందోళన- చిన్నారెడ్డి ఆకస్మికంగా కాలేజీకి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు- విద్యార్థులతో భోజనం చేసి, సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరణ- వాష్‌రూములు, తరగతిగదుల దుస్థితిపై ఆందోళన- సీఎంకు... శ్రీ ఉజ్జయిని టెంపుల్ లో కార్తీక మాస ఉత్సవాలు
పాల్గొన్న జిల్లా కలెక్టర్, నార్త్ జోన్ డీసీపీ
సికింద్రాబాద్, నవంబర్ 03 (ప్రజామంటలు) :
కార్తీక మాసం రెండో సోమవారం సందర్బంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా హాజరైన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ లు ఆలయంలో దీపాలు... తిరువణ్ణామలైలోని జవ్వధు కొండ కోవిలార్ తవ్వకంలో చోళుల కాలానికి చెందిన అసమానమైన బంగారు నాణేలు
తిరువణ్ణామలై నవంబర్ 03:
స్థానిక పునర్నిర్మాణ పనుల సందర్భంగా జవ్వధు కొండ (కోవిలూర్) ప్రాంతంలో తవ్విన గుంటలో బంగారు నాణేల సమూహం కనబడినట్లు స్థానికుల ద్వారా స్పందన వస్తోంది; అధికార మరియు పురావస్తు విచారణ ఇంకా ఇంకా కొనసాగుతోంది.
తిరువణ్ణామలై గ్రామస్థుల మరియు దేవాలయ పునర్నిర్మాణం చేపట్టిన బృందం ఈ మధ్యస్థ మధ్య తవ్వినపుడు ఒక... విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
సికింద్రాబాద్, నవంబర్ 03 (ప్రజామంటలు) :
విద్యుత్ సమస్యల పరిష్కారానికి తాము ఎల్లవేళలా సిద్దంగా ఉన్నామని, కస్టమర్లు తమ సమస్యలను సమీపంలోని విద్యుత్ కార్యాలయం, లేదా ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ లో తెలపాలని విద్యుత్ ఏడీఈ మహేశ్ అన్నారు. సోమవారం గాంధీ ఆసుపత్రి సమీపంలోని విద్యుత్ శాఖ ప్యారడైజ్ డివిజన్ ఆపరేషన్ విద్యుత్ కార్యాలయ... కొడంగల్‌లో అక్షయపాత్ర ఫౌండేషన్ – ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
- నవంబర్ 14న ఎన్కేపల్లిలో గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ భూమి పూజ- మొత్తం 312 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు- CSR నిధులతో అక్షయపాత్ర ఫౌండేషన్ అదనపు వ్యయం భరిస్తుంది- కొడంగల్‌లో విద్యా రంగంలో ఇది మరో మైలురాయిగా భావిస్తున్నారు
కొడంగల్, నవంబర్ 03 (ప్రజా మంటలు):కొడంగల్ నియోజకవర్గంలోని... పత్తి కొనుగోలులో తేమ ప్రమాణాలు సడలించాలి: కేంద్ర మంత్రికి కల్వకుంట్ల కవిత లేఖ
- మోంథా తుఫాన్ ప్రభావంతో పత్తిలో తేమ శాతం 25% వరకు పెరుగుదల- సీసీఐ కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు- 25% వరకు తేమ ఉన్న పత్తికి మద్దతు ధర ఇవ్వాలని కవిత డిమాండ్- కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాసిన కవిత- తెలంగాణ పత్తి... తరుణం బ్రిడ్జి వెంటనే పూర్తి చేయాలి: కల్వకుంట్ల కవిత
జాగృతి జనంబాట పర్యటనలో తరుణం బ్రిడ్జి పరిశీలన
ముఖ్యాంశాలు:
- బేల, జైనాథ్ మండలాల మధ్య తరుణం బ్రిడ్జి పరిశీలించిన కవిత- రూ. 4 కోట్లతో చిన్న బ్రిడ్జి నిర్మాణం – రోడ్డు కనెక్టివిటీ సమస్య- పాత బ్రిడ్జి కూల్చడంతో టూవీలర్లు కూడా వెళ్లలేని పరిస్థితి- మహారాష్ట్రతో కనెక్టివిటీ కోల్పోయే... ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి – తండ్రి బస్టాప్ వద్ద దింపిన గంటలోనే దుర్ఘటన
(పెద్ద కూతురు పెళ్లి సందర్భంలో తీసిన ఫోటో)
తండ్రి దింపిన గంటలోనే ముగ్గురు కుమార్తెల మృతి
రంగారెడ్డి, నవంబర్ 03 (ప్రజా మంటలు):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని షాక్‌కు గురి చేసింది. బీజాపూర్–హైదరాబాద్ జాతీయ రహదారిపై దూసుకెళ్లిన టిప్పర్ లారీ,... మెక్సికో హర్మోసిల్లోలో వాల్డోస్ సూపర్‌మార్కెట్‌లో ఘోర పేలుడు – 23 మంది దుర్మరణం
హర్మోసిల్లో (మెక్సికో), నవంబర్ 2:మెక్సికోలోని సోనోరా రాష్ట్ర రాజధాని హర్మోసిల్లోలో వాల్డోస్ డిస్కౌంట్ సూపర్‌మార్కెట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నవంబర్ 1న జరిగిన ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు.
ఈ దుర్ఘటన ‘డే ఆఫ్ ది డెడ్’ (Day of the... 