భారాస నుండి వెళ్లిపోయిన వారు తిరిగి రావాలి - జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
భారాస నుండి వెళ్లిపోయిన వారు తిరిగి రావాలి
- జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు
కోరుట్ల సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు) :
బారాస నుండి ఇతర పార్టీలలోకి వెళ్లినవారు ఆత్మ విమర్శ చేసుకొని అభివృద్ధి సంక్షేమం కోసం తిరిగి రావాలని, వారికి ఎల్లవేళలా భారత రాష్ట్ర సమితి స్వాగతం పలుకుతుందని బారాస జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. కోరుట్ల పట్టణంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత రెండు నెలల క్రితం పార్టీని వీడిన 30వ వార్డు కౌన్సిలర్ సజ్జు వాస్తవాలు గ్రహించి తిరిగి ఘర్ వాపసి బారాస లోకి తిరిగి రావడానికి ఆయన స్వాగతించారు. పాత్రికేయుల బారాస కార్యకర్తల సమావేశంలో ఆయనకు తిరిగి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
అభివృద్ధి సంక్షేమం కేసీఆర్ నాయకత్వంలోనే జరిగాయని, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ని ఎలాగా కొలుస్తున్నామో మనకు ప్రత్యేక తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం కృషిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను కూడా మనం అంతే గౌరవించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాలు మరిచి కెసిఆర్ ను బారాస నాయకులను తిట్టడం పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకొని అభివృద్ధి కోసం ఆలోచించాలని హితవుపలికారు.
హైడ్రా పేరుతో సొంత పార్టీ వాళ్లను వదిలేసి, బడా బాబులను వదిలేసి పేద మధ్యతరగతి వారి ఇండ్లు కూల్చేయడం సబబు కాదని, మీరు ప్రజల మేలుకోరే వారైతే ముందుగా వారికి ఇతర గృహాలు కేటాయించి అందులోకి మార్చిన తర్వాత వాటిని కూల్చేయాలని విజ్ఞప్తి చేశారు.
నాలుగు పర్యాయాలు తనకు కోరుట్ల ప్రజలు పట్టం కట్టారని అందుకు కోరుట్ల ప్రజలకు రుణపడి ఉంటాను అని మరొక మారు నా హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి తన తనయుడిని ఆశీర్వదించాలని తనలాగే తన తనయుడు కల్వకుంట్ల సంజయ్ అందరికీ అందుబాటులో ఉండి రాష్ట్రమంతా ప్రజా సమస్యల కోసం తిరుగుతూ ప్రజలలో మమేకమైతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కోరుట్ల పట్టణ ప్రజలు చాలా తెలివైన వారిని ఎక్కడ వారు చేసే పనులు బయటపడకుండా ఎలక్షన్ సమయంలో తగు నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బారాస నాయకులు సింగిరెడ్డి నారాయణరెడ్డి, చీటీ వెంకట్రావు, దారిశెట్టి రాజేష్, పహీం, రహీం పాషా బొమ్మ నరసయ్య గెల్లే గంగాధర్, పీర్ల సత్యం, అన్వర్, బాబా తదితరులున్నారు.
--------------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆడబిడ్డల ఆత్మగౌరవం,సంస్కృతికి ప్రతీక బతుకమ్మ కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
జగిత్యాల, అక్టోబర్ 14 (ప్రజా మంటలు)
బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని
మహిళలు... ఈనెల 30న ఇంద్రవెల్లిలో పాంచజన్య సంకల్ప సభ
హైదరాబాద్ అక్టోబర్ 14 (ప్రజా మంటలు):
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈనెల 30న తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు ఆవిష్కరించారు.
పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఇప్పటికే నిజామాబాద్, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య... సుదర్శన్ గౌడ్ కుటుంబానికి రూ.6 లక్షల ఆర్థిక సాయం
జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు):
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ మేరకు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌తో కలిసి బాధిత... టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కంతి మోహన్ రెడ్డీ
, హైదరాబాద్, అక్టోబర్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కంతి మోహన్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో 2026–28 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. పార్టీ అభివృద్ధికి గత కొన్ని సంవత్సరాలుగా మోహన్ రెడ్డి చేసిన సేవలను... మారుపాక"కు మరణo లేదు... నిరుపేదలకు సేవలు అందిస్తున్న ఆత్మీయుల రూపంలో వినోద్ బతికే..
" కోరుట్ల, అక్టోబర్ 13(ప్రజా మంటలు )
మారుపాక వినోద్ గత ఏడాది రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది అయితే ఆయన ఆత్మీయులు "మారుపాక"కు మరణo లేదని నిరుపేదలకు సేవల రూపంలో వినోద్ జీవించే ఉండాలనే ఆత్మీయులు ఆకాంక్ష.. కోరుట్ల పట్టణానికి చెందిన మారుపాక వినోద్ గత ఏడాది రోడ్డు ప్రమాదం లో అకాలమరణం... పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అంబారి పేట గ్రామ సర్పంచ్ గంగాధర్
జగిత్యాల అక్టోబర్ 12 (ప్రజా మంటలు)పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఇది కేవలం ప్రభుత్వం చేసే పని అని భావించరాదని అంబర్‌పేట సర్పంచ్ గంగాధర్ అన్నారు. దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల శోభాయాత్రలో డిస్కో పేపర్లు సల్లుతూ నృత్యాలు చేయడం మన సంస్కృతి కాదని శోభాయాత్రలో దేవతలపై పూలు చల్లడం మంగళహారతులు ఇవ్వడం మంగళ... సద్దుల బతుకమ్మ 18 వ తేదీ ఆదివారం విజయదశమి 20వ తేదీ మంగళవారం జరుపుకోవాలి నంబి వేణుగోపాల ఆచార్య జ్యోతిష్య, వాస్తు పండితులు
జగిత్యాల అక్టోబర్ 12 (ప్రజా మంటలు)ఈనెల 18వ తేదీన సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవాలని అదేవిధంగా మంగళవారం 20వ తేదీన విజయదశమి నిర్వహించుకోవాలని ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నంబి వేణుగోపాల ఆచార్య తెలియజేశారు.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పండుగల విషయంలో వేణుగోపాల ఆచార్యులను కలిసినప్పుడు పండుగల విశిష్టతలు వివరిస్తూ నిర్వహించుకునే తేదీలను పంచాంగాల ఆధారంగా... గజ్వేల్ తహశీల్దార్ స్వామి సస్పెండ్.. రైతుపై అనుచిత వ్యాఖ్యలే కారణం
సిద్దిపేట అక్టోబర్ 11, 2026
రైతుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్ పీహెచ్ స్వామిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రైతుతో మాట్లాడిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారి... జగిత్యాల మున్సిపాలిటీలో మొక్కల కొనుగోళ్లు, బయోమైనింగ్‌పై విచారణ జరపాలి - హనుమండ్ల జయశ్రే
జగిత్యాల, అక్టోబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీలో వనమహోత్సవం పేరుతో మొక్కల కొనుగోళ్లు, వాటి నిర్వహణ ఖర్చులు, బయోమైనింగ్ పనుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 10న తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు... శిశువుతో మహిళా జర్నలిస్టుకు సీసీఎస్‌లో గంటల తరబడి విచారణ
హైదరాబాద్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
ఆరు నెలల పసికందును చేతుల్లో ఎత్తుకుని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు వెళ్లిన మహిళా జర్నలిస్టు జల్లి రేఖను దాదాపు ఏడు గంటలపాటు అక్కడే ఉంచి ప్రశ్నించారనే ఆరోపణలు హైదరాబాద్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె వెంట మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. మహిళా... లక్ష్మీపూర్‌లో కోడి పందాలపై పోలీసుల దాడి
గొల్లపల్లి అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో గొల్లపల్లి పోలీసులు దాడి నిర్వహించారు.
గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి పోలీసులు లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు ఎనిమిది మంది వ్యక్తులు, మరికొందరు కలిసి... విద్యుత్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి
ఎల్కతుర్తి, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి 33/11 కేవీ సబ్స్టేషన్లతో పాటు 132/32 కేవీ భీమదేవరపల్లి సబ్‌స్టేషన్‌ను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న... 